పేపర్ కప్పులో టీ, కాఫీ తాగుతున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!
నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్లాస్టిక్ లేకుండా మానవులకు ఏ పనికావడం లేదు. టీ, కాఫీ, టిఫిన్, భోజనం ఇలా అన్నింటిని నిషేధిత ప్లాస్టిక్ కవర్లలో తెచ్చుకొని ఆరగిస్తున్నాం. సిటీలో ప్రతి గల్లీకో కర్రీ పాయింట్ ఉంటుంది. అడుగడుగున ఓ టీ స్టాట్ ఉంటుంది. వాటిలో ప్లాస్టిక్ విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వేడి వేడి కూరలు, సాంబార్, వేడి వేడి టీ ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి ఇస్తుంటారు. ఇలా వేడి వేడి పదార్థాల ప్లాస్టిక్‌లో ప్యాక్ చేయడం వల్ల ఆరోగ్యానికి ప్రమాకరంగా మారుతోంది.

పేపర్ కప్పుల్లో టీ, కాఫీ తాగడం డేంజర్ అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. పేపర్ కప్పుల్లో తాగితే స్లో పాయిజన్ తాగినట్లేనని చెబుతున్నారు. ఎందుకంటే పేపర్ కప్పులో ద్రవం ఉండదు. వాటర్ఫ్రూఫింగ్ కోసం కాగితం కప్పులలో చాలా సన్నని ప్లాస్టిక్ పొర ఉంటుంది. దీన్నే మైక్రోప్లాస్టిక్స్ అంటారు. ఈ మైక్రోప్లాస్టిక్స్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అయితే మనం టీ తాగడానికి వెళ్లినప్పుడు పేపర్ కప్పే మందిదనుకొని దాంట్లోనే టీ తాగుతాం.
కర్రీ పాయింట్‌లో ప్రతి దాన్ని కవర్లలో కట్టి ఇస్తుంటారు. ఈ వేడి పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో తీసుకెళ్లి తినడం వల్ల శరీరానికి హాని చేసే కారకాలు మన శరీరంలో చేరుతున్నాయి. ఇవి రక్తంలోని హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీసి రక్తప్రసరణకు ఆటంకంగా మారుతాయి. గతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఓ సంచి తమ వెంట తీసుకెళ్లేవారు ప్రజలు. నిత్యావసరాలు, కూరగాయలు ఆ సంచిలో తెచ్చేవారు. ఇప్పుడు మా పరిస్థితి లేదు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించకపోతే చాలా ప్రమాదమని వైద్యలు, పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఎన్నో నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఎంతోమంది నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయినా… ఇదే తీరు. ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం. వెరసి ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. ప్లాస్టిక్ కాలుష్యం కారణంగా ఏటా 10 లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..