AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seasonal Depression : సీజన్ మారితే వచ్చే డిప్రెషన్ గురించి తెలుసా?

సీజన్ మారితే వాతావరణంలోనే కాదు, మనిషి ప్రవర్తనలోనూ మార్పులు వస్తాయంటున్నారు డాక్టర్లు. దీన్నే సీజనల్ డిప్రెషన్ అంటారు. ఈ తరహా డిప్రెషన్ వర్షాకాలం, చలికాలంలో ఎక్కువగా కనిపిస్తుందట. ఇదెలా ఉంటుంది? దీని లక్షణాలేంటి? దీన్నుంచి ఎలా బయటపడాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Seasonal Depression : సీజన్ మారితే వచ్చే డిప్రెషన్ గురించి తెలుసా?
Seasonal Depression
Nikhil
|

Updated on: Sep 15, 2025 | 1:43 PM

Share

సీజన్ మారడం వల్ల కూడా చాలామందిలో డిప్రెషన్ వస్తుందని మీకు తెలుసా? ఇలా సీజన్ తో పాటు వచ్చే డిప్రెషన్‌ను సీజనల్ డిప్రెషన్ లేదా ‘సీజనల్ ఎఫెక్టివ్​ డిజార్డర్(ఎస్ఏడీ)’ అంటారు. వింటర్ మొదలయ్యే ముందు ఇలాంటి డిప్రెస్డ్ లక్షణాలు కనిపిస్తాయట. అందుకే దీన్ని ‘వింటర్ బ్లూస్’ అని కూడా అంటారు.

కారణాలివే..

సాధారణంగా శరీరం పాటించే బయో క్లాక్‌లో మార్పులొచ్చినప్పుడు హార్మోన్ లెవల్స్ తగ్గి ప్రవర్తనలో మార్పులొస్తాయి. ఉదయాన్నే నిద్ర లేవడం నుంచి రాత్రి పడుకునేవరకు ఉండే టైం టేబుల్, డైట్.. ఇలాంటివి వింటర్‌‌లో కాస్త మారుతుంటాయి. దీనివల్ల బయో క్లాక్  డిస్టర్బ్ అవుతుంది. తద్వారా సెరటోనిన్, మెలటోనిన్ హార్మోన్స్ తగ్గుతాయి. ఈ కారణం చేత చలికాలంలో కొంతమందికి డిప్రెస్డ్‌గా అనిపిస్తుంది. దీంతోపాటు వ్యాయామం చేయకపోవడం, విటమిన్–డి లోపించడం కూడా ఈ తరహా డిప్రెషన్‌కు కారణాలని డాక్టర్లు చెప్తున్నారు.

వీరిలో ఎక్కువ

ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్న వాళ్లు, ఇతర మానసిక సమస్యలు ఉన్నవాళ్లకు సీజనల్ డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని డాక్టర్లు చెప్తున్నారు. ముఖ్యంగా ముప్ఫై ఏళ్లలోపు వ్యక్తులకు ఈ తరహా డిప్రెషన్ వస్తుంటుంది. కొంతమందిలో వారసత్వంగా కూడా రావొచ్చు. కారణం లేకుండానే బాధగా అనిపించడం, ఒత్తిడి, నీరసం, ఎకాగ్రత లోపించడం వంటివి ఈ తరహా డిప్రెషన్ లక్షణాలు.

జాగ్రత్తలు ఇలా..

  • సీజనల్ డిప్రెషన్.. సీజన్‌తో పాటే ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. అంటే వింటర్ పోయి సమ్మర్ వచ్చే టైంకి హార్మోన్ లెవల్స్ మారిపోతాయి.  కానీ, డిప్రెషన్ వల్ల కొంతమంది కుంగిపోయే అవకాశం ఉంది.  ఆ ప్రభావం మానసిక ఆరోగ్యంపై పడుతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
  • డిప్రెషన్‌గా అనిపిస్తున్నవాళ్లు రోజూ టైంకి తినడం, వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి.
  • చలికాలంలో కామన్ గా ఉండే బద్దకాన్ని తగ్గించి యాక్టివ్ గా ఉండే ప్రయత్నం చేయాలి.
  • రోజూ ఒకే టైం టేబుల్ ఫాలో అవ్వాలి. ఒకే టైంకి నిద్ర పోవాలి.
  • చలికాలంలో వేడిగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. హెల్దీ ఫ్యాట్స్ తో కూడిన డైట్ తీసుకోవాలి.
  • డిప్రెస్డ్ గా అనిపించే వాళ్లు ఒంటరిగా ఉండకుండా మనుషులతో కలుస్తుండాలి.
  • ఈ తరహా డిప్రెషన్  మరీ ఎక్కువైతే డాక్టర్ సలహా తీసుకోవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్