Cardiophobia: హార్ట్ ఎటాక్ వస్తుందని పదేపదే ఆందోళన చెందుతున్నారా? అయితే మీకు ఈ వ్యాధి ఉన్నట్లే
గత కొంతకాలంగా గుండె జబ్బుల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఛాతీ నొప్పి వంటి లక్షణాలను గమనించినట్లయితే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలని, తగిన ఆహార జాగ్రత్తలు తీసుకోవాలనే కనీసం స్పృహ ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. కొన్ని సందర్భాల్లో ఛాతీలో తేలికపాటి నొప్పి కనిపించినా వెంటనే అది హార్ట్ ఎలాక్ అని భయపడి కొందరు ఆసుపత్రికి పరిగెత్తుతుంటారు..
గత కొంతకాలంగా గుండె జబ్బుల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఛాతీ నొప్పి వంటి లక్షణాలను గమనించినట్లయితే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలని, తగిన ఆహార జాగ్రత్తలు తీసుకోవాలనే కనీసం స్పృహ ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. కొన్ని సందర్భాల్లో ఛాతీలో తేలికపాటి నొప్పి కనిపించినా వెంటనే అది హార్ట్ ఎలాక్ అని భయపడి కొందరు ఆసుపత్రికి పరిగెత్తుతుంటారు. ప్రజలు తమ ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండటం మంచి విషయమే, కానీ చిన్న పాటి ఛాతీ నొప్పిని కూడా గుండెపోటు లక్షణంగా భావించి ఆందోళన చెందుతారు. నిజానికి ఇది గుండె జబ్బు లక్షణం కాదు. గుండె జబ్బు ఉందేమోనని అపోహపడే మానసిక వ్యాధి. దీనిని వైద్య భాషలో కార్డియోఫోబియా అంటారు.
వైద్యుల అభిప్రాయం ప్రకారం.. కార్డియోఫోబియా అనేది ఆందోళన సంబంధిత రుగ్మత. ఇది గుండెపోటు వంటి గుండె సంబంధిత వ్యాధుల గురించి ఒక వ్యక్తిలో ఉండే భయం. వ్యక్తికి గుండె జబ్బులు లేకపోయినా కార్డియోఫోబియా కారణంగా గుండెపోటు ఉందేమోనని పదేపదే భయపడుతూ ఉంటారు. దీని కారణంగా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. దీని వల్ల మనసులో ఒక రకమైన ఫోబియా ఏర్పడుతుంది. ఈ సమస్య ఉన్న వారు గుండె జబ్బులు లేకపోయినా ప్రతిసారీ ఛాతీ నొప్పి, గ్యాస్ వల్ల ఏర్పడే సమస్య, ఎడమ చేయి నొప్పిని గుండెపోటుగా భావించి వైద్యుల వద్దకు వెళ్తుంటారు.
కార్డియోఫోబియా ఎందుకు వస్తుంది?
గత కొన్నేళ్లుగా గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయని ఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఆస్పత్రి కార్డియాలజీ విభాగం డాక్టర్ అజిత్ జైన్ తెలిపారు. ఈ కారణంగా ప్రజలు కార్డియోఫోబియా బాధితులుగా మారుతున్నారు. ఇప్పటికే మానసిక ఆరోగ్యం సరిగా లేని వ్యక్తులు కూడా కార్డియోఫోబియా బాధితులుగా మారవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ సమస్య ఒక రకమైన ఆందోళన కారణంగా కూడా సంభవించవచ్చు. కార్డియోఫోబియా కారణంగా మనసులో గుండెపోటు భయం ఉంటుంది. అది కూడా తర్వాత పెద్ద సమస్యకు కారణం కావచ్చు. అటువంటి పరిస్థితిలో గుండె జబ్బుల లక్షణాలు, సాధారణ సమస్యల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం చాలా ముఖ్యం.
తేడాను ఇలా గుర్తించండి
గుండెపోటు లక్షణాలు.. తీవ్రమైన ఛాతీ నొప్పి ఉంటుందని డాక్టర్ జైన్ వివరించారు. దీనితో పాటు అశాంతి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. కొందరిలో వికారం, జలుబు వంటి సమస్యలు కూడా ఉంటాయి. కానీ కార్డియోఫోబియా ఉంటే గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు వస్తాయి. గుండె సమస్య ఉంటే ఛాతీ నొప్పి ఎప్పుడైనా రావచ్చు. కానీ కార్డియోఫోబియాలో మానసిక ఒత్తిడి సమయంలో ఛాతీలో నొప్పి ఉన్నట్లు భావిస్తారు. కానీ వాస్తవానికి అది అలాంటి నొప్పి కాడు. ఒత్తిడి కారణంగా ఛాతీలో నొప్పి ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే పదే పదే దాని గురించే ఆలోచిస్తే నొప్పి ఉన్నట్టు అనిపిస్తుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.