AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Health: మహిళలూ బీ అలర్ట్.. ఫిట్‌గా ఉండాలంటే ఉదయాన్నే అల్పాహారంలో..

నేటి మహిళలు ఎవరికీ తక్కువ కాదు. ఆఫీసు అయినా.. ఇంటి పనులైనా మెరుగ్గా నిర్వహిస్తారు. ఇలాంటి తరుణంలో మహిళలు తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే అనేక రకాల జబ్బుల బారిన పడాల్సి రావచ్చు. ముఖ్యంగా మహిళల్లో పీసీఓడీ, మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది.

Women's Health: మహిళలూ బీ అలర్ట్.. ఫిట్‌గా ఉండాలంటే ఉదయాన్నే అల్పాహారంలో..
Women Health
Shaik Madar Saheb
|

Updated on: Jan 20, 2024 | 5:47 PM

Share

నేటి మహిళలు ఎవరికీ తక్కువ కాదు. ఆఫీసు అయినా.. ఇంటి పనులైనా మెరుగ్గా నిర్వహిస్తారు. ఇలాంటి తరుణంలో మహిళలు తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే అనేక రకాల జబ్బుల బారిన పడాల్సి రావచ్చు. ముఖ్యంగా మహిళల్లో పీసీఓడీ, మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. మహిళలు ఉదయం పూట ఆహారంలో ఎలాంటి పదార్థాలను చేర్చుకోవాలి.. ఎలాంటి పదార్థాలు తింటే మంచిది అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.. వీటివల్ల శరీరం ఫిట్ గా మారడంతోపాటు.. పలు సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఉదయాన్నే మహిళలు ఎలాంటి పదార్థాలు తినాలో తెలుసుకోండి..

  1. గుడ్లు: మహిళలు తమ ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకోవడం వల్ల.. ఇవి మీ శరీరాన్ని వ్యాధుల నుండి దూరంగా ఉంచుతాయి.. ముఖ్యంగా మహిళలు అల్పాహారంలో గుడ్లు తీసుకోవాలి. శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ఇవి చాలా మేలు చేస్తాయి.
  2. పప్పు- ఆకుకూరలు: మీరు ప్రతిరోజూ మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పప్పులను చేర్చుకోవాలి. వీటిని తినడం వల్ల శరీరానికి చాలా పోషకాలు అందుతాయి. ఈ ఆహారం మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
  3. నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి: స్త్రీలు బయటి పదార్థాలను, ముఖ్యంగా నూనె పదార్థాలను అస్సలు తినకూడదు. దీని వల్ల మీ శరీరం చాలా చెడ్డదిగా, బలహీనంగా మారుతుంది. ముఖ్యంగా ఖిచ్డీ, సలాడ్ వంటి వాటిని తినాలి.
  4. రాగి – జోన్న: చాలా మంది మహిళల బరువు చాలా వరకు పెరుగుతుంది. రాగులు, జొన్నలతో చేసిన రోటీలను తీసుకుంటే.. బరువు చాలా వరకు తగ్గుతుంది. ప్రోటీన్లు కూడా శరీరానికి బాగా అందుతాయి.
  5. విత్తనాలు – గింజలు: మహిళలు ప్రతిరోజూ ఉదయం మొలకలు, విత్తనాలు, గింజలను కూడా తీసుకోవాలి. ఇవి ముఖం అందాన్ని , ఫిట్‌నెస్‌ను కాపాడుతాయి. ఇంకా జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో కూడా ఇవి చాలా వరకు సహాయపడుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.