AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సమస్యతో బంగారు భవనాన్ని అమ్ముతున్న యజమాని.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఆ భవనం బయటి నుంచి చూడటానికి సాదాసీదాగానే కనిపిస్తుంది. కానీ లోపలికే వెలితే మాత్రం ఒక బంగారు రాజభవనమే. అందులో ఉండేవన్నీ బంగారంతో చేసినవే. పూర్వం రాజుల కాలంలో బంగారు భవనాలు ఉండేవి..

ఆ సమస్యతో బంగారు భవనాన్ని అమ్ముతున్న యజమాని.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Rajitha Chanti
|

Updated on: Feb 18, 2021 | 7:35 PM

Share

ఆ భవనం బయటి నుంచి చూడటానికి సాదాసీదాగానే కనిపిస్తుంది. కానీ లోపలికే వెలితే మాత్రం ఒక బంగారు రాజభవనమే. అందులో ఉండేవన్నీ బంగారంతో చేసినవే. పూర్వం రాజుల కాలంలో బంగారు భవనాలు ఉండేవి.. బంగారు కుర్చీలు ఉండేవి అన్నట్లుగానే ఆ భవంతి లోపల ఉంటుంది. అందులోకి అడుగు పెడితే మాత్రం బంగారు ధగధగలు కళ్లు చెదిరేట్లు చేస్తాయి. ఏదో రాజప్రాసాదంలోకి అడుగుపెట్టినట్లే అనిపిస్తుంది. అయితే ఈ బంగారు భవంతి రష్యాలోని ఈర్‌కుత్‌స్క్‌ నగరంలో ఉంది. కానీ ఈ బంగారు భవనం ఇప్పుడు అమ్మకానికి ఉంది. అందుకు కారణం ఒక చిన్న సమస్య.

దాదాపు రెండెకరాల విస్తీర్ణమైన విశాల ప్రాంగణంలో పచ్చని తోటల మధ్య నిర్మించిన ఈ భవనం విస్తీర్ణం 6,997 చదరపు అడుగులు. ఇందులోని సోఫాలు, కుర్చీలు, టేబుళ్లు, టీపాయ్‌లు, మంచాలు, పడకగది తలుపుల అంచులు, వాటి గొళ్లాలు, షాండ్లియర్లు వంటివన్నీ పూర్తిగా బంగారం తాపడంతో తయారు చేసినవే కావడం విశేషం. ఈ భవంతిలో ఐదు పడకగదులు, డ్రెసింగ్‌ రూమ్‌లు, ప్రైవేట్‌ బాత్‌రూమ్‌లు, విశాలమైన హాలు, కారిడార్, వంటగది, భోజనాల గది ఉన్నాయి. ఈ గదుల్లో అడుగడుగునా బంగారు వస్తువులు కళ్ళు చెదిలేలా చేస్తాయి. ప్రఖ్యాత బైకాల్‌ సరస్సుకు చేరువలో ఉండటం ఈ భవంతికి అదనపు ఆకర్షణ. ఈ బంగారు భవంతిలో మరిన్ని అదనపు హంగులూ ఉన్నాయి. భవంతి మొత్తానికి విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రత్యేకమైన విద్యుత్‌ సబ్‌స్టేషన్, వైన్‌ సెల్లార్, ఇంటి ఆవరణలో చక్కగా తీర్చిదిద్దిన పచ్చిక బయళ్లు, పైన్‌ వృక్షాలు, ఒక చేపల చెరువు, ఒక కృత్రిమ జలపాతం కూడా ఉన్నాయి. కానీ ఈ భవంతికి ఒక సమస్య ఉంది. భవంతి లోపల అంతా బాగానే ఉంటుంది కానీ, శీతాకాలంలో మాత్రం బయట –51 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉంటాయి. కాస్త వెచ్చని ప్రాంతానికి మకాం మార్చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని అమ్ముతున్నట్లు పదకొండేళ్లుగా ఇందులోనే ఉంటున్న ప్రస్తుత యజమాని కానాగత్‌ రజమతోవ్‌ చెబుతున్నారు. ఈ భవంతి ధర 2.1 మిలియన్‌ పౌండ్లు (21 కోట్ల రూపాయలు).

Also Read: న్యూఇయర్‏లో కలిసోచ్చిన అదృష్టం.. 15‏ ఏళ్ళ క్రితం రైళ్లో పోయిన బంగారు లాకెట్.. ఇప్పుడిలా.. ‏