Andhra Pradesh: రోడ్డుపై అచేతన స్థితిలో పడి ఉన్న ఆవు.. ఆపరేషన్ చేసి చూడగా షాక్..!

ఇప్పుడదే ప్లాస్టిక్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. పర్యావరణానికి ముప్పుగా మారుతోంది. ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరమే కాదు..అత్యంత ప్రమాదకరం. ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి, మూగ జీవాలకు, మానవాళికి ఎంత ప్రమాదముంది.

Andhra Pradesh: రోడ్డుపై అచేతన స్థితిలో పడి ఉన్న ఆవు.. ఆపరేషన్ చేసి చూడగా షాక్..!
Plastic In Cow Stomach
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Aug 22, 2024 | 1:17 PM

ప్లాస్టిక్‌… ప్లాస్టిక్‌…ప్లాస్టిక్‌ ! మన జీవితంలో ఇది అంతర్భాగం అయిపోయింది. వాటర్‌ బాటిల్‌ మొదలుకొని… వంటింట్లో వాడే పోపుల పెట్టె వరకు అన్నింటికి ప్లాస్టిక్‌తోనే పని! అది లేకుండా ఏ పనీ కాదు. అడుగు ముందుకు పడదు. ఇప్పుడదే ప్లాస్టిక్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. పర్యావరణానికి ముప్పుగా మారుతోంది. ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరమే కాదు..అత్యంత ప్రమాదకరం కూడా. అందుకే.. ప్లాస్టిక్‌ వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నాయి ప్రభుత్వాలు.

ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి, మూగ జీవాలకు, మానవాళికి ఎంత ప్రమాదముందో అందరికీ తెలిసిందే..! ప్లాస్టిక్ భూతం ఎంత ప్రమాదకరంగా మారుతుందో కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన ఘటన కళ్లకు కట్టినట్టు స్పష్టమవుతోంది. ఒక గోవు కడుపులో నుంచి 70 కేజీలకు పైగా ప్లాస్టిక్‌ను తొలగించారు వైద్యులు. గోవు ప్రాణాన్ని కాపాడారు పశు వైద్యలు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రోడ్డుపై పడి ఉన్న ఒక గోవును చూశాడు స్థానిక న్యాయవాది బోయ తిమ్మప్ప. భారీ కడుపుతో ముక్తాయాసంతో నడవలేక అవస్థపడుతున్న గోవును చూసి చలించిపోయాడు. ఆవును చూసి తన దారి తాను పోలేక స్థానిక పశు వైద్య అధికారులకు సమాచారం ఇచ్చారు. పరిశీలించిన పశు వైద్యులు హుటాహుటీన అక్కడికి చేరుకుని గోవు పరిస్థితిని గమనించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. అక్కడికక్కడే ఆవుకు శస్త్రచికిత్స చేసి, దాని కడుపులో నుంచి 70 కేజీల పైగా పేరుకుపోయిన ప్లాస్టిక్‌ను తొలగించారు. దీంతో చావు బతుకుల్లో ఉన్న గోవుకు పశువైద్యులు ప్రాణభిక్ష పెట్టారు.

మిగిలిపోయిన ఆహారం లేదా ఇతరత్రా ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ప్రజలు రోడ్లపై పారవేస్తుంటారు. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న ఆహారం తోపాటు ప్లాస్టిక్‌ను కూడా గోవులు తెలియకుండా తినేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఎమ్మిగనూరు ఆవు సైతం ఫ్లాస్టిక్ వ్యర్థాలను తినడంతో, కొంచెం కొంచెం పేరుకుపోయి మొత్తం కడుపు నిండింది. ఇతర తిండి తినలేక, తిన్నా కూడా అరిగించలేక ఆవు అనారోగ్యంతో పడిపోయింది. ఆపరేషన్ చేసి మొత్తం ప్లాస్టిక్ అంత తొలగించారు డాక్టర్లు. ప్రస్తుత గోవు ఆరోగ్యం నిలకడగా ఉందని పశు వైద్యులు చెప్తున్నారు. అందుకే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలని, ప్రజలు కూడా అమలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. గోవు పట్ల న్యాయవాది చూపిన చొరవకు పలువురు అభినందించారు.

వీడియో చూడండి…

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

వెండితెర శిఖరంలా మెగాస్టార్.! హీరో అవ్వకముందు చిరు ఏం చేసేవారంటే?
వెండితెర శిఖరంలా మెగాస్టార్.! హీరో అవ్వకముందు చిరు ఏం చేసేవారంటే?
అబ్బవరం ఇంట మొదలైన పెళ్లి సందడి.! వీడియో షేర్ చేసిన హీరోయిన్.
అబ్బవరం ఇంట మొదలైన పెళ్లి సందడి.! వీడియో షేర్ చేసిన హీరోయిన్.
పద్దతిపాడు లేని మనిషి.! బాలీవుడ్ స్టార్‌పై అజయ్‌ భూపతి సీరియస్.
పద్దతిపాడు లేని మనిషి.! బాలీవుడ్ స్టార్‌పై అజయ్‌ భూపతి సీరియస్.
ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..
ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!
పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా
పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా
పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! హాట్ టాపిక్..
పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! హాట్ టాపిక్..
డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ. ఎందుకలా.?
డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ. ఎందుకలా.?
ఎలాంటి టెస్టులకైనా సిద్ధం అంటున్న హేమ. కానీ నెటిజన్స్ రిప్లై వేరే
ఎలాంటి టెస్టులకైనా సిద్ధం అంటున్న హేమ. కానీ నెటిజన్స్ రిప్లై వేరే
సుశీలమ్మ సేఫ్‌ క్షేమంగా ఇంటికి.! వాటిని నమ్మొద్దు అంటూ విజ్ఞప్తి.
సుశీలమ్మ సేఫ్‌ క్షేమంగా ఇంటికి.! వాటిని నమ్మొద్దు అంటూ విజ్ఞప్తి.