Vastu Tips: ఈ దిశలో కూర్చొని తింటున్నారా.? కష్టాలు తప్పవంటున్న పండితులు

ఇంట్లో భోజనం చేసే సమయంలో కూర్చునే దిశ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఆహారం తినడానికి ఉత్తర, తూర్పు దిశలు ఉత్తమంగా నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణం దిక్కున కూర్చొని భోజనం చేయకూడదని చెబుతున్నారు. ఈ దిశలో కూర్చొని భోజనం చేయడం ఏమాత్రం మంచిది కాదని...

Vastu Tips: ఈ దిశలో కూర్చొని తింటున్నారా.? కష్టాలు తప్పవంటున్న పండితులు
Vastu Tips
Follow us

|

Updated on: Sep 06, 2024 | 6:20 PM

భారతదేశంలో వాస్తు శాస్త్రానికి ఎలాంటి ప్రాముఖ్య ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాస్తు శాస్త్రంలో ప్రతీ అంశానికి సంబంధించిన వివరాలను సవివరంగా ప్రస్తావించారు. అయితే వాస్తు అనగానే మనం కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం అనుకుంటాం. కానీ ఇంట్లో ఏర్పటు చేసుకునే వస్తువుల దగ్గరి నుంచి ఏ దిశలో కూర్చోవాలి.? ఏ దిశలో కూర్చొని తినాలి ఇలా ప్రతీ విషయంలో వాస్తు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిశలో కూర్చొని తినాలి.? ఏ దిశలో కూర్చుంటే దుష్ప్రభావాలు ఉంటాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంట్లో భోజనం చేసే సమయంలో కూర్చునే దిశ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఆహారం తినడానికి ఉత్తర, తూర్పు దిశలు ఉత్తమంగా నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణం దిక్కున కూర్చొని భోజనం చేయకూడదని చెబుతున్నారు. ఈ దిశలో కూర్చొని భోజనం చేయడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జీవిత కాలం తగ్గిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇక పడమర ముఖంగా ఆహారం తీసుకోవడం వల్ల దుష్ప్రభవాలు కలుగుతాయి.

ఇలా తినేవారికి రుణ భారం పెరుగుతుందని అంటున్నారు. ఈ దిక్కున భోజనం చేస్తే ఇంట్లో దరిద్రం పెరుగుతుందని, ఆర్థిక పరమైన ఇబ్బందులు తప్పవని అంటున్నారు. అందుకే పడమర ముఖంగా కూర్చొని భోజనం చేస్తుంటే వెంటనే ఆ అలవాటును మానుకోవాలని చెబుతున్నారు. ఆహారాన్ని తీసుకునే సమయంలో తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ తినాలి. ఈ రెండు దిశలు శుభప్రదంగా చెబుతుంటారు. ఉత్తరం వైపు కూర్చొని భోజనం చేయడం వల్ల ఆర్థికంగా మంచి చేకూరుతుందని పండితులు చెబుతున్నారు.

ఇక భోజనం చేసే సమయంలో మరికొన్ని తప్పులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. విరిగిన పాత్రల్లో ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు. ఇలా చేస్తే ఇర్థిక సమస్యలు చుట్టుముడతాయి. అలాగే విరిగిన పాత్రలను వంటగదిలో ఉంచడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో విరిగిన పాత్రలను వంటగదిలో ఉంచకూడదని అంటున్నారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..