AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkeypox: పొంచి ఉన్న మరో ముప్పు.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ!

కోవిడ్‌ సృష్టించిన బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రపంచానికి మంకీపాక్స్‌ కొత్త సవాల్‌ విసురుతోంది. ఆఫ్రికా దేశాల్లో హఠాత్తుగా కేసులు పెరిగిపోవడం, అది మిగిలిన దేశాలకు వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ తరహా ఎమర్జెన్సీ ప్రకటించడం రెండేళ్లలో ఇది రెండోసారి.

Monkeypox: పొంచి ఉన్న మరో ముప్పు.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ!
నేరుగా తాకడం వల్ల మంకీపాక్స్‌ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. నోరు, శరీరంలోని ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల కూడా ఇది సోకే ప్రమాదం ఉంది. రోగులు వాడిన దుస్తులు, వారు వినియోగించిన వస్తువుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది గాలి ద్వారా వ్యాపించదు.
Balaraju Goud
|

Updated on: Aug 16, 2024 | 7:34 AM

Share

కోవిడ్‌ సృష్టించిన బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రపంచానికి మంకీపాక్స్‌ కొత్త సవాల్‌ విసురుతోంది. ఆఫ్రికా దేశాల్లో హఠాత్తుగా కేసులు పెరిగిపోవడం, అది మిగిలిన దేశాలకు వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ తరహా ఎమర్జెన్సీ ప్రకటించడం రెండేళ్లలో ఇది రెండోసారి.

పాత వ్యాధి కొత్త రూపు సంతరించుకొని ప్రపంచాన్ని భయపెడుతోంది. ఎం-పాక్స్‌గా పిలిచే మంకీ పాక్స్‌ ఆఫ్రికా దేశాలను వణికిస్తోంది. అక్కడ దశాబ్దాలుగా ఈ వ్యాధి ఉంది. కాంగో దేశంలో ఇది చాలా తీవ్రంగా ఉంది. 1970లో తొలిసారి ఈ వ్యాధి ఆ దేశంలో వెలుగుచూసింది. అప్పటి నుంచి అది వస్తూ పోతూ అక్కడి జనాన్ని పీడిస్తోంది.

గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కాంగోలో 27వేల కేసులు నమోదయ్యాయి. పదకొండు వందల మరణాలు సంభవించాయి. మంకీపాక్స్‌ అనే వైరస్‌ నుంచి ఈ వ్యాధి ప్రబలుతుంది. మామూలు అమ్మవారితో పోల్చితే దీని ప్రభావం కొంత తక్కువే ఉంటుంది. పరిశోధనల కోసం తీసుకొచ్చిన కోతుల్లో మొట్టమొదటిసారి ఈ వ్యాధిని 1958లో డెన్మార్క్‌లో గుర్తించారు. అందుకే దీనికి మంకీ పాక్స్ అని పేరు పెట్టారు. SPOT

జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, వాపుతో పాటు చీము నిండిన పొక్కులు ఈ వ్యాధి సోకిన వ్యక్తుల్లో సాధారణంగా కనిపిస్తాయి. ఈ పొక్కులు ముఖంపై మొదలై క్రమంగా శరీరమంతా విస్తరిస్తాయి. సాధారణంగా ఈ పరిస్థితి రెండు నుంచి నాలుగు వారాలు ఉంటుంది. ఏ చికిత్స తీసుకోకున్నా అది తగ్గిపోతుంది. కాని ఆ తర్వాత దాని వల్ల రకరకాల సమస్యలు తలెత్తాయి. కొన్ని సందర్భాల్లో అది మరణానికీ దారితీస్తుంది. రోగనిరోధకశక్తి తక్కువ ఉండేవాళ్లు దీని బారిన పడితే కోలుకోవడం కష్టమే.

ప్రస్తుతం ఈ వ్యాధి ప్రభావం 116 దేశాలపై ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇప్పటి వరకు తూర్పు, పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల్లో ఉన్న ఎం-పాక్స్‌ ఇప్పుడు అమెరికా, యూరోప్‌కు కూడా వ్యాపించింది. మంకీపాక్స్ కేసు 2022లో మన దేశంలో కేరళలో కూడా ఒకటి నమోదైంది. అయితే, ఈ వ్యాధికి ఎటువంటి చికిత్స లేదు. లక్షణాలను బట్టి చికిత్స అందించడం ప్రస్తుతానికి ఉన్న మార్గం. స్మాల్‌ పాక్స్‌ కోసం రూపొందించిన మూడు వ్యాక్సిన్స్‌ మంకీపాక్స్‌ నివారణకు కూడా కూడా ఆమోదించారు. అయితే వీటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరణ లేదు.

ఇప్పుడు ఎం-పాక్స్‌ను హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించడంతో దీనిపై పరిశోధనకు, వైద్య సాధనాల అందుబాటు పెంచేందుకు నిధుల వెసులుబాటు పెరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండటమే ప్రస్తుతానికి నివారణా మార్గం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..