Health Tips: మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. చురుకుగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..

మోకాలికి సంబంధించిన సమస్యల విషయానికి వస్తే.. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా బాధపడుతున్నారు. మహిళలు మోకాలి గాయాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని..

Health Tips: మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. చురుకుగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..
Knee Injuries
Follow us

|

Updated on: May 14, 2022 | 9:30 AM

కోవిడ్-19(COVID-19) తో లేదా ఆ తర్వాత జీవితానికి అనుగుణంగా మన జీవితాలను సర్దుబాటు చేసుకుంటున్న ఇలాంటి తరుణంలో.. మోకాళ్ల నొప్పుల(knee problems)పై చర్చలు మరోసారి తెరపైకి వచ్చాయి. 15 కోట్ల కంటే ఎక్కువ మంది భారతీయులు మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో నాలుగు కోట్ల మంది మొత్తం మోకాలి మార్పిడి(knee replacement) చేసుకోవాల్సి ఉంది. భారతీయులలో ఆర్థరైటిస్ ప్రభావం ఇతర దేశాలలో కనిపించే దానికంటే 15 రెట్లు ఎక్కువ అని రిపోర్టులు వెల్లడిస్తు్న్నాయి. మోకాలి కీళ్లనొప్పుల పట్ల భారతీయుల జన్యు సిద్ధత, మోకాళ్లను ఎక్కువగా ఉపయోగించుకునే జీవనశైలినే దీనికి కారణంగా నిలిచింది.

Also Read: Health Tips: కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఈ వ్యాధికి సంకేతం కావొచ్చు.. ఆశ్రద్ధ చేస్తే.. ప్రమాదంలో పడ్డట్లే..

పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా..

ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, మోకాలికి సంబంధించిన సమస్యల విషయానికి వస్తే.. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా బాధపడుతున్నారు. మహిళలు మోకాలి గాయాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని, వారి మోకాళ్లకు (ఆస్టియో ఆర్థరైటిస్) వృద్ధాప్యానికి గురయ్యే అవకాశం ఉందని సైన్స్ నిర్ధారించింది. వారు చాలా సున్నితంగా ఉంటారు. మగవారి కంటే ఎక్కువ ఈ వ్యాధికి గురవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా?

ముంబయి ఆర్థోపెడిక్ డాక్టర్ మిటెన్ షెథ్ న్యూస్ 9 తో మాట్లాడుతూ.. మహిళలు తమ మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయన్నారు. “మోకాలి చుట్టూ చాలా దీర్ఘకాలిక (మితిమీరిన) గాయాలు నివారించుకోవచ్చు. తీవ్రమైన మోకాలి గాయాలకు అనేక ప్రమాద కారకాలు సవరించొచ్చు” అని డాక్టర్ షెత్ పేర్కొన్నారు.

తక్కువ ప్రభావం ఉన్న వ్యాయామాలను ఎంచుకోండి: మోకాళ్లలో మృదులాస్థిని రక్షించేందుకు వీలుగా సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి కార్డియోవాస్కులర్ లాంటి వ్యాయామాలు ఎంచుకోవాలి. ఇవి భవిష్యత్తులో జరిగే నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి.

బరువు విషయంలో జగ్రత్త: అదనపు కిలోలు మోకాళ్లకు గణనీయమైన ఒత్తిడిని జోడిస్తాయి. 5 కిలోల బరువు తగ్గడం కూడా అపారమైన మార్పును కలిగిస్తుంది.

ప్రతిరోజూ చురుకుగా ఉండండి: శారీరక శ్రమ దృఢత్వం, కండరాల క్షీణతను నిరోధించడంలో సహాయపడుతుంది. భవిష్యత్తులో గాయం నుంచి మీ మోకాళ్ళను రక్షించగలదు.

దినచర్యను సక్రమంగా ప్లాన్ చేసుకోవాలి: మీ మోకాళ్లపై పునరావృత ఒత్తిడిని కలిగించే కదలికలతో సమస్య మరింత అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతాయి.

కండరాల బలోపేతం కోసం: ఎగువ, దిగువ కాలి కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు అంటే, హామ్ స్ట్రింగ్స్, క్వాడ్రిస్ప్స్ లాంటి వ్యాయామాలపై దృష్టి పెట్టండి. హిప్, మోకాలి కీళ్ల వద్ద పూర్తి స్థాయి కదలికకు మద్దతు ఇచ్చేందుకు దినచర్యలో యోగాను చేర్చడానికి ప్రయత్నించండి.

ఆటలు ఆడేప్పుడు జాగ్రత్తగా ఉండండి: బాస్కెట్‌బాల్ లేదా ఫుట్‌బాల్ వంటి ఆటలను ఆడడంపై జాగ్రత్తగా ఉండాలి.

మితిమీరిన ఉత్సాహాం వద్దు: జంపింగ్, స్క్వాటింగ్, ఊపిరితిత్తులపై ప్రభావం చూపే జుంబా, ఫంక్షనల్ వర్కౌట్‌లు, సూర్యనమస్కారం, వజ్రాసనం, పద్మాసనం వంటి యోగా ఆసనాలు ముందరి మోకాలి నొప్పిని ప్రేరేపించవచ్చు లేదా తీవ్రతరం చేయవచ్చు.

“మీకు మోకాళ్ల నొప్పులు, వాపులు లేదా ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒక మోకాలి మంచిగా, మరొకటి నొప్పిగా ఉందని మీకు అనిపించవచ్చు. సరైన సమయంలో సరైన ఎంపికలు చేసుకోవాలి. చికిత్స ఎల్లప్పుడూ మీ ఎంపికైతే, సరైన నిర్ణయం తీసుకోవాలి. వాయిదా వేయడం వల్ల భవిష్యతులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొవచ్చు” అని డాక్టర్ షెత్ పేర్కొన్నారు.

Also Read: Coffee: కాఫీ తాగే అలవాటుందా..? తీసుకునే ముందు.. ఈ పదార్థాలకు దూరంగా ఉండండి

Copper Bowls: వేసవిలో రాగి పాత్రలని వాడుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!