ఆడవాళ్లు తలలో పూలు పెట్టడం వల్ల బోలెడన్ని ప్రయోజనాలు, ఏంటవి..?

|

Oct 08, 2024 | 5:27 PM

వెంట్రుకలు జడవేయకుండా వదిలేస్తే అందంగా అనిపించినప్పటికీ, ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. అలాగని జుట్టును గట్టిగా అల్లడం కూడా జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు. ఆడవాళ్లు జడవేసినా, వదిలేసినా తలలో పువ్వు ఉంటే బాగుంటుందని అంటున్నారు. వెంట్రుకలను వదులుగా అల్లడం, తలలో పూలు పెట్టడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

ఆడవాళ్లు తలలో పూలు పెట్టడం వల్ల బోలెడన్ని ప్రయోజనాలు, ఏంటవి..?
Wearing Flowers On Your Hea
Follow us on

అమ్మాయిలు నిజంగానే అందంగా ఉంటారు. ఆ అందానికి తలలో పూలు పెడితే అది రెట్టింపు అవుతుంది. వారి తలలో ఉన్న పువ్వు వారి ముఖంలోని సౌందర్యాన్ని పెంచుతుంది. పూర్వం రోజుల్లో ప్రతి ఆడపిల్ల రోజూ తలలో పూలు పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు అంతా ఫ్యాషన్ మోజులో పడి తలలో పూలు పెట్టుకునే వారి సంఖ్య తగ్గిపోయింది. అయితే కొంతమంది అమ్మాయిలు ఇప్పటికీ తలలో పూలు పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు. తలలో పూలు పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతారు. పూలు అందాన్ని ఇవ్వడమే కాకుండా పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయని నమ్ముతారు. తలలో పూలు పెట్టుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఒక్కో కాలానికి అనుగుణంగా ఫ్యాషన్ మారుతుంది. పూర్వం ఆడపిల్లలు తలకు నూనె రాసి, తల దువ్వి, చక్కగా జడ అల్లుకుని పూలతో అలంకరించుకునేవారు. కానీ, ఇప్పుడు కాలం మారింది. నేటితరం అమ్మాయిలు జడవేసుకుంటే నామోషిగా ఫీల్‌ అవుతున్నారు. వెంట్రుకలు విరబోసుకుని తిరుగుతున్నారు. ప్రత్యేక సందర్భాలలో తప్ప ఆడపిల్లలు తలలో పూలు పెట్టుకోవటం లేదు. పూర్వం ఆడపిల్లలు జుట్టుని గట్టిగా అల్లుకుని జడలో తప్పనిసరిగా ఒక్క పూవైనా పెట్టుకునేవారు. వెంట్రుకలు జడవేయకుండా వదిలేస్తే అందంగా అనిపించినప్పటికీ, ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. అలాగని జుట్టును గట్టిగా అల్లడం కూడా జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు. ఆడవాళ్లు జడవేసినా, వదిలేసినా తలలో పువ్వు ఉంటే బాగుంటుందని అంటున్నారు. వెంట్రుకలను వదులుగా అల్లడం, తలలో పూలు పెట్టడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

గులాబీ:

ఇవి కూడా చదవండి

గులాబీ ప్రేమకు, అభిరుచికి చిహ్నం.  కొంతమంది అమ్మాయిలకు మల్లెపూల వాసన, సువాసనగల పూలు పెట్టుకోవటం వల్ల తలనొప్పి వస్తుంది. అలాంటి వారు రోజూ గులాబీని పెట్టుకోవచ్చు. గులాబి సువాసన తలలోని భారాన్ని తగ్గిస్తుందని, తలతిరగడాన్ని నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మల్లె పూలు:

ఇది శ్రేయస్సుకు, అదృష్టానికి చిహ్నం. మల్లె పూలు తలలో పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మల్లెపూల వాసనతో ఆడపిల్లలకు మనశ్శాంతి కలుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. కొందరికి ఈ పూల వల్ల ఎలర్జీ వస్తుందట. దీని ఘాటైన వాసన కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, మైకము కలిగిస్తుంది. అలాంటి వారు వీటికి బదులుగా ఇతర పూలను పెట్టుకోవచ్చు.

సంపెంగ పూలు:

సంపెంగ పువ్వు పసుపు రంగులో ఉండి తలలో పెట్టుకోవటం వల్ల కంటి చూపు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మీ శరీరం అలసిపోయినప్పుడు మీరు సంపెంగ పూలను వాసన చూడొచ్చునని చెబుతున్నారు. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. సంపెంగ పూల వాసన మీలో మంచి ఉత్సాహాన్ని నింపుతుంది.

చామంతి:

ఈ అందమైన పూలు సంతోషానికి చిహ్నాలు. కాబట్టి, అమ్మాయిలు తలలో చామంతిని ధరిస్తే ఆమె తన కుటుంబంలో సంతోషాన్ని తీసుకు వస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

మందార:

మందార పువ్వును శక్తికి మరోరూపమైన కాళి మాతను పూజించడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఇది శక్తికి చిహ్నం. అలాగే, మందరాలతో గణపతిని కూడా పూజిస్తారు. మందార తలలో పెట్టుకుంటే మేలు జరుగుతుందని నమ్ముతారు.

బంతి పూలు:

గ్రామాల్లో బంతిపూలను ఎక్కువగా పండిస్తారు. ప్రతి ఇంట్లోనూ బంతి చెట్టు ఉంటుంది. ఈ పువ్వుకు సువాసన ఉండదు. కానీ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. సువాసన లేనందున తలనొప్పి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఈ పువ్వును తలలో పెట్టుకుంటే..ఆడపిల్లలకు తలనొప్పి రాదని అంటున్నారు. ఆధ్యాత్మికంగా చూస్తే మల్లెపూలు, గులాబిపూలు తలలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం. కాబట్టి అమ్మాయిలారా, వీలైనంత వరకు తలలో పూలు పెట్టుకోవడం అలవాటుగా చేసుకోండి.. మీ జీవితం అందంగా, ఆనందంగా మార్చుకోండి..! అంటున్నారు నిపుణులు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..