AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diet Tips: సినిమా తారలు ఇష్టంగా తినే స్నాక్స్‌ ఇదే.. రుచితో పాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

Makhana Benefits:  మఖానాలో పోషకాలు పుష్కలంగా ఉండడంతో పాటు రుచికరంగానూ ఉంటాయి. అందుకే సామాన్యులే కాకుండా బి టౌన్‌లోని సెలబ్రెటీలందరూ కూడా దీనిని ఇష్టంగా తీసుకుంటారు.

Diet Tips: సినిమా తారలు ఇష్టంగా తినే స్నాక్స్‌ ఇదే.. రుచితో పాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
Shilpa And Malaika
Basha Shek
|

Updated on: Sep 09, 2022 | 8:21 PM

Share

Makhana Benefits:  సాధారణంగా స్నాక్స్‌ను ఎంచుకునేటప్పుడు చాలామంది రుచికే ప్రాధాన్యమిస్తారు తప్పనిస్తే వాటిలోని ఆరోగ్య ప్రయోజనాలను పెద్దగా పట్టించుకోరు. అయితే మఖానాలో పోషకాలు పుష్కలంగా ఉండడంతో పాటు రుచికరంగానూ ఉంటాయి. అందుకే సామాన్యులే కాకుండా బి టౌన్‌లోని సెలబ్రెటీలందరూ కూడా దీనిని ఇష్టంగా తీసుకుంటారు. మలైకా అరోరా, శిల్పాశెట్టి తదితర సెలబ్రిటీలు తమ డైట్‌ ఛార్ట్‌లో కచ్చితంగా మఖానాకు చోటిస్తారు. మరి మఖానా తినడం వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు అందుతాయో తెలుసుకుందాం రండి.

మఖానా తేలికగా జీర్ణమవుతుంది. ఇందులో వానోయిడ్స్, పొటాషియం, ప్రొటీన్, ఫాస్పరస్, కార్బోహైడ్రేట్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి అన్ని మూలకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి. ఇక ప్రస్తుతం చాలా మంది మధుమేహం సమస్యలతో బాధపడుతున్నారు. యువతతో పాటు పిల్లలు కూడా ఈ రోగం బారిన పడుతున్నారు. అయితే మఖానా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. వీటిని తింటే చాలా సేపటివరకు కడుపు నిండుగా ఉంటుంది. కాబట్టి త్వరగా ఆకలి వేయదు. ఇక ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటివారికి మఖానా మరింత ప్రయోజనకరం. అందుకే సినిమా స్టార్లు ఎక్కువగా దీనిని వినియోగిస్తున్నారు. మఖానా తినడం వల్ల కడుపు నిండుతుంది. అయితే శరీరంలోని క్యాలరీలను ఖర్చు చేనియదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..