Social Media: ఈ చిన్నారులు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.. ఎవరో గుర్తుపట్టరా..?
ఈ ఫోటోలో ఉన్నవారు ఇద్దరూ అన్నాచెల్లుళ్లు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో శక్తివంతమైన వ్యక్తులుగా ఉన్నారు. వారెవరో మీరు గుర్తించారా...?
ప్రజంట్ ఇంటర్నెంట్ యుగం నడుస్తుంది. సోషల్ మీడియా అకౌంట్స్ లేనివారు చాలా అరుదుగా మాత్రమే తారసపడుతున్నారు. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా కూడా ఇట్టే తెలిసిపోతుంది. ఇక వైరల్ వీడియోలు, మీమ్స్, పోస్టులు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే తమకిష్టమైన పలువురు మూవీ స్టార్స్, పొలిటికల్ లీడర్స్, స్పోర్ట్ స్టార్స్‌ను సోషల్ మీడియాలో ఫాలో అవతున్నారు ఫ్యాన్స్. వారు పోస్ట్ చేసే ప్రతి ఫోటోను వైరల్ చేస్తున్నారు. ఈ మధ్య త్రోబ్యాక్ పిక్ ట్రెండ్ కూడా మొదలయ్యింది. సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు నెట్టింట తెగ సర్కులేట్ అవుతున్నాయి. అలాంటి ఓ క్రేజీ ఫోటోని మీ ముందుకు తెచ్చాం. అందులోని ఇద్దరు చిన్నారులు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో శక్తివంతమైన వ్యక్తులు. మీలో ఎవరైనా గెస్ చేస్తే సూపర్. కనిపెట్టలేకపోయినవారికి మేమే ఆన్సర్ చెప్పేస్తాం.
ఆ ఫోటోలో ఉంది.. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.., ఆయన సోదరి, వైఎస్సారిటీపీ అధ్యక్షురాలు షర్మిల. చాలామంది ఇప్పుడు గుర్తుపట్టి ఉంటారు. అన్నాచెల్లెళ్లు చిన్నప్పుడు దిగిన ఫోటో ఇది. గతంలో ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు వేర్వేరు దార్లు ఎంచుకున్నారు. జగన్ ఏపీ సీఎంగా తన మార్క్ పాలనతో ముందుకు వెళ్తుండగా.. షర్మిల కొత్త పార్టీ పెట్టి తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు.
ఈ ఫోటోను తెగ ట్రెండ్ చేస్తున్నారు వైఎస్సార్ ఫ్యామిలీ అభిమానులు. పార్టీలు వేరైనప్పటికీ వారి లక్ష్యం.. దివంగత నేత వైఎస్సార్ పాలనను ప్రజలకు అందించడమే అని గర్వంగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారని.. తెలంగాణలో షర్మిల శక్తివంతమైన నాయకురాలిగా మారుతుందని అభిమానులు చెప్తున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.
Childhood Pic Of @ysjagan & @realyssharmila ❤?? pic.twitter.com/2kLe0tPEBy
— ????? (@YSSR2023) August 13, 2021
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..