ఇంటి వద్దనే గోల్డ్ లోన్స్ తీసుకోవచ్చు.. ఇక నుంచి సులభంగా రుణం.. కొత్త సేవలు అందుబాటులోకి..

భారత్‏లో బంగారానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది. ఫెస్టివల్స్ దగ్గర నుంచి పెళ్ళిళ్ల వరకు ప్రతి ఒక్కదానికి పసిడిని కొనాల్సిందే.

ఇంటి వద్దనే గోల్డ్ లోన్స్ తీసుకోవచ్చు.. ఇక నుంచి సులభంగా రుణం.. కొత్త సేవలు అందుబాటులోకి..
Rajitha Chanti

|

Feb 09, 2021 | 7:24 AM

Gold Loan At Your Home Process: భారత్‏లో బంగారానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది. ఫెస్టివల్స్ దగ్గర నుంచి పెళ్ళిళ్ల వరకు ప్రతి ఒక్కదానికి పసిడిని కొనాల్సిందే. అలాగే ఈ బంగారం ఇంట్లో ఉంటే అత్యవసర పరిస్థిత్తుల్లో కూడా ఉపయోగపడుతుంది. అనుకోకుండా డబ్బులు అవసరం పడినప్పుడు ఎవరిని మనీ అడగాల్సిన పనిలేకుండా.. ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకెళ్లి. బ్యాంకులలో లేదా ఆర్థిక సంస్థల్లో తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవచ్చు.

ఇదిలా ఉండగా.. బంగారం మీద లోన్ తీసుకోవడానికి ఎలాంటి సెంటర్స్‏కు వెళ్ళాల్సిన పనిలేదు. సులభంగా మీ ఇంటి నుంచి గోల్డ్ లోన్ తీసుకోనే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం ప్రముఖ గోల్డ్ లోన్ సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక నుంచి ఆ సంస్థ తన కస్టమర్లకు ఇంటి వద్దనే గోల్డ్ లోన్స్ అందిస్తుంది. ఒకవేళ మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటే.. కంపెనీ వెబ్ సైట్ ఓపెన్ చేసి ముత్తూట్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్‏తో అపాయింట్ మెంట్ షెడ్యూల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ మీ ఇంటికే వచ్చి ఈ లోన్ ప్రక్రియను పూర్తిచేస్తారు. అనంతరం బంగారం లోన్ డబ్బులు వెంటనే మీ బ్యాంకు ఖాతాలోకి చేరతాయి. దీనిపై నెలకు రూ.81 పైసలు వడ్డీ పడుతుంది.

Also Read: gold seized in india: గత అయిదేళ్ళలో కస్టమ్స్ సీజ్ చేసిన బంగారమెంతో తెలిస్తే షాకే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu