Google Blacklisted Words: గూగుల్ లో ఈ పదాలను వెదక వద్దు.. కొన్నింటికి అర్ధం దొరకదు, మరికొన్నింటికి అరెస్ట్ అయ్యే అవకాశం.
సోషల్ మీడియా , ఇంటర్ నెట్ , స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేని సమయంలో ఎవరికైనా ఏమైనా తెలియక పొతే.. ఆ విషయాన్ని తెలుసుకోవడానికి పెద్దలనో.. సమీపంలో ఉన్న గ్రంధాలయాల్లోనో లేక టీచర్స్ నో అడిగి తెలుసుకునే వారు..ఇప్పుడు అరచేతిలోనే...
Google Blacklisted Words: సోషల్ మీడియా , ఇంటర్ నెట్ , స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేని సమయంలో ఎవరికైనా ఏమైనా తెలియక పొతే.. ఆ విషయాన్ని తెలుసుకోవడానికి పెద్దలనో.. సమీపంలో ఉన్న గ్రంధాలయాల్లోనో లేక టీచర్స్ నో అడిగి తెలుసుకునే వారు..ఇప్పుడు అరచేతిలోనే ప్రపంచాన్ని చూపిస్తున్న స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.. దీంతో ఎవరికైనా ఏదైనా తెలియక పొతే వెంటనే ఇంటర్నెట్ ను ఆశ్రయిస్తున్నారు.
వాటి అర్ధం ఉపయోగాలు ఇలా అనేక విషయాలను తెలుసుకునేందుకు సెర్చ్ ఇంజన్లను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా అందరూ గూగుల్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే గూగుల్ లో కీ వర్డ్స్ గురించి వెదికే ముందు జాగ్రత్త.. కొన్ని పదాలకు అర్ధాలను వెదికితే అది నేరంగా పరిగణింపడుతుందంట.. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న నెటిజన్లు అందరూ ఆన్ లైన్ లో ఒకే పదం వెతికరు కదా..! ఒకొక్కరు ఒకొక్క విషయాన్నీ శోధిస్తారు .. అయితే గుగూల్ లో ఏ పదాన్ని వెదికినా తప్పులేదంట కానీ కొన్ని కీ వర్డ్స్ మాత్రం గూగుల్ లో వెదకకూడదట.
అవేమిటనేవి తెలుసుకుందాం..4 గర్ల్స్ ఫింగర్ పెయింట్, లేమాన్ పార్టీ బ్లూ వాల్స్, కిడ్స్ ఇన్ ఏ శాండ్ బాక్స్, 2 గర్ల్స్ ఇన్ వన్ కప్, ఎలె గర్ల్ వంటి అనేక పదాలను గూగుల్ లో సెర్చ్ చేయకూడదట. ఒకవేళ ఇటువంటి పదాలను వెదికినా గూగుల్ అర్ధం చూపించకుండా సాఫ్ట్ వేర్ ను తీర్చిదిద్దారట. ఎందుకంటే ఈ పదాలకు అత్యంత అశ్లీలమైన అర్ధాలున్నాయట.. వాటితో చాలా మంది అశ్లీల చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నారట. అందుకే గూగుల్ సదరు కీవర్డ్స్‌ను తమ లిస్ట్‌లో నుంచి తీసేసింది వీటితో పాటు టెర్రరిజాన్ని సంబంధించిన పదాలను కూడా గూగుల్ లో శోధించకూడదు.. అలాంటి పదాలను సెర్చ్ చేసిన వారి మీద నిఘావర్గాలు ఓ కన్నేసి ఉంచుతాయట.. అవసరం అయితే ఆ యూజర్స్ ను అరెస్ట్ కూడా చేస్తారట.. కనుక కొన్ని పదాలను తెలిసో తెలియకో గూగుల్ లో వెదికేవారు జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: