AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్‌.. బొద్దింకలు ఇంత డేంజరా..? ఇలాంటి వ్యాధులకు కారణం ఇదేనట..!

ఒక్క బొద్దింక ఇంట్లో చేరితే వందల కొద్దీ పుట్టుకొస్తాయి. ముఖ్యంగా రాత్రి పూట వంటగదిలో ఎక్కువగా బొద్దింకలు తిరుగుతుంటాయి.. ఎంత తరిమి కొట్టినా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. అయితే, బొద్దింకలే కదా అని ఊరుకుంటే ఇంట్లో వ్యాధులు తిష్టవేసినట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బొద్దింకల వల్ల చాలా ప్రజలు అనారోగ్యం బారినపడే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

బాబోయ్‌.. బొద్దింకలు ఇంత డేంజరా..? ఇలాంటి వ్యాధులకు కారణం ఇదేనట..!
Diseases Spread By Cockroac
Jyothi Gadda
|

Updated on: Jun 06, 2025 | 2:05 PM

Share

ఇంటిని ఎన్ని సార్లు శుభ్రం చేసినా, ఎంత క్లీన్ గా పెట్టుకున్న ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక మూలన బొద్దింకలు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. వాటిని ఎదుర్కొవడం నిజంగానే పెద్ద సమస్యే అవుతుంది. ఎందుకంటే ఒక్క బొద్దింక ఇంట్లో చేరితే వందల కొద్దీ పుట్టుకొస్తాయి. ముఖ్యంగా రాత్రి పూట వంటగదిలో ఎక్కువగా బొద్దింకలు తిరుగుతుంటాయి.. ఎంత తరిమి కొట్టినా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. అయితే, బొద్దింకలే కదా అని ఊరుకుంటే ఇంట్లో వ్యాధులు తిష్టవేసినట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బొద్దింకల వల్ల చాలా ప్రజలు అనారోగ్యం బారినపడే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

బొద్దింకల విసర్జక పదార్థాలు గాలిలో చేరి అలెర్జీలకు కారకాలుగా పని చేస్తాయి. మలినాలు చేరిన గాలిని పీల్చడం, ఆ పరిసరాల్లో ఉండటం వల్ల స్కిన్‌ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆస్తమాబొద్దింకల పొట్టు కలిసిన గాలిని పీల్చడం వల్ల ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది. తుమ్ములు, దగ్గు, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఫుడ్ పాయిజనింగ్బొద్దింకలు ఆహారపదార్థాలను కలుషితం చేస్తాయి. బొద్దింకలు అనేక బ్యాక్టీరియాలను ఆహారం మీదకు తీసుకువస్తాయి. ఈ ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్‌ పాయిజన్‌ అవుతుంది.

బొద్దింకలు సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియాను వ్యాప్తి చేస్తాయి. దీని వల్ల టైఫాయిడ్‌ వస్తుంది. బొద్దింకలు ఈ. కోలి అనే బ్యాక్టీరియాను వ్యాప్తి చెందిస్తాయి. ఇది విరేచనాలకు కారణం అవుతుంది. కొన్ని సార్లు రక్తవిరేచనాలు కూడా అయ్యే అవకాశం ఉంది. కలరాబొద్దికంలు విబ్రియో కలరే అనే బ్యాక్టీరియాను సైతం వ్యాప్తి చేస్తాయి. దీని వల్ల కలరా వస్తుంది. డీహైడ్రేషన్‌ సమస్య ఎక్కువగా ఉంటుంది. స్టమక్ ఫ్లూబొద్దికంల వల్ల స్టమక్‌ ఫ్లూ కూడా వస్తుంది. దీని వల్ల కడుపు, పేగుల్లో వాపు వస్తుంది. వాంతులు, విరేచనాలు దీని లక్షణాలు. యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌. బొద్దంకలు కొన్ని సార్లు UTIకి కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా వ్యాప్తి చేస్తాయి.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఈ కథనంలోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏదైనా సమస్యలున్నా.. సందేహాలు ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..