AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: మెట్ల కింద ఈ వస్తువులు పెడుతున్నారా.? వెంటనే తీసేయండి..

ఇలాంటి వాటిలో మెట్లు ఒకటి. ఒక మెట్ల కింద ఉండే ఖాళీ ప్రదేశాన్ని ఎవరూ ఖాళీగా వదిలేయరు. ఇంట్లో వృథాగా ఉన్న వస్తువులను లేదా ఏదో ఒకదాంతో నింపేస్తుంటారు. అయితే మెట్ల కింద పెట్టుకునే వస్తువుల విషయంలో వాస్తును పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మెట్ల కింద కొన్ని రకాల వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో...

Vastu Tips: మెట్ల కింద ఈ వస్తువులు పెడుతున్నారా.? వెంటనే తీసేయండి..
Vastu Tips
Narender Vaitla
|

Updated on: Mar 05, 2024 | 5:23 PM

Share

వాస్తు శాస్త్రంలో ఎన్నో విషయాలను వివరించారు. కేవలం ఇంటి నిర్మాణమే కాకుండా ఇంట్లో ఏర్పాటు చేసుకోవాల్సిన వస్తువుల విషయంలోనూ వాస్తు నియమాలను పాటించాలని పండితులు సూచిస్తున్నారు. సాధారణంగా మనలో చాలా మంది ఇంటి లోపల వాస్తును పరిగనలోకి తీసుకుంటాం. ఇంటి బయట వాస్తును పట్టించుకోము. అయితే కాంపౌండ్‌ వాల్‌లోని ప్రతీ అంశంలో కచ్చితంగా వాస్తును ఫాలో కావాలని పండితులు సూచిస్తున్నారు.

ఇలాంటి వాటిలో మెట్లు ఒకటి. ఒక మెట్ల కింద ఉండే ఖాళీ ప్రదేశాన్ని ఎవరూ ఖాళీగా వదిలేయరు. ఇంట్లో వృథాగా ఉన్న వస్తువులను లేదా ఏదో ఒకదాంతో నింపేస్తుంటారు. అయితే మెట్ల కింద పెట్టుకునే వస్తువుల విషయంలో వాస్తును పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మెట్ల కింద కొన్ని రకాల వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదని సూచిస్తున్నారు. దీనివల్ల నెగిటివ్‌ ఎనర్జీ పెరిగే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ మెట్ల కింద పెట్టకూడని ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* మెట్ల కింద చాలా మంది చెప్పులను పెడుతుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. షూ అల్మారాను ఎట్టి పరిస్థితుల్లో మెట్ల కింద పెట్టకూడదని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, మెట్ల క్రింద బూట్లు, చెప్పులు ఉంచడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుంది.

* ఇక మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో నల్లా ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు.

* చెత్త, డస్ట్‌బిన్‌లను కూడా మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు వస్తాయని చెబుతున్నారు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు నెలకొని తరచూ గొడవలు జరుగుతాయి.

* మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో పూజ గది లేదా వంట గదిని నిర్మించకూడదు. ఇలా చేయడం వల్ల వాస్తు దోషం ఏర్పడి సుఖసంతోషాలు లోపిస్తాయి.

* ఇక మెట్ల నిర్మాణం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఇంటికి దక్షిణం వైపు మెట్లు ఉండకూడదు. ఈ దిశలో నిర్మించిన మెట్ల ఇంటి పురోగతికి ఆటంకం కలిగిస్తుందని అంటున్నారు.

* అలాగే మెట్ల సంఖ్య ఎల్లప్పుడూ బేసి సంఖ్యలో ఉండాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే మంచి జరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే ఇందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..