కొవిడ్‌తో పోరాడటానికి.. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి.. వెల్లుల్లి, చింతపండుతో చేసిన ఈ సూప్ ట్రై చేయండి..

Garlic Tamarind Soup : కరోనా సెకండ్‌ వేవ్‌తో దేశ మొత్తం పోరాడుతోంది. ఈ సమయంలో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి

కొవిడ్‌తో పోరాడటానికి.. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి.. వెల్లుల్లి, చింతపండుతో చేసిన ఈ సూప్ ట్రై చేయండి..
Garlic Tamarind Soup
Follow us
uppula Raju

|

Updated on: May 13, 2021 | 4:50 PM

Garlic Tamarind Soup : కరోనా సెకండ్‌ వేవ్‌తో దేశ మొత్తం పోరాడుతోంది. ఈ సమయంలో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం బలమైన ఆహారాన్ని తినాలి. అయితే ఇంట్లో లభించే వెల్లుల్లి రసం రోగ నిరోధక శక్తిని అమాంతం పెంచేస్తుంది. వెల్లుల్లి, చింతపండు, కరివేపాకుతో తయారు చేసిన రుచికరమైన సూప్ తాగితే రోగనిరోధక శక్తి ఇట్టే పెరుగుతుంది. ఇది ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసినవి.. చింతపండు గుజ్జు – 1 టేబుల్ చెంచా, టమోటా – 1 (తరిగిన ముక్కలు), కరివేపాకు – 10-12, నల్ల మిరియాలు – 1-2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి – 4-5 లవంగాలు, పసుపు పొడి (హల్ది) – సగం టీస్పూన్, ఎరుపు మిరపకాయ – 2, ఉప్పు – తగినంత, జీలకర్ర – 1 టీస్పూన్, హింగ్ – సగం టీస్పూన్, కొత్తిమీర – 1 టేబుల్ స్పూన్ (తాజాగా తరిగిన), నూనె – 1 టేబుల్ స్పూన్, ఆవాలు – 1 టీస్పూన్ ఎలా చేయాలి.. ఎర్ర కారం, నల్ల మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, 4-5 కరివేపాకు మిక్సర్‌లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఒక కడయ్‌లో నూనె వేడి చేసి, తరిగిన టమోటాలు, మిగిలిన కరివేపాకు, హల్ది, కొంచెం ఉప్పు వేసి 3-4 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు పేస్ట్ అందులో వేసి బాగా కలపాలి. చింతపండు గుజ్జు, 2 కప్పుల నీరు కలపాలి. మూత మూసివేసి కనీసం 10 నిమిషాలు ఉంచండి. అనంతరం తరిగిన కొత్తిమీరతో అలంకరించండి. కొన్ని నల్ల మిరియాలు పొడి చల్లుకోండి. అంతే సూప్ రెడీ అయిపోయింది. లాభాలు.. రసం తయారీలో ఉపయోగించే పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలకు ప్రసిద్ధి చెందినవి. చింతపండు, హల్ది లేదా పసుపు, కరివేపాకు ఫంగల్ వ్యతిరేక లక్షణాలతో పోరాడుతాయి. వెల్లుల్లి విషయానికొస్తే రోగనిరోధక శక్తిని పెంచడంలో దీనికి సాటి ఏదీ లేదు. ఇది జలుబుతో సహా అన్ని సమస్యలకు పనిచేస్తుంది.

Viral News: వామ్మో ఇదేం క‌ప్ప‌.. చంటిబిడ్డంత ఉంది.. చూస్తే షాక‌వ్వాల్సిందే..

విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెలకు రూ. 25,000 ఫెలోషిప్.. మే 18 దరఖాస్తులకు చివరితేదీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

Asus ZenFone8: అసూస్ నుంచి అద‌ర‌గొట్టే స్మార్ట్ ఫోన్‌.. ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు.. ఓ లుక్కేయండి..