AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Ramdev: చలిలో కూడా శరీరం వెచ్చగా ఉండాలంటే.. బాబా రామ్‌దేవ్ చెప్పిన ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..

గడ్డకట్టే చలిలో కూడా బాడీని వేడిగా ఉంచుకోవడం సాధ్యమేనా? కేవలం మందుల వల్ల కాకుండా మన ప్రాచీన ఆయుర్వేద పద్ధతులతో చలిని తరిమికొట్టవచ్చని బాబా రామ్‌దేవ్ చెబుతున్నారు. కుంకుమ పువ్వు నుంచి స్వచ్ఛమైన నెయ్యి వరకు, ప్రాణాయామం నుంచి పవర్ యోగా వరకు.. చలికాలంలో మీ శరీరాన్ని ఒక కోటలా మార్చే 10 చిట్కాలను ఆయన వివరించారు.

Baba Ramdev: చలిలో కూడా శరీరం వెచ్చగా ఉండాలంటే.. బాబా రామ్‌దేవ్ చెప్పిన ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..
Baba Ramdev Winter Health Tips
Krishna S
|

Updated on: Feb 04, 2026 | 3:09 PM

Share

చలికాలంలో వచ్చే ఆరోగ్య సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు సామాన్యులను పీడిస్తుంటాయి. బయట ఎన్ని స్వెటర్లు వేసుకున్నా, శరీరం లోపల వేడిగా లేకపోతే అనారోగ్యం తప్పదు. ఈ నేపథ్యంలో పతంజలి వ్యవస్థాపకుడు, యోగా గురువు బాబా రామ్‌దేవ్ శరీరాన్ని సహజంగా వెచ్చగా ఉంచుకోవడానికి కొన్ని అద్భుతమైన ఆయుర్వేద, యోగా మార్గాలను సూచించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరాన్ని వెచ్చగా ఉంచే 10 ఆయుర్వేద మార్గాలు

పసుపు, అల్లం నీరు

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో పసుపు, అల్లం కలిపి తాగడం వల్ల శరీరానికి తక్షణ అంతర్గత వెచ్చదనం లభిస్తుంది. ఇది దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇస్తుంది.

మిరియాలు – బాదం

రోజూ 5 బాదం పప్పులు, 5 నల్ల మిరియాలు నమిలి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరగడం వల్ల అనారోగ్య సమస్యలు రావు

పసుపు పాలు – తేనె

రాత్రిపూట పసుపు పాలు లేదా వేడి నీటిలో తేనె కలిపి తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. జలుబు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

కుంకుమ పువ్వు

ఒకటి లేదా రెండు కుంకుమ పువ్వు రేకులను నోట్లో ఉంచుకోవడం వల్ల బాడీ టెంపరేచర్ పెరిగి, చలి నుంచి ఉపశమనం లభిస్తుంది.

స్వచ్ఛమైన నెయ్యి

అధిక చలిగా అనిపించే వారు ఉదయాన్నే ఒక చెంచా స్వచ్ఛమైన నెయ్యి తీసుకోవడం వల్ల శరీరం వేడిగా ఉండడమే కాకుండా లోపలి నుండి బలం పెరుగుతుంది.

రాక్ షుగర్ మిశ్రమం

100 గ్రాముల బాదం, 20 గ్రాముల మిరియాలు, మిశ్రీ కలిపి తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఇది చలిని ఎదుర్కొవడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది.

దీర్ఘ శ్వాస

లోతైన శ్వాస తీసుకోవడం వల్ల శరీరంలోకి ఆక్సిజన్ ప్రవాహం పెరిగి, సహజంగానే వేడి ఉత్పత్తి అవుతుంది.

సూర్య నమస్కారాలు

పవర్ యోగా, సిట్ అప్స్, సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరం చురుగ్గా మారి చలి దరిచేరదు.

భస్త్రికా ప్రాణాయామం

కనీసం 5 నిమిషాల పాటు భస్త్రికా చేయడం వల్ల ఊపిరితిత్తులు బలపడి శ్వాసకోశ సమస్యలు దరిచేరవు.

కపాలాభాతి – అనులోమ విలోమ

రోజుకు 5 నిమిషాల పాటు ఈ ప్రాణాయామాలు చేయడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. అదనంగా బెల్లం తినడం, శంఖం ఊదడం కూడా మంచిదని బాబా రామ్‌దేవ్ సూచించారు.