Run for Cause: పెళ్లి గౌనులో కిలో మీటర్ల కొద్దీ పరుగు.. ఆ యువతి ఎందుకు అలా చేస్తోందో తెలిస్తే వావ్ అంటారు!
Run for Cause: కొంతమంది తమకు అన్యాయం జరిగితే లోలోపల కుమిలిపోతారు. కొందరు ఎదురు తిరిగి యుద్ధం చేస్తారు. చాలా తక్కువమంది మాత్రమే తనలా ఎవరూ బాధపడకూడదని ఆలోచిస్తారు.
Run for Cause: కొంతమంది తమకు అన్యాయం జరిగితే లోలోపల కుమిలిపోతారు. కొందరు ఎదురు తిరిగి యుద్ధం చేస్తారు. చాలా తక్కువమంది మాత్రమే తనలా ఎవరూ బాధపడకూడదని ఆలోచిస్తారు. దానికోసం ఎదో ఒక కార్యక్రమం చేసి తనలాంటి వారిలో అవగాహన పెంచుతారు. సాధారణంగా మహిళల పై వేధింపులు అదీ వివాహితలపై జరిగే గృహహింస మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువే. ఎక్కడిక్కడ చట్టాలు ఉన్నా.. ఈ వేధింపులను ఆపడం ఎవరితరమూ కాదు. కొంతమంది మహిళలు అవగాహన లేక ఈ గృహహింసలను భరిస్తూ కాలం వెళ్ళదీస్తారు. తాము తీవ్ర అన్యాయాన్ని ఎదుర్కున్తున్నామన్న స్పృహ కూడా పాపం వారికి ఉండదు. అలా వేధింపులకు గురైన ఓ మహిళ తనలా ఎవరూ బాధపదకూడదనీ..వేధింపులకు గురి అవుతున్న మహిళల్లో అవగాహన పెంచాలనీ సంకల్పించింది. అందుకు ఏం చేసిందంటే..
ఆమె 47 ఏళ్ల వెనెస్సా రేసర్. న్యూయార్క్‌లోని రాక్‌ల్యాండ్‌లో నివసిస్తున్న సైకోథెరపిస్ట్. ఈమె పెళ్లి కుమార్తె దుస్తులు ధరించి రోడ్డు మీద పరుగులు తీయడం మొదలు పెట్టింది. అది చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆమె ఊరికే పనిలేక అలా పరుగులు తీయలేదు. ఎందుకు తాను ఈపని చేస్తోందో ఇలా వివరించింది..”నేనే గృహ హింసకు గురయ్యాను. ఈ సమస్యను ఎదుర్కొంటున్న చాలా మంది నా వద్దకు వస్తారు. నాకు తెల్సి చాలామందికి ఈ సమస్యపై సరైన అవగాహనే లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నించే వారు ఎవరూ నాకిప్పటివరకూ కనిపించలేదు. అందుకే.. నేను ప్రజల్లో అవగాహన కల్పించేలా ఎదోఒకటి చేయాలని అనుకున్నాను. అందుకే ఈ పరుగు మొదలు పెట్టాను. గృహ హింసకు వ్యతిరేకంగా మహిళలు తమ గొంతు విప్పడానికి ఇది ఒక స్ఫూర్తి కావాలని నా ప్రయత్నం.”
ఈ సైకోథెరపిస్ట్ రెండు వారాల్లో 285 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేశారు. ఆమె వారానికి రోజూ 24 కి.మీ. తన పరుగును కొనసాగిస్తున్నారు. ఆమె పరుగుకు అనుకూలంగా కత్తిరించిన వివాహ దుస్తులతో ఈ పరుగులో పాల్గొంటున్నారు. వెనెస్సా పనిని మెచ్చుకుంటూ, ఓస్వెగో నుండి మాన్హాటన్ వరకు ఆమె పరుగు తీసినపుడు.. అక్కడి హోటళ్ళు ఆమెకు, సహాయక బృందానికి ఉచిత సౌకర్యాలను కల్పించాయి. తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే, హింస బాధితులకు సహాయం చేయడానికి ఇతర రాష్ట్రాల నుండి నిధులు సేకరించగలనని వెనెస్సా భావిస్తోంది. అవును.. ”ఎవరో ఒకరు ఎపుడో అపుడు” అని మనకి ఓ పాట ఉంది కదా.. అలా వేనేస్సా రేసర్ లాంటి చదువుకున్న వారు ఇటువంటి అవగాహనా కార్యక్రమాలు చేపడితే అయినా గృహహింస బాధితులకు ధైర్యం.. ఓదార్పు లభిస్తాయి.