SBI కస్టమర్లకు హెచ్చరిక.. మీ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేసుకున్నారా ? లేకపోతే ఇబ్బందులు తప్పవు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు గమనిక. ఈ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేసుకున్నారా ? లేదంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎస్బీఐ తన ట్విట్టర్ వేదికగా కస్టమర్లకు తెలియజేసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు గమనిక. ఈ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేసుకున్నారా ? లేదంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎస్బీఐ తన ట్విట్టర్ వేదికగా కస్టమర్లకు తెలియజేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉన్నవారికి ప్రభుత్వ సబ్సిడీలు రావాలంటే.. అలాగే అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేయడానికి ఆధార్ లింక్ తప్పనిసరి. నేరుగా ప్రభుత్వ సబ్సిడీలు తమ అకౌంట్లలోకి రావాలంటే.. ఆధార్ లింక్ చేయాలని.. లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. ఈ మేరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ద్వారా భారత ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రయోజనం లేదా సబ్సిడీ పొందాలనుకునేవారికి ఆధార్ కార్డ్ విత్తనాలు తప్పనిసరి అని మేము మా వినయోగదారులకు తెలియజేయాలనుకుంటున్నాము అని ఎస్బీఐ ట్వీట్ చేసింది.
We would like to inform our customers that Aadhaar Card seeding is mandatory for those desirous of receiving any benefit or subsidy from Govt. of India through Direct Benefit Transfer.#DirectBenefitTransfer #AadhaarCard pic.twitter.com/EICJUbBeVC
— State Bank of India (@TheOfficialSBI) February 17, 2021
మీ బ్యాంక్ అకౌంటుకు ఆధార్ నంబర్ లింక్ చేయడం అనేది తప్పనిసరి కాదని నిర్ణయించింది. కానీ ప్రభుత్వం రాయితీలను పొందడానికి బ్యాంక్ అకౌంటుకు ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి. ఎస్బీఐ ఖాతాదారులు తమ బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబరుకు లింక్ చేయడానికి అనేక రకాలున్నాయి. అవి ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ ఎటీఎంల ద్వారా, ఎస్బీఐ ఎనీవేర్ యాప్ ద్వారా.. నేరుగా ఎస్బీఐ బ్రాంచ్ ద్వారా ఆధార్ లింక్ చేయవచ్చు.
SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్..
☛ ముందుగా Www.onlinesbi.comకు లాగిన్ అవ్వాలి. ☛ ఆ తర్వాత ‘మై అకౌంట్స్’ ఆప్షన్ కింద్ లింక్ ‘మై ఆధార్ నంబర్’ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ☛ అనంతరం మీ అకౌంట్ నంబర్ సెలక్ట్ చేసి.. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ‘సబ్మిట్’ పై క్లిక్ చేయాలి. ☛ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ యొక్క చివరి 2 నంబర్లు డిస్ ప్లే అవుతాయి. ☛ అంతే మీ ఆధార్ నంబర్ అకౌంట్‌కు లింక్ అయినట్లుగా మీ ఫోన్‌కు మేసేజ్ వస్తుంది.
SBI ATMs..
☛ SBI ఏటీఎంకు వెళ్లాలి. ☛ మీ ఏటీఎం కమ్ డెబిట్ కార్డును స్వైప్ చేసి.. మీ పిన్ నంబర్ ఎంటర్ చేయాలి. ☛ ఆ తర్వాత ‘సర్వీస్ రిజిస్ట్రేషన్స్’ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ☛ అనంతరం ఆధార్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ సెలక్ట్ చేయాలి. ☛ తర్వాత సేవింగ్స్ అకౌంటా ? చెకింగ్ అకౌంటా? అనేది ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఆధార్ నంబరును ఎంటర్ చేయాలి. ☛ తిరిగి మళ్లీ ఎంటర్ చేయడానికి ప్రాంప్ట్ చేయబడుతుంది. ☛ అంతే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు SMS వస్తుంది.
SBI anywhere app..
☛ ముందుగా SBI anywhere appకు లాగిన్ అవ్వాలి. ☛ తర్వాత రిక్వేస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ☛ ఆ తర్వాత ఆధార్ ఆప్షన్ సెలక్ట్ చేయాలి. ☛ అనంతరం ఆధార్ లింకింగ్ పై క్లిక్ చేయాలి. ☛ ఆ తర్వాత డ్రాప్ డౌన్ లీస్ట్ నుంచి CIFను ఎంచుకోవాలి. ☛ మీ ఆధార్ నంబరును ఎంటర్ చేయాలి. ☛ టీ అండ్ సీ ఓకే చేయాలి. ☛ ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు SMS వస్తుంది.
నేరుగా SBI బ్రాంచ్ వెళ్ళడం ద్వారా..
☛ మీ సమీప SBI బ్రాంచుకు వెళ్ళాలి. ☛ ఇందుకోసం మీ ఆధార్ నంబర్ లేదా ఆధార్ కాపీ జీరాక్స్ తీసుకెళ్ళాలి. ☛ ఆ తర్వాత రిక్వెస్ట్ లెటర్‌ను ఫిల్ చేయాలి. ☛ ఆ లెటర్‌తోపాటు ఆధార్ కాపీ జీరాక్స్‌ను కలిపి ఇవ్వాలి. ☛ ఈ ప్రాసెస్ పూర్తైన తర్వాత మీ అకౌంటుకు ఆధార్ లింక్ చేయబడుతుంది. ☛ ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు SMS వస్తుంది.
మీ అకౌంట్‌కు ఆధార్ లింక్ అయ్యిందా ?లేదా ? అనే విషయాన్ని ఇలా తెలుసుకోవచ్చు..
☛ www.uidai.gov.in వెబ్సైట్లోకి వెళ్లాలి. ☛ ఆ తర్వాత ఆధార్ సర్వీస్ సెక్షన్‌కు వెళ్లి చెక్ ఆధార్ /బ్యాంక్ అకౌంట్ లింకింగ్ స్టేటస్ ఇన్ మై ఆధార్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ☛ ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ నంబర్ లేదా.. 16 అంకెల వర్చువల్ ఐడీని ఎంటర్ చేయాలి. ☛ తర్వాత సెండ్ OTP ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ☛ అప్పుడు మీరు మీ ఆధార్‌కు లింక్ అయినా మొబైల్‌కు OTP వస్తుంది. ☛ ఆ తర్వాత OTPని ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి.