గబ్బిలం ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుంది.? శాస్త్రం ఏం చెబుతోదంటే..
అయితే కొందరు మాత్రం గబ్బిలం ఇంట్లోకి వస్తే మంచిదేనని అభిప్రాయంతో ఉంటారు. ఇంతకీ గబ్బిలాలు ఇంట్లోకి వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.? అసలు గబ్బిలం ఇంట్లోకి రావడంపై జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారు.? ఇప్పుడు తెలుసుకుందాం. గబ్బిలం లక్ష్మీ దేవి వాహనం కావడం వల్ల ఒకవేళ ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదని చెబుతుంటారు. అయితే మరికొందరి విశ్వాసం ప్రకారం మాత్రం..

హిందూ సంప్రదాయం ప్రకారం ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని రకాల పనులు అశుభంగా పరిగణిస్తుంటాం. ఇలాంటి వాటిలో ఒకటి గబ్బిలాలు ఇంట్లోకి రావడం. గబ్బిలం ఒకవేళ ఇంట్లోకి వస్తే అశుభంగా భావిస్తుంటారు. నిజానికి గబ్బిలాలు పెద్దగా జనావసాల్లో కనిపించవు. దేవాలయాల దగ్గర లేదా పెద్ద పెద్ద చెట్ల వద్ద ఆవాసాలు ఏర్పరుచుకొని జీవిస్తుంటాయి. ఇలాంటివి ఉన్నట్లుండి ఇంట్లోకి ప్రవేశిస్తే అది కచ్చితంగా ఏదో కీడును శంకిస్తుందని విశ్వసిస్తుంటారు.
అయితే కొందరు మాత్రం గబ్బిలం ఇంట్లోకి వస్తే మంచిదేనని అభిప్రాయంతో ఉంటారు. ఇంతకీ గబ్బిలాలు ఇంట్లోకి వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.? అసలు గబ్బిలం ఇంట్లోకి రావడంపై జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారు.? ఇప్పుడు తెలుసుకుందాం. గబ్బిలం లక్ష్మీ దేవి వాహనం కావడం వల్ల ఒకవేళ ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదని చెబుతుంటారు. అయితే మరికొందరి విశ్వాసం ప్రకారం మాత్రం.. గబ్బిలాలు రాత్రి సమయాల్లో ఎవరైనా ఇంటికి ఎదురుగా వచ్చి ఉందంటే ఆ ఇంట్లో ఎవరో చనిపోతారని విశ్వసిస్తుంటారు. జనవాసాల్లోకి రాని గబ్బిలాలు ఉన్నపలంగా రావడం అరిష్టంగా సూచిక అంటుంటారు.
ఇక గబ్బిలాలు ఇంట్లోకి వస్తే వైవాహిక జీవితంలో ఇబ్బందులు తప్పవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో గబ్బిలం రాక మరణానికి సంకేతంగా పరిగణిస్తుంటారు. అందుకే గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. ఒకవేళ పొరపాటునా వచ్చినా గబ్బిలాలను ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఒకవేళ గబ్బిలం ఇంట్లోకి వస్తే పసుపు నీటితో ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకొని, గుగ్గిలం పొగ వేసుకుంటే గబ్బిలం రాకవల్ల వచ్చిన దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు.
ఇక గబ్బిలం ఇంట్లోకి వచ్చి వెళ్లిపోయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత లక్ష్మీ దేవీ పటం ముందు దీపం పెట్టి ఆరాధించాలి. పండితుల సూచన మేరకు గృహ శాంతి చేయించుకుంటే మంచి జరుగుతుంది. ఇక ఒకవేళ గబ్బిలం ఇంట్లో వస్తే దానిని తరిమి కొట్టకూడదు. ముందుగా ఇంట్లోని లైట్స్ అన్నీ ఆఫ్ చేయాలి. ఇలా చేస్తేనే గబ్బిలానికి దారి కనిపించి బయటకు వెళ్లిపోతుంది. అలా కాకుండా లైట్స్ ఆన్‌లోనే ఉంటే అది మరింత కన్ఫ్యూజ్‌కి గురై ఇంట్లో చక్కర్లు కొడుతుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కొన్ని శాస్త్రాల్లో తెలిపిన వివరాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..




