Vastu: ఆలయాల సమీపంలో ఇల్లు ఉంటే ఏమవుతుంది.? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..
ఇంటి విషయంలో వాస్తుకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా భారతీయులు, అందులోనూ హిందువులు వాస్తును భాగా విశ్వసిస్తుంటారు. అందుకే ఇంటిని ఏ స్థలంలో నిర్మించాలి.? ఏ దిశలో నిర్మించాలి.? లాంటి విషయాల్లో నిపుణుల సలహాలు తీసుకుంటుంటారు. ఇంటి నిర్మాణం విషయంలో...
ఇంటి విషయంలో వాస్తుకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా భారతీయులు, అందులోనూ హిందువులు వాస్తును భాగా విశ్వసిస్తుంటారు. అందుకే ఇంటిని ఏ స్థలంలో నిర్మించాలి.? ఏ దిశలో నిర్మించాలి.? లాంటి విషయాల్లో నిపుణుల సలహాలు తీసుకుంటుంటారు. ఇంటి నిర్మాణం విషయంలో చాలా మందిలో వచ్చే ప్రధాన అనుమానాల్లో దేవాలయాల సమీపంలో ఇంటిని నిర్మించడం ఒకటి. ఇంతకీ దేవాలయలకు సమీపంలో ఇల్లు ఉండొచ్చా? ఉంటే ఎలాంటి ప్రతి ఫలాలు ఉంటాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..
* మీరు నివసించే ఇంటిపై ఆలయం నీడ ఎట్టి పరిస్థితుల్లో పడకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలా పడితే.. ఇంట్లో సుఖసంతోషాలు, మనశ్సాంతి దూరమవుతుందని అంటున్నారు. ఆ ఇంట్లో నిత్యం ఏదో ఒక విషయంలో వివాదాలు జరుగుతూనే ఉంటాయి. ఆలయానికి కనీసం 200 అడుగుల దూరంలో ఇల్లు ఉండేలా చూసుకోవాలి.
* గుడికి ఎదురుగా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు ఉండకూండ చూసుకోవాలి. దీనివల్ల కూడా ఇబ్బందులు తప్పవని వాస్తు పండితులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఆలయ మూల విరాట్‌కు ఎదురుగా కచ్చితంగా ఇల్లు ఉండకూడదు.
* అయితే వాస్తు శాస్తరం చెబుతోన్న దానిబట్టి శివాలాయాలకు వెనుకవైపు ఇల్లు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. శివాలయానికి దగ్గరలో ఇల్లు ఉంటే శత్రు భయం ఎక్కువగా ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
* అలాగే అమ్మవారి ఆలయాలకు దగ్గరల్లో కూడా ఇల్లు లేకుండా చూసుకోవాలి. ఇలాంటి ఇల్లలో ఉన్న వారు పెద్దగా వృద్ధి సాధించలేరు. అనుకున్న పనులేవీ పూర్తికావు.
* ఇక ఇంటిపై ఆలయం ధ్వజస్తంభం నీడ కూడా పడకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కూడా ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..