Telangana: ఆ గ్రామంలో మధ్యాహ్నమే సాయంత్రం.. నాలుగు అయితే.. లైట్స్ వేసుకోవాల్సిందే..!
సాయంసంధ్య వేళ చూడని గ్రామంగా కొదురుపాక గ్రామం నిలిచింది. దీంతో మూడు జాముల కోదురు పాక పిలుస్తున్నారు.
elanపొద్దున , మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.. నాల్గు వేళలున్న కాలమే మనకు తెలుసు. ఇక్కడ మాత్రం సాయంత్రం చూడని ఓ పల్లె ఉంది.. ఈ అందమైన పల్లెటూరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. అంతేకాకుండా ఇటీవల విడుదలైన క సినిమాతో ఆ ఊరి పేరు మరింత చర్చ లోకి వచ్చింది..
మీ గ్రామం ఏంటీ.. విచిత్రంగా మధ్యాహ్నమే సాయంత్రమవుతుందని క అనే సినిమాలో హీరో అడుగుతాడు.మా ఊరు చుట్టూ కొండలుంటాయి. కొండల్లో ఊరు.. సూర్యుడు కొండదాగి ఉండటంతో త్వరగా సాయంత్రమవుతుందనే విషయాన్నీ చెబుతారు. అప్పుడు..ఈ గ్రామం గురించి చెబుతాడు. పచ్చని పల్లె చుట్టూ కొండలు.. దీంతో ప్రకృతి రా రమ్మని పిలుస్తుంది.కొండల కారణంగా ఇక్కడ సమయాల్లో తేడా ఉంటుందని సమాధానం. దీంతో.. ఈ ఒక్క డైలాగ్ హిట్ మారింది.. సోషల్ మీడియా లో ట్రెండ్ గా మారింది.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మూడు జాములు కోదురుపాకకు ప్రత్యేక ఉంది. ఈ పల్లె ఈశాన్య ప్రాంతంలా ఉంటుంది. గ్రామం చుట్టూ కొండలు, కొండల మధ్య గ్రామం..పల్లె అందాలు కనువిందు చేస్తున్నాయి. ప్రకృతి రమణీయతకు ప్రతీక. ఈ ఊరుకు తూర్పున గొల్లగుట్ట, పడమర రంగనాయకుల గుట్ట, ఉత్తరాన నంబులాద్రి గుట్ట, దక్షిణాన పాంబండ గుట్టలున్నాయి. దీంతో వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ శాతవాహనరాజులు నంబులాద్రీశ్వరస్వామితో పాటు, రాజరాజేశ్వరస్వామి ఆలయాలను నిర్మించారు. ఈ ఊరి చరిత్రను శిలాఫలకాల్లో చెక్కించారు.
రంగనాయకుల గుట్ట కింద ఉన్న ఆలయంలో విగ్రహం ఉండకపోవడం ప్రత్యేకత గా నిలుస్తుంది. దేవులపల్లి నుంచి ప్రతీ దసరాకు నంబులాద్రి నర్సింహస్వామి విగ్రహాన్ని రథయాత్రగా తీసుకవస్తారు. ఇక్కడ ఒక్కరోజుంచి ఉత్సవం చేస్తారు. ఓ వైపు ఆధ్యాత్మిక, మరో వైపు పల్లె అంధాలు ఆకట్టుకున్నాయి. నాలుగు గంటల వరకే సూర్యుడి అస్తమిస్తాడు. సాయంత్రం కనిపించకపోగా.. నాల్గింటి వరకే వీధిదీపాలతో పాటు, ఇళ్లల్లో లైట్లు వేసుకుంటారు. అంతేకాదు, ఇక్కడి భౌగోళిక పరిస్థితుల తో గ్రామం లో సాయంత్రానికే చిమ్మచీకటి పడటంతో.. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులూ నాలుగు వరకే ఇంటికి చేరుకుంటారు.
సాయంసంధ్య వేళ చూడని గ్రామంగా కొదురుపాక గ్రామం నిలిచింది. దీంతో మూడు జాముల కోదురు పాక పిలుస్తున్నారు. ఈ గ్రామం లో నాలుగు గంటల కే సాయంత్రం అవుతుందని స్థానికులు చెబుతున్నారు.. ముందుగానే లైట్స్ వేసుకుంటామని అంటున్నారు.అదేవిధంగా ఉదయం సూర్యుడు ఆలస్యంగా ఉదయిస్తాడని చెబుతున్నారు.. చుట్టూ గుట్టలు ఉండటం ఇలాంటి వాతావరణం ఉంటుందని తెలుపుతున్నారు.ఈ గ్రామానికి ఎంతో చరిత్ర ఉందని పురోహితులు అంటున్నారు.. ఇక్కడ పురాతన ఆలయాలు ఉన్నాయని తెలుపుతున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..