Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baby Birth With Tail: ఇదో విచిత్రం.. తోకతో పుట్టిన చిన్నారి.. బాబును చూసి ఎయిమ్స్ వైద్యుల షాక్..!

సాధారణంగా మనుషులకు తోకలు ఉండవు. జంతువులకు మాత్రమే తోకలు ఉంటాయి. అయితే తాజాగా అచ్చం జంతువుల మాదిరి మనిషికి తోక ఉండటం షాక్‌కు గురి చేసింది. పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లిన ఓ గర్భిణీకి డాక్టర్లు సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్ నిర్వహించారు. అనంతరం బిడ్డను బయటికి తీసిన డాక్టర్లు ఆ శిశువుకు తోక ఉండటం చూసి షాక్ అయ్యారు. ఈ విచిత్ర సంఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.

Baby Birth With Tail: ఇదో విచిత్రం.. తోకతో పుట్టిన చిన్నారి.. బాబును చూసి ఎయిమ్స్ వైద్యుల షాక్..!
Aiims Bibinagar
Follow us
M Revan Reddy

| Edited By: TV9 Telugu

Updated on: Jul 16, 2024 | 4:14 PM

సాధారణంగా మనుషులకు తోకలు ఉండవు. జంతువులకు మాత్రమే తోకలు ఉంటాయి. అయితే తాజాగా అచ్చం జంతువుల మాదిరి మనిషికి తోక ఉండటం షాక్‌కు గురి చేసింది. పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లిన ఓ గర్భిణీకి డాక్టర్లు సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్ నిర్వహించారు. అనంతరం బిడ్డను బయటికి తీసిన డాక్టర్లు ఆ శిశువుకు తోక ఉండటం చూసి షాక్ అయ్యారు. ఈ విచిత్ర సంఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.

యాదాద్రి జిల్లా బీబీనగర్‌లోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌) వైద్యులు అరుదైన ఘనత సాధించారు. తోకతో పుట్టిన చిన్నారికి క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి తోకను తొలగించారు. తెలంగాణకు చెందిన ఓ దంపతులకు గత ఏడాది అక్టోబరులో ఓ మహిళకు తోకతో ఉన్న బాలుడు జన్మించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మూడు నెలలు నిండే సరికి అది 15 సెంటీ మీటర్లు కావడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. దీంతో ఈ ఏడాది జనవరి నెలలో బాబును తల్లిదండ్రులు బీబీ నగర్ ఎయిమ్స్‌కు తీసుకు వచ్చారు. చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగం అధిపతి, అదనపు ప్రొఫెసర్ డాక్టర్ శశాంకండా నిర్వహించిన వైద్య పరీక్షల్లో వెన్నెముకలోని ఐదు వెన్నుపూసలతో అనుసంధానమై తోక బయటకు వచ్చినట్లు గుర్తించారు. గర్భం దాల్చే సమయంలో సమస్య తలెత్తి స్పైనల్‌ కార్డ్‌ సరిగా ఏర్పడక బాబు తోకతో జన్మించాడని, దీనిని వైద్య పరిభాషలో స్పినా బిఫిడగా పరిగణిస్తారని తల్లిదండ్రులకు వైద్యులు తెలిపారు.

కేసును సవాలుగా తీసుకున్న ఎయిమ్స్ వైద్య బృందం రెండున్నర గంటలకు పైగా శ్రమించి సంక్లిష్టమైన ఆపరేషన్ చేసి15 సెంటీమీటర్ల పొడవు ఉన్న ఆ తోకను చిన్నారి శరీరం నుంచి తొలగించారు. ఐదు రోజుల పాటు చిన్నారి ఆరోగ్య పరిస్థితులను గమనించిన అనంతరం డిశ్చార్జ్‌ చేశారు. అయితే ఇలాంటి సంక్లిష్టమైన ఆపరేషన్ తర్వాత నాడీ సంబంధిత సమస్యలు ఎదురవుతాయని వైద్యులు తెలిపారు. ఆరు నెలలుగా బాబును పర్యవేక్షించిన వైద్యులు చిన్నారికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో చిన్నారికి ఏ విధమైన ఇబ్బందులు ఉత్పన్నం కాలేదని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని వైద్యులు నిర్ధారించారు. వెన్నెముకతో ముడిపడి ఉన్న ఈ ఆపరేషన్ అత్యంత క్లిష్టమైందని ఎయిడ్స్ వైద్యులు తెలిపారు. ఆ తోకను శరీరం నుంచి విజయవంతంగా తొలగించిందుకు బాబు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

Baby Born With Tail

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…