AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raincoat: రెయిన్ కోట్ కొంటున్నారా.. ఇవి తెలుసుకోవడం పక్కా!

వర్షాకాలంలో గొడుగుతో పాటు రెయిన్‌కోట్ తప్పనిసరి. అయితే, రెయిన్‌కోట్ కొనే ముందు కొన్ని విషయాలు తప్పకుండా గమనించాలి. కేవలం మోడల్, సౌకర్యం మాత్రమే కాదు. అసలైన రక్షణ ఇచ్చే సరైనఫ్యాబ్రిక్ ఎలా ఉండాలి అనే అంశం దగ్గర్నుంచి దాని పొడవు ఎంత ఉండాలనే వరకు అన్ని  ఐదు కీలక పాయింట్స్ గురించి తెలుసుకుందాం.

Raincoat: రెయిన్ కోట్ కొంటున్నారా.. ఇవి తెలుసుకోవడం పక్కా!
Buying The Perfect Raincoat
Bhavani
|

Updated on: Jul 31, 2025 | 4:06 PM

Share

వర్షాకాలంలో బయటకు వెళ్లాలంటే గొడుగు, రెయిన్‌కోట్ తప్పనిసరి. గొడుగు విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన పని ఉండదు. కానీ రెయిన్‌కోట్ కొనేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి మోడల్ తీసుకుంటున్నాం. అది సౌకర్యంగా ఉంటుందా. సరిగ్గా నీటిని అడ్డుకుంటుందా.. వంటి విషయాలను చెక్ చేసుకోవాలి. అయితే, కేవలం ఇవే కాదు, పర్ఫెక్ట్ రెయిన్‌కోట్ కొనాలంటే తప్పనిసరిగా కొన్ని విషయాలు గమనించాలి. ముఖ్యంగా, 5 ముఖ్యమైన పాయింట్స్ కచ్చితంగా పరిశీలించాలి. ఫ్యాబ్రిక్ ఎలా ఉండాలి అనే అంశం దగ్గర్నుంచి దాని పొడవు ఎంత ఉండాలనే వరకు అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఫ్యాబ్రిక్ రెయిన్‌కోట్ వేసుకునేది వర్షంలో తడవకుండా ఉండటానికే కదా! కానీ కొన్ని రెయిన్‌కోట్లు సరిగా పని చేయక, వేసుకున్నా పూర్తిగా తడిచిపోతారు. దీనికి ప్రధాన కారణం సరైన ఫ్యాబ్రిక్ లేకపోవడమే. రెయిన్‌కోట్ కొనేటప్పుడు అది తప్పనిసరిగా వాటర్‌ప్రూఫ్ (నీరు లోపలికి వెళ్లకుండా) ఫ్యాబ్రిక్‌తో తయారైందా లేదా అని చెక్ చేయాలి. వాటర్‌ప్రూఫ్ ఫ్యాబ్రిక్‌లలో కూడా రకరకాల నాణ్యతలు ఉంటాయి. హై-క్వాలిటీ వాటర్‌ప్రూఫ్ ఫ్యాబ్రిక్ కావాలంటే కాస్త ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది, కానీ వర్షంలో తడవకుండా ఉండాలన్నా, ఎక్కువ కాలం మన్నికగా ఉండాలన్నా ఇవే మంచివి. ఈ తరహా కోట్లను ప్రత్యేకంగా పరీక్షిస్తారు. వాటిపై నీళ్లు స్ప్రే చేసి, ఫ్యాబ్రిక్ ఎంతవరకు సమర్థంగా పనిచేస్తుందో గమనిస్తారు. ఇవి నీటిని పీల్చుకోకుండా, కేవలం పైనుంచి జారిపోయేలా చేస్తాయి. మామూలు కోట్లు అయితే నీరు పడగానే పూర్తిగా తడిసిపోతాయి.

