AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Migraine: ఇలాంటి అలవాట్లు ఉంటే మైగ్రేన్‌ను ఆహ్వానిస్తున్నట్లే.. తలనొప్పిని నివారించాలంటే ఇలా చేయండి..

నేటి ఆధునిక ప్రపంచంలో ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. ఇలాంటి వాటిల్లో మైగ్రేన్ సమస్య ఒకటి.. ఇది నేటికాలంలో బాగా పెరుగుతోందని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. మైగ్రేన్ కారణంగా తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఆ తర్వాత మెదడు పనిచేయడం ఆగిపోతుంది. భారంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో రోజువారీ జీవితంలో సాధారణ కార్యకలాపాలు చేయడం కష్టం అవుతుంది.

Migraine: ఇలాంటి అలవాట్లు ఉంటే మైగ్రేన్‌ను ఆహ్వానిస్తున్నట్లే.. తలనొప్పిని నివారించాలంటే ఇలా చేయండి..
Migraine
Shaik Madar Saheb
|

Updated on: Nov 11, 2023 | 9:19 AM

Share

నేటి ఆధునిక ప్రపంచంలో ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. ఇలాంటి వాటిల్లో మైగ్రేన్ సమస్య ఒకటి.. ఇది నేటికాలంలో బాగా పెరుగుతోందని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. మైగ్రేన్ కారణంగా తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఆ తర్వాత మెదడు పనిచేయడం ఆగిపోతుంది. భారంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో రోజువారీ జీవితంలో సాధారణ కార్యకలాపాలు చేయడం కష్టం అవుతుంది. ఇది కాకుండా.. వాంతులు, మైకము వస్తుంది. చాలా గంటలపాటు మైగ్రేన్ తలనొప్పి తీవ్రంగా బాధిస్తుంది. ఈ తీవ్రమైన వ్యాధికి పెరగకముందే.. దానిని ముందుగానే నివారించడానికి చర్యలు తీసుకోవాలి.. మైగ్రేన్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు ఎలాంటి జీవనశైలిని అవలంబించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

మైగ్రేన్‌ను నివారించే మార్గాలు..

  1. టెన్షన్‌కు దూరంగా ఉండండి: నేటి బిజీ లైఫ్‌, బాధ్యతల ఒత్తిడి కారణంగా టెన్షన్‌ సహజమే. అయితే, దీని వెనుక కుటుంబ సమస్యలు, ప్రేమ లేదా స్నేహంలో ద్రోహం, డబ్బు కొరత వంటి కారణాలు ఉండవచ్చు. కానీ మీరు ప్రతి పరిస్థితిలో సంతోషంగా ఉండాలి.. లేకపోతే మైగ్రేన్ ప్రమాదం మరింత పెరుగుతుంది.
  2. పూర్తిగా నిద్ర పొందండి: ఆరోగ్యవంతమైన యువకుడు రోజులో దాదాపు 7 నుంచి 8 గంటలపాటు నిద్రపోవాలని ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మీరు ఈ సమయానికి కంటే తక్కువ సమయం నిద్రపోతే, మీరు మైగ్రేన్‌ను ఆహ్వానిస్తున్నట్టే. అందువల్ల, రోజువారీ నిద్ర సమయాన్ని వీలైనంత వరకు పూర్తి చేయండి.
  3. బలమైన సూర్యకాంతి: వేసవిలో ప్రజలలో మైగ్రేన్ సమస్య కొద్దిగా పెరుగుతుందని మీరు తరచుగా గమనించి ఉంటారు. సాధారణంగా, మనం బలమైన సూర్యకాంతికి గురైనప్పుడు, మనకు తీవ్రమైన తలనొప్పి ప్రారంభమవుతుంది. ఎండలో తక్కువగా వెళ్లడం మంచిది. మీరు బయటకు వెళ్లవలసి వస్తే గొడుగు ఉపయోగించండి లేదా కాటన్ వస్త్రంతో మీ తలను కప్పుకోండి.
  4. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుకోండి: కడుపు నొప్పి అనేక వ్యాధులకు మూలంగా పరిగణిస్తున్నారు. వాటిలో మైగ్రేన్ కూడా ఒకటి. ఎసిడిటీ, గ్యాస్ మైగ్రేన్ ప్రమాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఆరోగ్యకరమైన.. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి..

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.