Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike Washing Tips: ఇంటివద్దే బైక్ వాషింగ్ చేస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తు పాటించండి..

మోటార్ సైకిల్ రైడింగ్(bike riding) అంటే యువతకు పెద్ద క్రేజ్.. అంతే కాదు అలా రయ్.. రయ్ మంటూ తిరగడం అంటే వారికి భలే సరదా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో రెండు మూడు మోటార్ సైకిళ్లు, స్కూటర్లు ఉంటున్నాయి. పట్టణాలు,గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ బైక్ అనేది కామన్‌గా మారిపోయింది. బైక్ ఎంత క్రేజీగా డ్రైవ్ చేస్తామో దాని మెంటనెన్స్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మోటర్ సైకిల్ […]

Bike Washing Tips: ఇంటివద్దే బైక్ వాషింగ్ చేస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తు పాటించండి..
Bike Washing
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 14, 2022 | 9:00 AM

మోటార్ సైకిల్ రైడింగ్(bike riding) అంటే యువతకు పెద్ద క్రేజ్.. అంతే కాదు అలా రయ్.. రయ్ మంటూ తిరగడం అంటే వారికి భలే సరదా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో రెండు మూడు మోటార్ సైకిళ్లు, స్కూటర్లు ఉంటున్నాయి. పట్టణాలు,గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ బైక్ అనేది కామన్‌గా మారిపోయింది. బైక్ ఎంత క్రేజీగా డ్రైవ్ చేస్తామో దాని మెంటనెన్స్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మోటర్ సైకిల్ సర్వీసింగ్ క్రమం తప్పకుండా చేయించాల్సి ఉంటుంది. నిర్లక్షం చేస్తే చాలా సమస్యలు వస్తుంటాయి. బైక్ సర్వీసింగ్‌తోపాటు వాషింగ్ కూడా అంతే ముఖ్యం. ప్రతి సారి బైక్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి చేయించలేం. అయితే కనీసం మన బైక్‌ను మనమే శుభ్రం చేసుకోవల్సిన అవసరం ఉంది. ఇంట్లోనే క్లీనింగ్ చేసుకోవడం వల్ల మీకు డబ్బు కూడా ఆదా అవుతుంది.. మీరు బైక్ ప్రియులైతే.. మీ బైక్‌ను ఇంట్లో వాషింగ్ చేస్తున్నట్లైతే  బైక్‌ను కడగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.  ఈ జాగ్రత్తలు పాటించకుండా బైక్‌ను కడగడం వలన.. మీరు ఆ తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. వాస్తవానికి, బైక్‌లోని కొన్ని భాగాలు సున్నితంగా ఉంటాయి. వాటిలోకి నీరు చేరితే సమస్య పెరిగే అకాశం ఉంది. ఇంట్లోనే బైక్ వాషింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

ఎగ్జాస్ట్ పైపు..

మీరు బైక్‌ను కడిగినప్పుడల్లా, బైక్ ఎగ్జాస్ట్ పైప్‌లో అంటే సైలెన్సర్‌లో నీరు చేరకుండా ప్రయత్నించండి. వాస్తవానికి నీరు లోపలికి వెలితే.. బైక్ స్టార్ట్ చేయడం కష్టంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు పదే పదే కిక్కు కొట్టాల్సి రావచ్చు. ఆ తర్వత బైక్‌ను కాసేపు ఆన్‌లో ఉంచాలి. ఆపై సైలెన్సర్‌లోని నీరు ఆరిపోయినప్పుడు మాత్రమే బైక్ స్టార్ట్ అవుతుంది.

కీ-లాక్‌లోకి.. 

అలాగే మోటార్‌సైకిల్ వాషింగ్ చేస్తున్నసమయంలో కీ-లాక్‌లో నీరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కీ-లాక్‌లోకి నీరు చేరితో కీ కదలిక సాఫీగా ఉండదు. చాలా సందర్భంలో మీరు బైక్‌ను లాక్-అన్‌లాక్ చేయలేరు. చాలా ప్రతి సారి నీరు కీ-లాక్‌లోకి నీరు చేరడం వల్ల అది చెడిపోయే అవకాశం ఉంది. అయితే, కొంత సమయం తర్వాత నీరు ఆరిపోయినప్పుడు. మీరు మళ్లీ కీ లాక్‌ని సజావుగా ఉపయోగించగలరు. దీని కోసం మీరు కీ-లాక్‌లో కొంత నూనె వేయండి.. కీ లాక్ సజావుగా పనిచేయడానికి నూనె సహాయపడుతుంది.

ఫ్యూయెల్ ట్యాంక్‌లోకి

అయితే మరో ముఖ్య విషయం కూడా ఉంది. వాషింగ్ చేస్తున్న సమయంలో పెట్రోల్ ట్యాంక్‌లోకి నీరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఫ్యూయల్ ట్యాంక్‌లోకి నీరు వెళ్లడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. నిజానికి ఫ్యూయెల్ ట్యాంక్‌లోకి నీరు వెళితే అది పెట్రోల్‌లో కలిసిపోతుంది. దాని వల్ల పెట్రోల్ సామర్థ్యం తగ్గుతుంది. పెట్రోల్‌లో నీరు కలిస్తే ఇంజిన్ పెట్రోల్‌ను తీసుకోదు. అటువంటి పరిస్థితిలో, మీ బైక్ స్టార్ట్ చేయడంలో సమస్య ఏర్పడుతుంది.  అది స్టార్ట్ అయినప్పటికీ అది సరిగ్గా నడవదు.

ఇవి కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో షాకింగ్ ఇన్సిడెంట్.. లక్డీకాపూల్‌ వద్ద రేంజ్‌ రోవర్‌ కారులో మంటలు..

JAIHO BHARATH: జై హో భారత్.. తటస్థ విధానంతోనే పలు దేశాలను దారిలోకి తెచ్చిన దౌత్య విధానం.. అమెరికాలో మార్పుకు అదే కారణం!