2. స్టిచింగ్ కొన్ని రెయిన్‌కోట్లు వాటర్‌ప్రూఫ్ అని చెప్పి అమ్ముతారు, కానీ వాటిని వాడేటప్పుడు లోపల తడిగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. దీనికి కారణం లోపల వాడే గుడ్డ సరిగా లేకపోవడం లేదా కుట్టుపని సరిగా లేకపోవడం. సరైన విధంగా కుట్టకపోయినా, మంచి క్లాత్ వాడకపోయినా వెంటనే తడిసిపోతుంది. అయితే, మంచి క్వాలిటీ రెయిన్‌కోట్లలో ఈ సమస్య ఉండదు. లోపల కూడా వాటర్‌ప్రూఫ్ టేప్‌లను వాడి, ప్రతి కుట్టు వద్ద సీల్ చేస్తారు. అప్పుడే ఇది పూర్తిగా వాటర్‌ప్రూఫ్ రెయిన్‌కోట్‌గా మారుతుంది. మీరు గమనిస్తే, ఇలాంటి వాటర్‌ప్రూఫ్ రెయిన్‌కోట్లు బరువు చాలా తక్కువగా ఉంటాయి. వాటికి వాడే క్లాత్ చాలా విభిన్నంగా ఉంటుంది. ఇంత తేలికగా ఉన్నప్పటికీ, అస్సలు తడవవు. ముఖ్యంగా, కుట్ల వద్ద ఎలాంటి డ్యామేజ్ లేకుండా చూసుకోవడం ముఖ్యం, లేదంటే చాలా త్వరగా తడిసిపోయే అవకాశం ఉంటుంది.

3. హుడీ, అడ్జస్ట్‌మెంట్ తలపైన కూడా కవర్ అయ్యేలా చూసుకోవడం మంచిది. దీన్నే హుడీ అంటారు. ఈ హుడీ కూడా సరైన విధంగా ఉండాలి. తలపై సరిగ్గా ఉండాలంటే, దానికి అడ్జస్ట్‌మెంట్ తప్పనిసరిగా ఉండాలి. గాలి బాగా వచ్చినప్పుడు హుడీ పక్కకు తొలగిపోయే అవకాశం ఉంటుంది, దీనివల్ల తల తడిసిపోతుంది. అలా కాకుండా, ఎంత గాలి వచ్చినా తలకు పట్టి ఉండేలా అడ్జస్ట్‌మెంట్ సౌకర్యం ఉన్నదా అని చెక్ చేసుకోవాలి. ముందు భాగంలో దారాలు (థ్రెడ్స్) ఉండేలా చూసుకుంటే, దాన్ని లూస్ చేసుకోవడానికి, టైట్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఎక్కువ దూరం నడవాల్సి వచ్చినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

4. బ్రీథబిలిటీ రెయిన్‌కోట్‌కు కచ్చితంగా బ్రీథబిలిటీ ఉండాలి. అంటే, వేసుకున్న తర్వాత అది సౌకర్యంగా ఉండాలి. ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, అదే సమయంలో గాలి ఆడే విధంగా ఉండాలి. వేసుకున్న వెంటనే చెమటలు పట్టినట్టు, ఊపిరి ఆపేసినట్లు చేస్తే దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే అలాంటి ఫ్యాబ్రిక్‌నే ఎంచుకోవాలి. ఎప్పటికప్పుడు నీరు ఆవిరైపోయే విధంగా ఉండాలి. బ్రీథబిలిటీ ఎక్కువగా ఉండే ఫ్యాబ్రిక్స్ వాడితేనే ఈ సౌకర్యం ఉంటుంది. తేమను ఎక్కువసేపు పట్టి ఉంచకుండా, ఎప్పటికప్పుడు ఈ ఫ్యాబ్రిక్స్ బయటకు పంపేస్తాయి. ఫలితంగా దుర్వాసన రావడం, బరువుగా అనిపించడం వంటి సమస్యలు రానే రావు. లైట్‌వెయిట్ వాటర్‌ప్రూఫ్ జాకెట్స్‌కి వాడే ఫ్యాబ్రిక్స్‌లో ఈ బ్రీథబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే, ఇలాంటివి ఎంపిక చేసుకుంటే మంచిది.

5. పొడవు రెయిన్‌కోట్స్‌లో తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సిన మరో విషయం దాని పొడవు. ఎంత పొడవు ఉంటే అంత మంచిది. బయటకు వెళ్లినప్పుడు, ఎక్కువ దూరం నడవాల్సి వచ్చినప్పుడు, బయట నిలబడి ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు కచ్చితంగా పొడవు ఎక్కువగా ఉండే రెయిన్‌కోట్స్ వాడాల్సి ఉంటుంది. పైగా పొడవు ఎక్కువగా ఉండటం వల్ల మొత్తం శరీరం కవర్ అవుతుంది, తడవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మార్కెట్లో ఇలాంటి ఫుల్ బాడీ రెయిన్‌కోట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ చెక్ చేసుకుని కొనుగోలు చేసుకుంటే మంచిది.