Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Edible Oils: కొండెక్కిన వంటనూనెల ధరలు.. ఈ చిట్కాలు పాటిస్తే ఇంట్లో నూనె ఖర్చు బడ్జెట్ దాటిపోదు!

Edible Oils: సంవత్సర కాలంగా మన దేశంలో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనితో, వంట నూనె ధరలు గత 11 సంవత్సరాలతో పోలిస్తే అత్యధికంగా ఉన్నాయి.

Edible Oils: కొండెక్కిన వంటనూనెల ధరలు.. ఈ చిట్కాలు పాటిస్తే ఇంట్లో నూనె ఖర్చు బడ్జెట్ దాటిపోదు!
Edible Oils
Follow us
KVD Varma

|

Updated on: Jun 05, 2021 | 1:36 PM

Edible Oils: సంవత్సర కాలంగా మన దేశంలో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనితో, వంట నూనె ధరలు గత 11 సంవత్సరాలతో పోలిస్తే అత్యధికంగా ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం, ఆవ నూనె సుమారు 44 శాతం పెరుగుదలతో, మే 28 న రిటైల్ మార్కెట్లో లీటరుకు 171 రూపాయలుగా నమోదైంది. గతేడాది మే 28 న ఒక లీటరు ఆవ నూనె ధర రూ .118. అదే సమయంలో, పొద్దుతిరుగుడు నూనె ధర కూడా 50 శాతానికి పైగా పెరిగింది. భారతదేశంలో సాధారణంగా ఉపయోగించే 6 తినదగిన నూనెలు (వంటనూనెలు) ఉన్నాయి. వీటిలో ఆవ నూనె, వేరుశనగ నూనె, డాల్డా, శుద్ధి చేసిన సోయా నూనె, పొద్దుతిరుగుడు నూనె (సన్ ఫ్లవర్ ఆయిల్), పామాయిల్ ఉన్నాయి.

గత ఏడాదిలో ఈ నూనెల ధరలు 20 నుంచి 56 శాతం పెరిగాయని వినియోగదారుల వ్యవహారాల శాఖ వెబ్‌సైట్ తెలిపింది. దేశంలో ఎక్కువ శాతం జనాభా ఇప్పటికే ద్రవ్యోల్బణం, కరోనా వైరస్, లాక్ డౌన్ లతో పోరాడుతోంది. అటువంటి పరిస్థితిలో, తినదగిన చమురు ధరల పెరుగుదల సామాన్యుల బడ్జెట్‌ను తారుమారు చేసింది. ఈ పరిస్థితుల్లో వంట నూనె ను కనీస స్థాయిలో ఉపయోగించుకుని మన రోజువారీ అవసరాలను ఎలా నడుపుకోవాలనే దానిపై చిన్న చిన్న చిట్కాలు మీకోసం..

1. డీప్ ఫ్రై బదులుగా..

మనలో చాలా మంది వంటల్లో డీప్ ఫ్రై ఇష్టపడతారు. కూరగాయల ముక్కలు లేదా నాన్ వెజ్ బాగా ఎక్కువగా నూనెలో వేసి వేయించడం ఇష్టపడతారు. దానికి బదులుగా కొద్దిగా నూనెతో తక్కువ వేడి వద్ద పదార్ధాలను వేయించుకునే పధ్ధతి ప్రయత్నించండి. ఇది నూనె వాడకాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. నిజానికి డీప్ ఫ్రై తొ చేసిన ఆహారం ఆరోగ్యానికి అంత మంచిది కాదు కూడా..

2. నూనె సీసా బదులుగా..

వంటింట్లో నూనెను సీసాలో ఉంచుకుని..వంట చేసే సమయంలో దానిలో నూనెను బాణాలిలో పోసి వాడటం అందరూ చేస్తారు. కొందరు క్యాన్ లో నూనె ఉంచుకుని దానిని బానాలిలో పోస్తూ ఉంటారు. దీనివలన నిజంగా అవసరం అయినదానికన్న ఎక్కువ నూనె బాణాలి లో పడిపోయే అవకాశం ఉంటుంది. వంట చేసే హడావుడిలో దీనిని గమనించినా.. కొద్దిగానే ఎక్కువ అయింది కదా.. ఫర్వాలేదు అనే ధోరణిలో పని కానిచ్చేస్తారు. అందువల్ల.. సీసా, క్యాన్ కు బదులుగా స్ప్రే బాటిల్ వాడండి. అవును..నూనెను స్ప్రే విధానంలో వాడితే ఎక్కువ నూనె పడదు. అలాగే బానాలిలో కొద్దిగా నూనె వేసి వేడి చేసి వంట మొదలయ్యాకా ఆయా పదార్ధాల మీద కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసుకుంటే.. నూనె వినియోగం చాలావరకూ తగ్గుతుంది. వృధాగా నూనెను వాడె పరిస్థితి పోతుంది.

3. ఉడకపెట్టిన ఆహారం..

నూనెలో వేయించిన ఆహరం బదులుగా ఉడకబెట్టిన ఆహారం ఆరోగ్యానికీ మంచిది. ముందుగా వంట చేయాలనుకున్న పదార్ధాలను ఉడికించి తరువాత నూనెతో తాలింపు లా వేసుకుంటే.. ఇటు రుచీ బాగుంటుంది.. అటు ఆరోగ్యమూ పాడవదు. అంతేకాదు.. నూనె కూడా ఎక్కువ ఖర్చు కాదు.

4. నూనె ఒక్కటే కాదు..

ఊరికే నూనెలో వేయిస్తేనే ఆహారం రుచిగా ఉంటుంది అనుకోవద్దు. కొద్దిగా నూనె తొ పాటు నీటిని కూడా పదార్ధాల తయారీకి ఉపయోగించవచ్చు. నూనెలో కొద్దిగా వేగిన తరువాత కొద్దిపాటి నీటిని వేసి ఉడకపెట్టడం వలన కూడా ప్రయోజనం ఉంటుంది. ఇటు నూనె ఖర్చు తగ్గుతుంది. అటు ఆరోగ్యానికీ మంచి చేస్తుంది.

ఈ చిట్కాలను ప్రయత్నించి చూడండి గణనీయంగా మీ ఇంట్లో నూనె వాడకం కచ్చితంగా తగ్గిపోతుంది అంటున్నారు నిపుణులు.

ఇప్పట్లో ధరలు తగ్గవు.. ఇప్పట్లో వంట నూనెల ధరలు తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే, మనం ఉపయోగించే వంట నూనెల్లో 56 శాతం వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో వివిధ కారణాల వల్ల ఈ నూనెల ధరలు బాగా పెరిగాయి. అవి ఇప్పట్లో తగ్గే అవకాశం కూడా లేదు. అందువల్ల.. నూనె ధరలతో మన బడ్జెట్ తల్లకిందులు కాకుండా ఉండాలంటే..నూనె వాడకాన్ని పరిమితం చేయాల్సిన అవసరం ఉంది.

Also Read: World Environment Day 2021: పర్యావరణ పరిరక్షణ అంశంపై బాలీవుడ్ చిన్నచూపు.. 32 ఏళ్లలో ఈ అంశంపై ఒక్కటే సినిమా!

హ్యాట్సాఫ్ టు హెల్త్ కేర్ వర్కర్స్ టీమ్ ! జమ్మూ కాశ్మీర్ లో మారుమూల గ్రామాలకు వ్యాక్సిన్ బాక్సులతో నదిని దాటిన బృందం