AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరీక్షలు అనగానే కడుపులో ఏదో తెలియని ఫీలింగ్‌.. అసలు ఇలా ఎందుకు అవుతుందో తెలుసా.?

ఆకలి ఉండదు, నిజానికి మన మెదడు నేరుగా ప్రేగులకు అనుసంధానమై ఉంటుంది. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ప్రకారం, ఒత్తిడి, ఆందోళన ప్రేగులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడికి గురైతే.. జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ఏదో తెలియని ఒత్తిడికి గురైన వెంటనే జీర్ణక్రియపై కొన్ని రకాల దుష్ప్రభావం పడుతుంని అర్థం. ఇంతకీ ఒత్తిడి కారణంగా జీర్ణక్రియపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు చూద్దాం..

పరీక్షలు అనగానే కడుపులో ఏదో తెలియని ఫీలింగ్‌.. అసలు ఇలా ఎందుకు అవుతుందో తెలుసా.?
Lifestyle
Narender Vaitla
|

Updated on: Dec 01, 2023 | 10:22 PM

Share

పరీక్షలు, ఇంటర్వ్యూలు ఇలా ఏదైనా కాస్త టెన్షన్‌గా అనిపించగానే వెంటనే కడుపులో ఏదో తెలియని కలత ఉంటుంది. కడుపులో వెంటనే ఉబ్బిన భావన కలుగుతుంది. ఆకలి ఉండదు, నిజానికి మన మెదడు నేరుగా ప్రేగులకు అనుసంధానమై ఉంటుంది. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ప్రకారం, ఒత్తిడి, ఆందోళన ప్రేగులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడికి గురైతే.. జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ఏదో తెలియని ఒత్తిడికి గురైన వెంటనే జీర్ణక్రియపై కొన్ని రకాల దుష్ప్రభావం పడుతుంని అర్థం. ఇంతకీ ఒత్తిడి కారణంగా జీర్ణక్రియపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు చూద్దాం..

* ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల పెద్ద పేగుల్లో వేగంగా కదలికలు జరుగుతాయి. దీంతో విరేచనాలు ప్రారంభమవుతాయి. దీనిని యాంగ్జయిటీ డయేరియాగా పిలుస్తుంటారు. ఇది పేగు, మెదడుకు సంబంధించినది.

* ఆందోళనకు గురైన వెంటనే.. కొన్ని హార్మోన్లు మరియు రసాయనాలు విడుదలవుతాయి. ఇవి జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించి గట్ ఫ్లోరాపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇలా చేయడం వల్ల యాంటీబాడీ ఉత్పత్తి తగ్గి అజీర్ణం, వికారం వంటి సమస్యలు వస్తాయి.

* ఒత్తిడికి గురైనప్పుడు.. నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీని కారణంగా, లాలాజల ఉత్పత్తి ప్రక్రియ మందగిస్తుంది దీంతో నోరు పొడిగా మారుతుంది. ఆందోళనకు గురైనప్పుడు నోరు పొడిబారడానికి ఇదే కారణం.

* ఇక ఆందోళన చెందడం వల్ల మూత్రాశయ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మన మనస్సు ఒత్తిడిలో ఉన్నప్పుడు, శరీరంలో ప్రతి చర్య జరుగుతంది. ఇది ఒత్తిడి హార్మోన్లను రక్తప్రవాహంలోకి పంపుతుంది. ఈ ఒత్తిడి హార్మోన్ విడుదల కారణంగా, తరచుగా మూత్రవిసర్జన వచ్చినట్లు భావన కలుగుతుంది.

జీర్ణక్రియ ఆరోగ్యం ఇలా..

* ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన, చక్కెర ఆహారాలు తీసుకోకూడదు. కూరగాయలు, పండ్లు, ఫైబర్ అధికంగా ఉండే వాటిని మాత్రమే తీసుకోవాలి.

* మన్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం, యోగా చేయాలి. ఆందోళన, ఒత్తిడి తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

* వ్యాయామం చేయడాన్ని జీవన విధానంలో భాగం చేసుకోవాలి. రక్త ప్రసరణను మెరుగుపరచడంతో, హార్మోన్లు విడుదల కావడంలో ఉపయోగపడుఉంది.

* ఇక జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడానికి రోజులో కనీసం 6-8 గ్లాసుల నీరు తాగాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..