Personality: చేతి వేళ్ల మధ్య ఉండే గ్యాప్‌.. మీ వ్యక్తిత్వాన్ని చెప్తుంది..

మన వ్యక్తిత్వం ఎలాంటిదో మన ఆలోచనల ఆధారంగా చెప్పొచ్చని మనందరికీ తెలిసిందే. లేదా మనం మాట్లాడే విధానం ఆధారంగా ఈ విషయాన్ని అంచనా వేయొచ్చు. అయితే మనం కనిపించే తీరు, మన భౌతిక లక్షణాలు మన పర్సనాలిటీ గురించి చెబుతాయని మీకు తెలుసా.? దీనిని నిపుణులు పర్సనాలిటీ టెస్ట్‌గా చెబుతుంటారు. ఇలాంటి వాటిలో చేతి వేళ్లు ఒకటి...

Personality: చేతి వేళ్ల మధ్య ఉండే గ్యాప్‌.. మీ వ్యక్తిత్వాన్ని చెప్తుంది..
Personality Test
Follow us

|

Updated on: Oct 01, 2024 | 5:34 PM

మన వ్యక్తిత్వం ఎలాంటిదో మన ఆలోచనల ఆధారంగా చెప్పొచ్చని మనందరికీ తెలిసిందే. లేదా మనం మాట్లాడే విధానం ఆధారంగా ఈ విషయాన్ని అంచనా వేయొచ్చు. అయితే మనం కనిపించే తీరు, మన భౌతిక లక్షణాలు మన పర్సనాలిటీ గురించి చెబుతాయని మీకు తెలుసా.? దీనిని నిపుణులు పర్సనాలిటీ టెస్ట్‌గా చెబుతుంటారు. ఇలాంటి వాటిలో చేతి వేళ్లు ఒకటి. చేతి వేళ్ల మధ్య ఉన్న గ్యాప్‌ ఆధారంగా మన వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పొచ్చని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* చూపుడు, మధ్య వేళ్ల మధ్య ఎక్కువగా గ్యాప్‌ ఉంటే మీకు మంచి నైపుణ్యాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. కొత్త పనులను స్వీకరించడానికి ఎల్లప్పుడూ ముందుంటారు. తెలియని పని అయినా సరే నేర్చుకొని మరీ చేయడానికి ఇష్టపడతారు. ఎల్లప్పుడూ కొత్తగా ఆలోచిస్తుంటారు. స్వేచ్ఛా, ఆలోచన కలిగి ఉంటారని అర్థం. కష్ట సమయాల్లో కూడా అద్భుతమైన నిర్ణయాలను తీసుకునే నైపుణ్యాలను కలిగిఉంటారు. స్వతంత్రంగా ఉండడాఇనకి ఇష్టపడతారు.

* ఉంగరం వేలు, చిటికెన వేలు మధ్య ఖాళీ ఉన్న వ్యక్తులు స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వారని అర్థం. ఇదే మిమ్మల్ని నలుగురు నుంచి వేరు చేస్తుంది. తమ కోసం తాము దృఢమైన వైఖరిని కలిగి ఉంటారు. అలాగే మీరు తిరుగుబాటు స్ఫూర్తిని కలిగి ఉంటారు. ఒక పంజరంలో ఉండడానికి ఇష్టపడరు. స్వచ్ఛగా ఉండాలని కోరుకుంటారు.

* మిడిల్‌ ఫింగర్‌, రింగ్ ఫింగర్‌ మధ్య అంతరం ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఇతరులచే సులభంగా ప్రభావితం కాలేరు. వీరు చాలా ధైర్యవంతులు, వ్యక్తిత్వం బలంగా ఉంటుంది. లక్ష్య సాధన కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుంటారు. తాము సాధించాలనుకునే పనికోసం ఎంత దూరమైనా వెళ్తారు. భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించరు. ప్రస్తుతంలోనే సంతోషాన్ని వెతుక్కుంటారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు నిపుణులు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..