Winter Health Care: జలుబు త్వరగా తగ్గాలంటే ఆవిరి పట్టేటప్పుడు ఈ 4 పదార్థాలను నీటిలో కలపండి..
శీతాకాలం వచ్చిందంటే చాలు.. చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే.. చలికాలం వస్తూ వస్తూ తనతో పాటు వ్యాధులను కూడా వెంటబెట్టుకొస్తుంది.

శీతాకాలం వచ్చిందంటే చాలు.. చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే.. చలికాలం వస్తూ వస్తూ తనతో పాటు వ్యాధులను కూడా వెంటబెట్టుకొస్తుంది. ఫలితంగా జనాలు వ్యాధుల బారిన పడుతుంటారు. ఈ సీజన్‌లో ముఖ్యంగా జలుబు, ఫ్లూ వంటి సమస్యలతో ప్రజలు సతమతం అవుతుంటారు. ముఖ్యంగా శ్వాసకోస వ్యాధులు ఉన్నవారు, ఆస్తమా, గుండె జబ్బులతో ఇబ్బందిపడేవారు ఈ సీజన్‌లో చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్న ఇంటి చిట్కాలను ఆశ్రయిస్తారు. ముఖ్యంగా ఆవిరి పట్టడం చేస్తుంటారు. ఇది జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
చలికాలంలో చాలామంది తరచుగా జలుబు, దగ్గు వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. చలి కారంగాణ ముక్కు రంద్రాలు బ్లాక్ అవుతాయి. అలాంటి సమయంలో ఆవిరి పడుతుంటారు. అయితే, ఆవిరి పట్టడానికి ఉపయోగించే నీటిలో కొన్ని పదార్థాలను కలపడం ద్వారా జలుబు సమస్య త్వరగా తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జలుబు, ఫ్లూ సమస్య నుంచి త్వరగా బయటపడేందుకు ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆవిరి పట్టే నీటిలో ఏం కలపాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వాము..
ఆవిరి పట్టే నీటిలో 1 నుంచి 2 టీ స్ఫూన్ల వామును వేయొచ్చు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది జలుబు, దగ్గు నుండి త్వరగా ఉపశమనం పొందేందుకు పని చేస్తుంది.




పుదీనా..
పుదీనా ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. బ్లాక్ అయిన ముక్కు రంద్రాలను ఫ్రీ చేస్తుంది. ఇందుకోసం 2 – 3 చుక్కల పుదీనా నూనెను ఆవిరి పట్టే నీటిలో వేయాలి. ఇది జలుబు, ఫ్లూ నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.
తులసి ఆకులు..
ఆవిరి నీటిలో కొన్ని తులసి ఆకులను కూడా వేయవచ్చు. తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తరువాత ఆవిరి పట్టాలి. ఇది మూసుకుపోయిన ముక్కును తెరుస్తుంది. ఈ ఆకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ అలర్జీ లక్షణాలు ఉన్నాయి. ఇది జబులు, దగ్గు సమస్యను త్వరగా తగ్గిస్తుంది.
రాక్ సాల్ట్..
జలుబు, ఫ్లూ సమయంలో ఆవిరి పట్టేటప్పుడు రాళ్ల ఉప్పును నీటిలో వేయవచ్చు. జలుబు, ఫ్లూ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గోరువెచ్చని నీటిలో రాక్ ఉప్పును కలిపి పుక్కిలించవచ్చు. ఇది గొంతు నొప్పిని నయం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..