Dream: కారు అదుపు తప్పినట్లు కల వచ్చిందా.? దాని అర్థం ఏంటో ఏంటో తెలుసా
కలలు రావడం సర్వసాధారణమైన విషయం. అయితే మనకు వచ్చే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుందని మీకు తెలుసా.? కలలో కనిపించే అంశాలు మనకు ఒక సందేశాన్ని ఇస్తాయని పండితులు చెబుతుంటారు. మరి అలాంటి కొన్ని కలలు , వాటి అర్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రి పడుకున్న తర్వాత కలలు రావడం సర్వసాధరణమైన విషయం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వస్తూనే ఉంటాయి. అయితే మనం ప్రమేయం లేకుండా వచ్చే కలలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని పండితులు, మానసిక నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ మనకు వచ్చే ఏ కలకు ఎలాంటి అర్థం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
* కలలో ప్రమాదం జరిగినట్లు కలలు రావడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా కారు అదుపు తప్పుతున్నట్లు కల వస్తే మీ స్వేచ్ఛను ఎవరో నియంత్రిస్తున్నారని అర్థం. మీరు చేయాలనుకుంటున్న పనిని ఇతరుల కారణంతో ఆగిపోతుంటే ఇలాంటి కలలు వస్తాయని మానసిక నిపుణులు సైతం చెబుతున్నారు. జీవితాన్ని మీ అదుపులోకి తీసుకోవాలని ఈ కల మిమ్మల్ని అలర్ట్ చేస్తుందని తెలుసుకోవాలి.
* సాధారణంగా మరణం అనగానే మనం నెగిటివ్‌గా భావిస్తాం. కానీ నిజానికి కలలో చావు కనిపిస్తే మంచికి సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా చనిపోయినట్లు కలలో కనిపిస్తే. మీ జీవితంలో జరగబోతున్న మార్పునకు అది సంకేతంగా భావించాలి.
* పై నుంచి కిందికి పడుతోన్నట్లు కలలో కనిపిస్తే ఏదో విషయంలో మీ జీవితం అదుపు తప్పి పోతోందని అర్థం చేసుకోవాలి. ఆత్మన్యూనత, ఓటమి వంటి భయాలు వెంటాడుతోన్న వారిలో ఇలాంటి కలలు వస్తాయి.
* ఏటైనా ప్రయాణం చేస్తున్నట్లు కలలో కనిపిస్తే మీ రొటీన్ లైఫ్ నుంచి మార్పు కోరుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. బిజీ లైఫ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకోవాలని ఈ కల సూచిస్తుంది.
* ఎవరైనా మిమ్మల్ని తరుముతున్నట్లు కల వస్తే మీరు చేయాల్సిన పనులను వాయిదా వేస్తున్నారని అర్థం చేసుకోవాలి. జీవితంలో ఎదురయ్యే ఛాలెంజెస్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని దాని అర్థం.
* కలలో నగ్నంగా ఉన్నట్లు కనిపిస్తే.. మనసులో గూడు కట్టుకున్న అభద్రత కారణమని అర్థం చేసుకోవాలి. మీరు ఏదో మానసిక సమస్యతో ఉన్నారని అర్థం చేసుకోవాలి.
* లైంగింక కోరికల గురించి కలలో వస్తుంటే.. మీరు ఒంటరితనంతో ఇబ్బంది పడుతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే మీరు ఒక తోడును కోరుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..