AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care Tips: పట్టులాంటి కురులకు.. బంగారం లాంటి అద్భుతమైన చిట్కాలు మీ కోసమే..

జుట్టు రాలడం అనేది ఈరోజు సాధారణ సమస్యగా మారింది.హెయిర్ ఫాల్ సమస్యను ఎలా వదిలించుకోవాలో మనం తెలుసుకుందాం..

Hair Care Tips: పట్టులాంటి కురులకు.. బంగారం లాంటి అద్భుతమైన చిట్కాలు మీ కోసమే..
Hair Care Tips
Sanjay Kasula
|

Updated on: Sep 09, 2022 | 8:47 PM

Share

జుట్టు రాలడం అనేది నేటి కాలంలో సాధారణ సమస్యగా మారింది. ఎందుకంటే జీవనశైలి, ఆహారపు అలవాట్లలో సహజంగా జుట్టు రాలడం ఆందోళన కలిగించే విషయం కాదు. కానీ జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే అది ఆందోళన కలిగించే విషయం. జుట్టు రాలడాన్ని అరికట్టడానికి మీరు ప్రయత్నించే అనేక ఇంటి నివారణలు ఉన్నాయి. జుట్టు రాలడం సమస్యను ఎలా వదిలించుకోవచ్చో ఇక్కడ చూద్దాం?

ఈ ఇంటి పద్ధతులతో జుట్టు రాలడాన్ని వదిలించుకోండి- 

గ్రీన్ టీ-

గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది విటమిన్ ఎ, బి, సి, ఇ లకు చాలా మంచి మూలం. దురద, స్కాల్ప్, చుండ్రు, బ్యాక్టీరియాను తొలిగించేందుకు గ్రీన్ టీ సహాయపడుతుంది. జుట్టు పెరుగుదల చర్మానికి చాలా వరకు సహాయపడుతుంది. ఆక్సిజన్ , పోషకాల సరఫరా పెరుగుతుంది. జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. దీని కోసం రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ త్రాగాలి. కావాలంటే గ్రీన్ టీని నీళ్లలో మరిగించి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత జుట్టును కడుక్కోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే మంచిది.

ఆయిల్ మసాజ్

వారానికి ఒకసారి జుట్టుకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జుట్టు మూలాలకు పోషణ లభిస్తుంది. దీని కోసం కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, మీరు లావెండర్, మందార, రోజ్మేరీ, గుమ్మడి గింజల నూనెను కొబ్బరి నూనెతో కలిపి అప్లై చేయవచ్చు. రాత్రంతా అలానే ఉంచి ఉదయం షాంపూతో తలస్నానం చేయండి.

కలబంద-

కలబంద జుట్టుకు చాలా మంచిదని భావిస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్‌తో పోరాడి స్కాల్ప్‌ని హెల్తీగా మార్చుతాయి. ఇది జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది. అందుకే దీన్ని జుట్టుకు రాసుకోవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం