AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer: ఈ 5 సాధారణ అలవాట్లే కొంపముంచుతాయ్.. క్యాన్సర్‌ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..?

World Cancer Day 2026: గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. అయితే.. క్యాన్సర్‌ లక్షణాలు, కారణాలు, చికిత్స గురించి తెలుసుకోవడం, అవగాహనతో ఉండటం చాలా మంచిది. దీని ద్వారా.. ప్రమాదకర పరిస్థితులను నివారించవచ్చు.. అయితే.. కొన్ని రోజువారీ అలవాట్లు కూడా క్యాన్సర్‌కు దోహదపడుతాయని.. వాటి గురించి తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

Cancer: ఈ 5 సాధారణ అలవాట్లే కొంపముంచుతాయ్.. క్యాన్సర్‌ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..?
క్యాన్సర్‌పై అవగాహనకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4, 2000న జరిగిన ప్రపంచ సదస్సులో అమల్లోకి వచ్చింది. పారిస్‌లో జరిగిన సదస్సులో యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UIC) ద్వారా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని తొలిసారి అమలు చేశారు.
Shaik Madar Saheb
|

Updated on: Feb 04, 2026 | 3:17 PM

Share

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్ మహమ్మారి ఎలా వస్తుంది.. కారణాలు, క్యాన్సర్‌కు దోహదపడే అంశాల గురించి అవగాహనతో ఉండటం ముఖ్యం.. అందుకే.. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. క్యాన్సర్ కారణాలు, లక్షణాలు, నివారణ, సకాలంలో చికిత్స గురించి అవగాహన పెంచడం దీని ఉద్దేశ్యం. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పేలవమైన జీవనశైలి క్యాన్సర్ కు ప్రధాన కారణాలు.. అంతేకాకుండా.. కొన్ని రోజువారీ అలవాట్లు కూడా క్రమంగా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి గురించి తెలుసుకోవడం మంచిదని.. దీని ద్వారా ప్రమాదకర పరిస్థితులను అంచనా వేయవచ్చు..

మాక్స్ హాస్పిటల్‌లోని ఆంకాలజిస్ట్ డాక్టర్ రోహిత్ కపూర్.. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే రోజువారీ అలవాట్ల గురించి సవివరంగా వివరించారు. క్యాన్సర్ లక్షణాలు తరచుగా కణితి ఉన్న ప్రదేశం, పరిమాణంపై ఆధారపడి ఉంటాయి. సాధారణ సంకేతాలలో వివరించలేని బరువు తగ్గడం, నిరంతర అలసట, జ్వరం, చర్మం కింద గడ్డలు లేదా వాపులు, దగ్గు తగ్గుముఖం పట్టకపోవడం, ప్రేగు అలవాట్లలో మార్పులు ఉంటాయని చెప్పారు.

క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే రోజువారీ అలవాట్లు..

జంక్ ఫుడ్ – ప్రాసెస్ చేసిన ఆహారం:

ఉరుకులు, పరుగుల జీవితంలో చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారు. అలాంటి వాటిలో జంక్ ఫుడ్ ఒకటి.. తరచుగా జంక్ ఫుడ్ తినడం ప్రమాదకరం. ఈ ఆహారాలలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ వాపు, హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. పెద్దప్రేగు, కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

వ్యాయామం చేయకపోవడం:

ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరి అని వైద్యులు సలహా ఇస్తున్నారు. అయితే, వారానికి మూడు నుండి నాలుగు రోజులు కూడా వ్యాయామం చేయకపోవడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. వ్యాయామం లేకపోవడం, ఊబకాయం రెండూ క్యాన్సర్‌కు నిశ్శబ్ద కారణభూతాలు. శారీరక శ్రమ లేకపోవడం మీ జీవక్రియను నెమ్మదిస్తుంది.

అధికంగా మద్యం తాగడం:

మీరు మితంగా లేదా అధికంగా మద్యం సేవించినా.. అది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని వైద్యులు అంటున్నారు. ఇది కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు మద్యం తాగుతున్నట్లయితే, ఇప్పటికైనా మానేయడానికి ప్రయత్నించండి.

నిద్ర లేకపోవడం:

తగినంతగా నిద్ర లేకపోవడం కూడా క్యాన్సర్‌కు ప్రమాద కారకంగా పరిగణిస్తారు. నిద్ర లేకపోవడం శరీర కణాల మరమ్మత్తు ప్రక్రియను దెబ్బతీస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

ఇది కూడా చదవండి: చికెన్‌లోని ఈ పార్ట్‌కు ఇంత పవర్ ఉందా..? ఇది తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

క్యాన్సర్‌ను ఎలా నివారించాలి..

క్యాన్సర్‌ను నివారించడానికి జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోండి.

కనీసం 7 -8 గంటలు నిద్రపోండి.

నెలకు ఒకటి లేదా రెండుసార్లు కంటే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తినకూడదు.

రోజూ వ్యాయామం చేయండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
పెళ్లిలో తింటుండగా గొంతులో ఇరుకున్న రసగుల్ల.. ఆ తర్వాత ..
పెళ్లిలో తింటుండగా గొంతులో ఇరుకున్న రసగుల్ల.. ఆ తర్వాత ..