AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayurvedam: ఇంగ్లీషు మందులతో విసిగి పోయారా.. అయితే జ్వరం వచ్చినప్పుడు ఈ ఆయుర్వేద చిట్కాలు ట్రై చేయండి..

వాతావరణం మారుతున్న కొద్దీ అన్ని వయస్సుల వారిలోనూ జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు కనిపిస్తున్నాయి. వాతావరణ మార్పు ఫలితంగా చాాలా మందిలో జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది.

Ayurvedam: ఇంగ్లీషు మందులతో విసిగి పోయారా.. అయితే జ్వరం వచ్చినప్పుడు ఈ ఆయుర్వేద చిట్కాలు ట్రై చేయండి..
Young Woman Is Looking At The Thermometer. She Has Fever.
Madhavi
| Edited By: |

Updated on: Mar 09, 2023 | 6:47 PM

Share

వాతావరణం మారుతున్న కొద్దీ అన్ని వయస్సుల వారిలోనూ జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు కనిపిస్తున్నాయి. వాతావరణ మార్పు ఫలితంగా చాాలా మందిలో జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. జ్వరం అనేది శరీర ఉష్ణోగ్రతలో తాత్కాలిక పెరుగుదల. ఇది శరీరం రోగనిరోధక వ్యవస్థలో ప్రతిస్పందనలో ఒక భాగం. కానీ వయస్సు పెరిగే కొద్దీ జ్వరం చాలా అసౌకర్యంగా మారుతుంది.

ఒక వ్యక్తికి శరీర సగటు ఉష్ణోగ్రత సాంప్రదాయకంగా 98.6 ఫారన్ హీట్ ఉంటుంది. థర్మామీటర్ ఉపయోగించినప్పుడు ఉష్ణోగ్రత 100 F (37.8 C) లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అది సాధారణంగా జ్వరంగా పరిగణిస్తారు. అధిక జ్వరం ఉంటే చెమట, తలనొప్పి, కండరాల నొప్పి, ఆకలి లేకపోవడం, చిరాకు, బలహీనత ఉంటాయి. జ్వరం లక్షణాల నుండి ఉపశమనానికి కొన్నిఇంటి చిట్కాలను పాటిద్దాం. అయితే డాక్టర్ ఇచ్చిన మందులను వాడుతూనే ఈ ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.

1. తులసి:

ఇవి కూడా చదవండి

తులసి ఆయుర్వేద మూలికలకు రారాజు లాంటిది. తులసి దాని ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది, ఇది మార్కెట్లో లభించే అన్ని మందుల కంటే జ్వరాన్ని బాగా నయం చేయగలదు. తులసి ఆకులు యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. జ్వర నియంత్రణలో గొప్పగా పనిచేస్తాయి.

ఎలా తీసుకోవాలి:

మీరు 10-15 తులసి ఆకులను తీసుకుని నీటిలో వేసి మరిగించి, వడకట్టిన తులసి నీటిలో 1 టీస్పూన్ ఎండిన అల్లం చూర్ణం వేసి, కొద్దిగా తేనె కలుపుకుని రోజుకు రెండు లేదా మూడు సార్లు మూడు రోజుల పాటు తాగితే ఉపశమనం లభిస్తుంది.

2. వెల్లుల్లి:

ఇది ఉల్లి కుటుంబానికి చెందిన ఒక మొక్క. వెల్లుల్లిలో సల్ఫర్ అధిక మొత్తంలో కలిగి ఉంటుంది, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కల్గిస్తుంది. విటమిన్ సి, విటమిన్ B6 మాంగనీస్‌లో సమృద్ధిగా ఉంటుంది వెల్లుల్లిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు జ్వర చికిత్సకు ఉపయోగపడతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎలా తీసుకోవాలి:

వెల్లుల్లి 2-3 పిండి చేసి, వెచ్చని నీటిలో జోడించి, ఆహారానికి ముందు సూప్‌గా తాగండి.

3. ధనియాలు:

ధనియాలు ఆరోగ్యకరమైన శరీరాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడే అనేక విటమిన్లు ఖనిజాలతో నిండి ఉంటాయి. కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి, యాంటీక్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలను ప్రదర్శిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం, జ్వరం చికిత్స కోసం కొత్తిమీర గింజలను ఉపయోగించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ధనియాలు, శరీరం రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

4. అశ్వగంధ:

అశ్వగంధ ఆయుర్వేదంలో సాటిలేని, ‘జీవన అమృతం’ అని పిలుస్తారు అశ్వగంధలోని యాంటీ బాక్టీరియల్ యాంటీ వైరల్ లక్షణాలు బాక్టీరియా కలిగించే ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. ఇది జ్వరం, దగ్గు, గొంతు నొప్పి ఇతర కాలానుగుణ వ్యాధులను సమర్థవంతంగా నయం చేస్తుంది. అశ్వగంధ పొడిని పాలల్లో ఒక టీస్పూన్ కలుపుకొని తాగాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి