AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone Speakers: మీ ఫోన్‌ స్పీకర్లు సరిగ్గా పని చేయడం లేదా? ఇలా క్లీన్‌ చేస్తే బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌..!

దుమ్ము, ధూళి అనేవి ఫోన్లల్లో చేరడం మామూలుగా జరిగే విషయం. అయితే ఈ దుమ్ము అనేది మీ స్క్రీన్‌పై పడితే సాధారణంగా తరచూ తుడుస్తూ ఉంటాయి. అయితే ఈ దుమ్ము మీ ఫోన్‌ స్పీకర్లల్లో చేరుకుంటే మాత్రం స్పీకర్లు పని చేయడంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే తరచూ స్క్రీన్‌ను క్లీన్‌ చేసిన విధంగా మీ ఫోన్‌ స్పీకర్లు క్లీన్‌ చేస్తే మీ ఫోన్‌ మన్నిక చాలా బాగుంటుంది. మీ ఫోన్ స్క్రీన్‌ను తుడిచివేయడం చాలా సులభం కానీ దాని స్పీకర్‌లను సరిగ్గా క్లీన్ చేయడానికి కొంచెం ఎక్కువ నైపుణ్యం అవసరం.

Phone Speakers: మీ ఫోన్‌ స్పీకర్లు సరిగ్గా పని చేయడం లేదా? ఇలా క్లీన్‌ చేస్తే బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌..!
Speaker Cleaning
Nikhil
| Edited By: Ram Naramaneni|

Updated on: Nov 27, 2023 | 7:42 PM

Share

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయింది. గతంలో కాల్స్‌, మెసేజ్‌లకు మాత్రమే వాడే ఫోన్లు ప్రతి అవసరానికి తప్పనిసరయ్యాయి. ప్రతి ఒక్కరూ ఎక్కువ సమయం గడిపే వస్తువు ఏదైనా ఉంటే అందులో స్మార్ట్‌ఫోన్లు మొదటి స్థానంలో ఉంటాయి. అయితే వాటిల్లో అనివార్యంగా దుమ్ము, ధూళి అనేవి ఫోన్లల్లో చేరడం మామూలుగా జరిగే విషయం. అయితే ఈ దుమ్ము అనేది మీ స్క్రీన్‌పై పడితే సాధారణంగా తరచూ తుడుస్తూ ఉంటాయి. అయితే ఈ దుమ్ము మీ ఫోన్‌ స్పీకర్లల్లో చేరుకుంటే మాత్రం స్పీకర్లు పని చేయడంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే తరచూ స్క్రీన్‌ను క్లీన్‌ చేసిన విధంగా మీ ఫోన్‌ స్పీకర్లు క్లీన్‌ చేస్తే మీ ఫోన్‌ మన్నిక చాలా బాగుంటుంది. మీ ఫోన్ స్క్రీన్‌ను తుడిచివేయడం చాలా సులభం కానీ దాని స్పీకర్‌లను సరిగ్గా క్లీన్ చేయడానికి కొంచెం ఎక్కువ నైపుణ్యం అవసరం. దీన్ని సరైన మార్గంలో ఎలా చేయాలో ఓ సారి తెలుసుకుందాం.

ధూళిని శుభ్రం చేయడానికి మృదువైన పెయింట్ బ్రష్ లేదా టూత్ బ్రష్, ధూళిని తొలగించడానికి అంటుకునే దుమ్మును తొలగించడానికి చిన్న హ్యాండ్‌హెల్డ్ ఎయిర్ బ్లోవర్‌ని ఉపయోగించి మీరు మీ ఫోన్ స్పీకర్‌లను శుభ్రం చేయవచ్చు. మొండి ధూళి మిగిలి ఉంటే మీరు ప్రత్యేకమైన స్పాంజ్‌లు, బ్రష్‌ల ద్వారా శుభ్రం చేయవచ్చు. 

ద్రవపదార్థాలు

ఫోన్‌ను లిక్విడ్‌ల ద్వార శుభ్రం చేయడం మంచిది కాదు. మీరు షార్ట్-సర్క్యూట్ అయ్యే ప్రమాదంతో పాటు లేదా సున్నిత భాగాలు తుప్పు పట్టవచ్చు. ఇలాగైతే మాత్రం మీ ఫోన్‌ వారెంటీ కూడా రద్దయ్యే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి

పదునైన వస్తువులు

ఫోన్‌ క్లీన్‌ చేయడానికి బెంట్ పేపర్‌క్లిప్, కుట్టు సూది, పిన్స్ లేదా ఏదైనా పదునైన వస్తువును ఉపయోగించవద్దు. మీరు ఇలా చేస్తే, మీరు మీ ఫోన్ ఉపరితలం లేదా సున్నితమైన అంతర్గత భాగాలను పాడు చేయవచ్చు.

కంప్రెస్డ్ ఎయిర్

క్యాన్డ్/కంప్రెస్డ్ ఎయిర్ టెంప్టింగ్‌గా అనిపించవచ్చు. కానీ మీరు మీ ఫోన్‌లో మురికిని బలవంతంగా ఎక్కించవచ్చు లేదా డబ్బాలోని కొన్ని ద్రవాలను పిచికారీ చేయవచ్చు.

స్కౌరింగ్ పౌడర్‌ 

కఠినమైన రసాయనాలు లేదా అబ్రాసివ్‌లను ఉపయోగించడం వల్ల మీ ఫోన్ శాశ్వతంగా దెబ్బతింటుంది.

ఫోన్‌ను శుభ్రం చేయండిలా

  • శుభ్రమైన టూత్ బ్రష్ లేదా పెయింట్ బ్రష్ వంటి మృదువైన ముళ్లతో ఉండే బ్రష్‌ని ఉపయోగించి మీ ఫోన్ స్పీకర్ గ్రిల్స్‌ను సున్నితంగా శుభ్రం చేయండి. ఒకే కోణంలో బ్రష్ చేయాలి. తద్వారా మీరు ధూళిని పడగొట్టండి. దానిని మరింత లోపలికి నెట్టవద్దు.
  • మరింత ధూళిని తొలగించడానికి గ్రిల్‌లోకి బ్లూ టిక్‌, డెడికేటెడ్‌  క్లీనింగ్‌ పుట్టీ వంటి అంటుకునే పుట్టీని నొక్కాలి. పుట్టీని చాలా లోతుగా నొక్కకుండా జాగ్రత్త వహించండి. 
  • హ్యాండ్‌ హెల్డ్‌ ఎయిర్‌ బ్లోవర్‌ను ఉపయోగించి ఏవైనా మిగిలిన మురికిని క్లీన్‌ చేయాలి. హ్యాండ్‌హెల్డ్ బ్లోవర్ కంప్రెస్డ్ ఎయిర్ కంటే చాలా సున్నితంగా ఉంటుంది.  మీరు స్పీకర్ నుంచి దుమ్మును ఇట్టే వదలగొడుతుంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..