AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic Health Benefits: గుండె సంబంధిత సమస్యలకు ఇది మస్తు పనిచేస్తుందట..!

మనలో చాలా మంది తినే ఆహారం ఆరోగ్యానికి మంచిదో కాదో ఆలోచించకుండా తింటున్నాం. ముఖ్యంగా కొలెస్ట్రాల్ సమస్య ఉన్న వాళ్లు తినే ప్రతిదీ శరీరం పై ప్రభావం చూపిస్తుంది. కొన్ని సహజ పదార్థాలు దీన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వాటిలో వెల్లుల్లి ఒకటి.

Garlic Health Benefits: గుండె సంబంధిత సమస్యలకు ఇది మస్తు పనిచేస్తుందట..!
Garlic Health Benefits
Prashanthi V
|

Updated on: May 19, 2025 | 2:42 PM

Share

ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లి శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఇది సహజ వైద్యంలో ముఖ్యమైనది. దీనిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో బాగా పని చేస్తాయి. అల్లిసిన్, అజోయిన్, డయల్ సల్ఫైడ్ వంటి పదార్థాలు గుండె సంబంధిత సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ వెల్లుల్లిని తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు బ్యాలెన్స్‌ గా ఉంటాయి.

అనారోగ్యకరమైన ఆహారం, తక్కువ శారీరక చలనంతో ఈ రోజుల్లో జీవనశైలి మారిపోయింది. ఈ మార్పులు శరీరంలోని కొవ్వు పెరగడానికి కారణం అవుతున్నాయి. దాంతో పాటు గుండెపోటు, రక్తనాళాల్లో అడ్డంకులు, ఎక్కువ రక్తపోటు వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించడానికి సహజంగా దొరికే వాటిలో వెల్లుల్లి ముఖ్యమైనది.

వెల్లుల్లిని పాలలో మరిగించి తింటే మంచి ఫలితం ఉంటుంది. పాలు వేడిగా ఉన్నప్పుడు దానిలో వెల్లుల్లి ముక్కలు వేసి కాసేపు మరిగించాలి. ఇలా తయారైన మిశ్రమం రాత్రి లేదా ఉదయం తినవచ్చు. ఇది శరీరంలో కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్, బీపీ అదుపులో ఉండేలా చేస్తుంది.

నెయ్యిలో వేయించి తీసుకోవడం.. ఇది పూర్వ కాలంలో ఎక్కువగా ఉపయోగించబడిన పద్ధతి. నెయ్యిలో వెల్లుల్లిని వేయించి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. వాసన కూడా తగ్గుతుంది. మీరు కూరల్లో వాడినా.. తినే ముందు ఒకటి రెండు ముక్కలు తీసుకున్నా మంచిదే. కొలెస్ట్రాల్ ఉన్నవారు నెయ్యి తీసుకోవాలంటే భయపడుతారు. కానీ నెయ్యిని చిన్న పరిమాణంలో వాడితే ఉపయోగమే ఉంటుంది.

ఉదయం లేచిన వెంటనే ఒక వెల్లుల్లి రెబ్బను నానబెట్టిన గోరువెచ్చని నీటితో తినడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇది జీర్ణక్రియ బాగా జరిగేందుకు సహాయపడుతుంది. శరీరం తేలికగా ఉండేలా చేస్తుంది. అయితే ఇది తిన్న తర్వాత కాసేపు నీళ్లు తాగకపోతే మంచిది.

పుల్లటి సమస్య ఉంటే ఖాళీ కడుపుతో తినడం కంటే పాలలో మరిగించి తినడం మంచిది. ఎండాకాలంలో వెల్లుల్లి శరీరానికి వేడి చేస్తుంది. అందుకే తక్కువగా మాత్రమే తీసుకోవాలి. నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల కొన్ని మందుల ప్రభావం మారే అవకాశం ఉంటే డాక్టర్‌ ను అడగాలి. ఒకేసారి ఎక్కువగా తినవద్దు. తక్కువగా తినాలి.

వెల్లుల్లి సహజంగా దొరికే మధురమైన ఔషధం. దీన్ని తినే విధానం శరీర పరిస్థితి, కాలం, అవసరాన్ని బట్టి మార్చాలి. పాలలో మరిగించినా, నెయ్యిలో వేయించినా, ఖాళీ కడుపుతో తిన్నా మోతాదు అనుసరించాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్