AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలలో శవం కనిపిస్తే దాని అర్థమేంటో తెలుసా..? శాస్త్రం ఏం చెబుతుందంటే..?

కలలో శవం, శవపేటిక, లేదా చితి కనిపిస్తే, అది భయపెట్టినా శాస్త్రం ప్రకారం శుభ సూచనగా భావించవచ్చు. ఇవి సానుకూల మార్పులు, ఆర్థిక లాభాలు, లేదా విజయానికి సంకేతాలుగా ఉంటాయి. పూర్వీకులను కలలో చూడటం వారి ఆశీర్వాదం పొందినట్లు భావిస్తారు. ఇది వ్యక్తిగత, వృత్తి విజయాలకు సూచన.

కలలో శవం కనిపిస్తే దాని అర్థమేంటో తెలుసా..? శాస్త్రం ఏం చెబుతుందంటే..?
Dreaming Of Corpses
Prashanthi V
|

Updated on: Jan 24, 2025 | 5:01 PM

Share

కలలు మన జీవితంలో జరిగే సంఘటనలకు ముందస్తు సంకేతాలను తెలియజేస్తాయి. శాస్త్రం ప్రకారం.. ప్రతి కలకూ ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుందట. కొన్ని కలలు శుభసూచనలుగా ఉంటే, మరికొన్ని అశుభ సూచనలను ఇస్తాయట. ముఖ్యంగా కలలో శవం, శవపేటిక, లేదా చితి కనిపిస్తే ఇవి భయాన్ని కలిగించినా.. వీటికి శాస్త్రం ప్రకారం ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి.

కలలో శవం కనిపిస్తే చాలామంది ఉలిక్కిపడతారు. కానీ శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా..? ఇది శుభానికి సంకేతం కావచ్చు. ఇది మీ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయని సూచిస్తుంది. మీరు త్వరలోనే ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. అదే విధంగా, అకస్మాత్తుగా ఓ గొప్ప విజయాన్ని సాధించవచ్చనే సంకేతం ఇది.

మీ కలలో మీరు చనిపోయినట్లు అనుభవిస్తే.. ఇది భయంకరంగా అనిపించినప్పటికీ, శాస్త్రం ప్రకారం ఇది శుభ సూచనగా పరిగణించబడుతుంది. ఇది మీ జీవితంలో ఉన్న సమస్యలు త్వరలోనే ముగుస్తాయని, కొత్త అవకాశాలు లేదా సానుకూల మార్పులు రాబోతున్నాయని తెలియజేస్తుంది.

పూర్వీకులు లేదా మరణించిన వ్యక్తులు కలలో కనిపిస్తే, ఇది ప్రత్యేకమైన అర్థం కలిగి ఉంటుంది. శాస్త్రం ప్రకారం ఇది పూర్వీకుల ఆశీర్వాదానికి సంకేతం. అటువంటి కలలు వ్యక్తిగత జీవితం లేదా వృత్తి జీవితంలో విజయాన్ని సూచిస్తాయి. ముఖ్యంగా ఇది మీ జీవితంలో మంచి రోజుల ఆరంభానికి సంకేతంగా ఉంటుందని చెప్పవచ్చు.

శాస్త్రం ప్రకారం.. కలలో శవపేటిక కనిపించడం మంచి సమయానికి సంకేతం. ఇది మీ జీవితంలో నూతన విజయాలను సూచిస్తుంది. అలాగే చితి కనిపిస్తే అది కూడా ఒక విధంగా మీ మనసులో మార్పులు జరగడానికి సంకేతం అని భావించవచ్చు. శాస్త్రం ప్రకారం కలలు భవిష్యత్తులో జరిగే మార్పులకు సంకేతాలు ఇస్తాయి. ముఖ్యంగా కలలో శవం, శవపేటిక, లేదా చితి కనిపిస్తే, భయపడకూడదు. వాటి వెనుక మంచి అర్థాలు దాగి ఉండవచ్చు. ఈ సంకేతాలను సరిగా అర్థం చేసుకుని జీవితంలో దిశానిర్దేశం చేసుకోవడం మంచిది.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)