AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొద్దింకలను బెదరగొట్టి తరిమికొట్టే సింపుల్‌ టిప్స్‌..ఇలా చేస్తే మీ కిచెన్‌ ఆరోగ్యంగా ఉన్నట్టే..!

బొద్దింకలు ఏం చేస్తాయిలే అనుకుంటే పొరపాటే.. వీటిని లైట్‌ తీసుకోవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బొద్దింకల వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో బొద్దింకలు ఎక్కువైతే ఇంటిల్లి పాది రోగాల బారిన పడాల్సి వస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, బొద్దింకలు లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

బొద్దింకలను బెదరగొట్టి తరిమికొట్టే సింపుల్‌ టిప్స్‌..ఇలా చేస్తే మీ కిచెన్‌ ఆరోగ్యంగా ఉన్నట్టే..!
cockroaches
Jyothi Gadda
|

Updated on: Sep 17, 2025 | 1:39 PM

Share

సాధారణంగా అందరి ఇళ్లలో బొద్దింకల బెడద వేదిస్తూ ఉంటుంది. కొందరి ఇళ్లలో బొద్దింకలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. నైట్ లైట్స్ ఆఫ్ చేయగానే బొద్దింకల స్వైర విహారం మొదలవుతుంది. కానీ, వీటిని లైట్‌ తీసుకోవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బొద్దింకల వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో బొద్దింకలు ఎక్కువైతే ఇంటిల్లి పాది రోగాల బారిన పడాల్సి వస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, బొద్దింకలు లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

అయితే, ఇంట్లోంచి బొద్దింకలను ఎలా తరిమి కొట్టాలో తెలియక చాలా మంది అవస్థలు పడుతుంటారు. సులభంగా బొద్దింకల నుంచి విముక్తి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా బొద్దింకల నుంచి విముక్తి పొందడానికి ప్రతిరోజు ఇంట్లో బోరాక్స్ పౌడర్, బేకింగ్ సోడా, పంచదార మూడింటిని బకెట్ నీళ్లలో కలిపి పిచికారి చేయండి. వారంలో ఇలా నాలుగు రోజులపాటు పిచికారి చేస్తే, బొద్దింకల నుంచి ఎంతో సులభంగా విముక్తి లభిస్తుంది. ఇది పిచికారి చేయడం వల్ల కూడా దోమలు రాకుండా ఉంటాయి. అలాగే బల్లులు కూడా తగ్గుతాయి.

బొద్దింకలను తరిమికొట్టడానికి బిర్యానీ ఆకులను కూడా ఉపయోగించవచ్చు. బిర్యానీ ఆకుల వాసన వల్ల బొద్దింకలు పారిపోతాయి. ఇందుకోసం కొన్ని ఆకులను తీసుకొని నీటిలో నానబెట్టాలి. ఇప్పుడు, బొద్దింకలు ఎక్కడ కనిపించినా ఈ నీటిని చల్లుకోవాలి.. దీనివల్ల అవి పారిపోతాయి.

ఇవి కూడా చదవండి

బొద్దింకల నివారణకు నిమ్మరసం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో నిమ్మరసం పిండుకుని బొద్దింకల మీద లేదా వాటి దగ్గర పోయాలి. బొద్దింకలు సింక్‌లో దాక్కుంటే, సింక్ లోపల నిమ్మరసం పోయండి. అవి పారిపోతాయి.

అయతే, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. బొద్దింకలు ఎక్కువగా వాడని, తేమ అధికంగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. కప్‌బోర్డులు, కిచెన్ సింక్ ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఎక్కడైనా హోల్స్, క్రాక్స్, పగిలిన పైప్స్ ఉంటే ముందుగా వాటిని సీల్‌ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్