హెల్త్ అలర్ట్.. నాలుకపై తెల్లగా ఉందా..? దీనికి కారణమేంటో తెలుసా..?
ఉదయం లేవగానే మీ నాలుకపై తెల్లటి పొర కనిపిస్తే.. దీన్ని మామూలుగా తీసుకోవద్దు. ఇది చిన్న సమస్యలా అనిపించినా.. కొన్నిసార్లు మీ శరీరంలో ఉన్న లోపాలకు ఇది ఓ సంకేతం కావచ్చు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..? ఎప్పుడు డాక్టర్ ని కలవాలి..?

ప్రతి ఉదయం మీ నాలుకపై తెల్లటి పొర కనిపిస్తే.. తేలిగ్గా తీసుకోవద్దు. ఇది శరీరంలో హానికర పదార్థాలు పేరుకుపోయిన సంకేతం కావచ్చు. కొన్నిసార్లు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా దీనికి కారణం అవుతాయి. నిజమైన కారణం తెలుసుకుని వెంటనే డాక్టర్ సలహా తీసుకోవడం ముఖ్యం. నాలుకను రోజూ క్లీన్ చేసుకోవడం.. బాడీని హైడ్రేట్ గా ఉంచేలా తగినన్ని నీళ్ళు తాగడం చాలా అవసరం.
నాలుకపై తెల్లటి పొర అంటే ఏంటి..?
ఉదయాన్నే నాలుకపై తెల్లటి పొర కనిపించడం ఓ హెల్త్ ఇష్యూకి సంకేతం. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, డీహైడ్రేషన్, నోటి శుభ్రత లోపించడం, రోగనిరోధక శక్తి తగ్గడం లేదా ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల ఇది రావచ్చు. బాడీలో మలినాలు బయటకు వెళ్లకపోతే.. నోరు పొడిబారితే బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుతాయి. దీని ప్రభావం నాలుకపై తెల్ల పొరలా కనిపిస్తుంది. ఇది నిరంతరం ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది. నాలుకపై తెల్లటి పొర రావడానికి గల ప్రధాన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణక్రియ సమస్యలు
తిన్న ఫుడ్ సరిగా జీర్ణం కాకపోతే.. కడుపులో గ్యాస్, మలబద్ధకం వంటి ప్రాబ్లమ్స్ ఉంటే నాలుకపై తెల్లటి పొర వస్తుంది. ముఖ్యంగా లివర్ సరిగా పనిచేయకపోతే.. బాడీలో ఆహార అవశేషాలు పేరుకుపోతే ఈ లక్షణం బయటపడుతుంది.
డీహైడ్రేషన్
శరీరంలో సరిపడా నీరు లేకపోతే నోరు ఎండిపోతుంది. దాంతో బ్యాక్టీరియాలు పెరిగి నాలుకపై తెల్లటి పొరను క్రియేట్ చేస్తాయి. వేసవిలో ఎక్కువగా కాఫీ, టీ తీసుకునే వారిలో ఇది కామన్ ప్రాబ్లమ్.
ఫంగస్ ఇన్ఫెక్షన్
నాలుకపై ఏర్పడే తెల్లటి పొర ఓరల్ థ్రష్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి, పెద్ద వయస్సు కలిగిన వ్యక్తులు, ఎక్కువకాలం యాంటీబయాటిక్స్ వాడేవారికి ఇది తరచుగా కనిపిస్తుంది. నాలుకపై తెల్లటి లేదా కొద్దిగా పసుపు రంగు పొరతో పాటు మంట, నొప్పి కూడా ఉండవచ్చు.
రోగనిరోధక శక్తి
మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ వీక్‌గా ఉంటే వైరస్‌లు, బ్యాక్టీరియాలు, ఫంగస్‌లు ఈజీగా పెరుగుతాయి. దీని ప్రభావం నాలుకపై తెల్లటి పొర రూపంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది బాడీ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో ఫెయిల్ అవుతుందన్న సంకేతం.
నోటిని శుభ్రంగా ఉంచకపోవడం
చాలా మంది పళ్లను శుభ్రం చేసుకుంటారు కానీ నాలుకను క్లీన్ చేయడం మర్చిపోతారు. ప్రాపర్ హైజీన్ లేకపోతే నాలుకపై ఫుడ్ పార్టికల్స్, బ్యాక్టీరియా పేరుకుపోయి తెల్ల పొరను క్రియేట్ చేస్తాయి. దీని వల్ల దుర్వాసన కూడా రావచ్చు.
నాలుకపై తెల్లటి పొర తరచుగా కనిపించడం మామూలు విషయం కాదు. ఇది బాడీ లోపల ఉన్న సమస్యలకు సంకేతం కావచ్చు. ఆలస్యం చేయకుండా డాక్టర్లను కలిసి ప్రాపర్ చెకప్ చేయించుకోవడం ద్వారా హెల్త్ ని మెరుగుపరచుకోవచ్చు. అలాగే సరిపడా నీరు తాగడం, నాలుకను రోజూ శుభ్రంగా ఉంచడం ఆరోగ్యానికి మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




