AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

General Knowledge: సన్నని ట్రాక్‌లపై జారిపోకుండా రైలు ఎలా నడుస్తుంది..? దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా..

రైలు జారి పడి ప్రమాదానికి గురికాకుండా ఉండేందుకు అన్ని భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేశారు. ట్రాక్‌లు వేసేటప్పుడు కూడా ఇది అనుసరించబడుతుంది.

General Knowledge: సన్నని ట్రాక్‌లపై జారిపోకుండా రైలు ఎలా నడుస్తుంది..? దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా..
Indian Railways
Sanjay Kasula
|

Updated on: Aug 14, 2022 | 9:09 PM

Share

సైన్స్‌తో ఏది సాధ్యం కాదు. విమాన ప్రయాణం నుంచి అంతరిక్ష రహస్యాల వరకు, సైన్స్ మానవులకు అన్నింటినీ సాధ్యం చేసింది. వాటిని చూసి ఆశ్చర్యం, ప్రశ్నలు కూడా మనస్సులో తలెత్తుతాయి. ఇంత సన్నటి పట్టాలపై జారిపోకుండా రైలు ఎలా నడుస్తుందని చాలాసార్లు మనకు అనిపిస్తుంటుంది. పట్టాలపై నడుస్తున్న రైలును చూసిన తర్వాత అలాంటి ప్రశ్న మనసులో మెదులుతోంది. ఇవాళ మనం మీకు వచ్చిన ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. 

రైలు జారిపోకుండా ఎలా నడుస్తుంది

రైలు పట్టాలపై జారిపోకుండా పరుగెత్తడం వెనుక శాస్త్రీయ సాంకేతికత ఉంది. ఇందులో ఫిజిక్స్ కింద ఫ్రిక్షన్ లా ఉంది. రైలు ప్రమాదానికి గురికాకుండా వేగం అదుపులో ఉంటుంది. రైలు రెండు వైపుల నుంచి పార్శ్వ శక్తి ఒక నిర్దిష్ట పరిమితిలో ఉంటుంది. పార్శ్వ శక్తి నిలువు బలంలో 30 లేదా 40 శాతానికి మించనంత కాలం. అప్పటి వరకు రైలు ఢీ కొట్టినా.. పట్టాలు తప్పినా ప్రమాదం లేదు. ఈ స్థాయి శక్తిని నిర్వహించడానికి శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించబడతాయి. ప్రమాదం నుంచి రైలును రక్షించడానికి దాని గరిష్ట వేగం కంటే తక్కువ వేగంతో నడపబడుతుంది.

రైలు జారిపడి ప్రమాదానికి గురికాకుండా ఉండేందుకు అన్ని భద్రతా ప్రమాణాలను తీసుకుంటారు. ట్రాక్‌లు వేసేటప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలనే అనుసరిస్తుంటారు. అంతే కాకుండా రైలు నడిపే డ్రైవర్‌కు అవసరమైన శిక్షణ, సూచనలు కూడా ఇస్తారు. ఎప్పటికప్పుడు రైల్వే ట్రాక్‌లను తనిఖీ చేస్తుంటారు. ఏదైనా లోపాలు ఉన్నట్లయితే, ట్రాక్‌లు మరమ్మతులు చేస్తారు. సన్నని ట్రాక్‌పై రైలు దూసుకుపోతుంది.

పొరపాటు పెద్ద ప్రమాదానికి దారి తీస్తే..

రైలు పట్టాలు తప్పదని కాదు. రైలు ప్రమాదాల వార్తలను మనం తరచుగా చూస్తూనే ఉంటాం. వీటిలో, పట్టాలు తప్పిన సంఘటనలకు కారణం నిర్ణీత ప్రమాణాలను ఉల్లంఘించడం లేదా కొన్నిసార్లు ట్రాక్‌లలో లోపం ఉండటం జరుగుతుండేవి. అయితే ఈ మధ్య కాలంలో రైలు పట్టాలు తప్పిన ఘటనలు బాగా తగ్గాయి.

మరిన్ని ట్రెండిగ్ వార్తల కోసం