Curd Benefits: వారికి పెరుగు అమృతంలా పనిచేస్తుంది.. ఎందుకో తప్పనిసరిగా తెలుసుకోండి..

| Edited By: Shaik Madar Saheb

Jul 21, 2022 | 10:04 PM

బరువు తగ్గడానికి పలు రకాల ఆహార పదార్థాలను, పానీయాలను తీసుకుంటూ భారీ వ్యాయామాలు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరంగా బరువు తగ్గడంపై దృష్టిపెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Curd Benefits: వారికి పెరుగు అమృతంలా పనిచేస్తుంది.. ఎందుకో తప్పనిసరిగా తెలుసుకోండి..
Curd
Follow us on

Curd For Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు సమస్య చాలామందిని వేధిస్తోంది. స్థూలకాయాన్ని తగ్గించడం అంత సులువు కాదు. ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు ఊబకాయం, కొవ్వుతో బాధపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో వారు బరువు తగ్గడానికి పలు రకాల ఆహార పదార్థాలను, పానీయాలను తీసుకుంటూ భారీ వ్యాయామాలు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరంగా బరువు తగ్గడంపై దృష్టిపెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది చాలా మందికి సాధ్యంకాదు. ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోవాలనుకుంటే.. ఆహారంలో పెరుగును చేర్చుకోవాలని పేర్కొంటున్నారు. పెరుగుతో బరువును ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..

బరువు తగ్గడానికి పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు..

  • పెరుగు కొవ్వును కరిగించే సాధనంగా పనిచేస్తుంది.
  • పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • పెరుగు జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
  • జీవక్రియ సరిగ్గా పనిచేస్తే బరువు తగ్గడం సులభం.
  • పెరుగులో ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది మీ పొట్టను త్వరగా నింపుతుంది. దీంతో ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు.

బరువు తగ్గడానికి ఈ విధంగా పెరుగుని ఉపయోగించండి

ఇవి కూడా చదవండి

మూడు పూటలా తినొచ్చు: బరువు తగ్గాలనుకుంటే ఆహారంలో పెరుగును చేర్చుకోవచ్చు. దీని కోసం ఒక గిన్నె పెరుగు తీసుకోండి. ఉదయం అల్పాహారం, భోజనం, రాత్రి డిన్నర్‌లో తినండి. దీనితో క్రమంగా బరువు తగ్గడం ప్రారంభమవుతుంది.

పెరుగు – డ్రై ఫ్రూట్స్: పెరుగును ఆరోగ్యకరమైనదిగా చేయాలనుకుంటే.. దానికి తరిగిన డ్రై ఫ్రూట్స్ కూడా జోడించవచ్చు. పెరుగులో డ్రై ఫ్రూట్స్‌ను జోడించడం వల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. ఈ కాంబినేషన్ తినడం వల్ల పొట్ట చాలా సేపు నిండుగా ఉంటుంది. దీంతో బరువు సులభంగా తగ్గవచ్చు.

పెరుగు – మిరియాలు: సాధారణ పెరుగు ఇష్టం లేకపోతే దానిలో కొంచెం మిరియాల పొడి వేసి తినవచ్చు. బరువు తగ్గడానికి కప్పు పెరుగులో మిరియాల పొడి కలిపి తినవచ్చు. మిరియాలు, పెరుగు రెండూ మీ బరువును తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..