Women Health: గర్భిణీ స్త్రీలు హైహీల్స్ వేసుకుంటున్నారా ?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
అయితే మామ్ జంక్షన్ ప్రకారం గర్భధారణ సమయంలో హీల్స్ ధరించడం మంచిది కాదు. దీనికి శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. గర్భధారణ సమయంలో హీల్స్ ఎందుకు ధరించకూడదో తెలుసుకుందాం.
మహిళలు అందంగా.. ఎత్తుగా కనిపించేందుకు హైహీల్స్ వేసుకుంటారు. చాలా మందికి హీల్స్ ధరించే అలవాటు ఎక్కువగా ఉంటుంది. మరికొందరు ప్రెగ్నెన్సీ సమయంలోనూ హైహీల్స్ ధరిస్తుంటారు. అయితే గర్భధారణ సమయంలో ముఖ్య విషయంగా ధరించడం సురక్షితమేనా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పలువురు సినీతారలు గర్భధారణ సమయంలోనూ హైహీల్స్ ధరిస్తుండడం చూస్తున్నాం. అయితే మామ్ జంక్షన్ ప్రకారం గర్భధారణ సమయంలో హీల్స్ ధరించడం మంచిది కాదు. దీనికి శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. గర్భధారణ సమయంలో హీల్స్ ఎందుకు ధరించకూడదో తెలుసుకుందాం.
నష్టాలు.. వెన్నునొప్పి: హైహీల్స్ అనేవి మీ భంగిమను ప్రభావితం చేస్తాయి. ఎక్కువసేపు ధరించడం వల్ల కాలి కండరాలు ముందుకు వంగిపోతాయి. దీంతో మీరు ముందుకు వంగి ఉంటారు. గర్భధారణ సమయంలో శరీర బరువు వేగంగా పెరుగుతుంది. ఇది మీ శరీర భంగిమను మరింత ప్రభావితం చేస్తుంది. హైహీల్స్ ధరిస్తే వెన్నునొప్పి వస్తుంది. గర్భధారణ సమయంలో వీపు, కాళ్ళ మడమలలో సమస్యలను కలిగిస్తుంది.
కాళ్లలో తిమ్మిర్లు: ఎక్కువసేపు హీల్స్ ధరించినప్పుడు పాదాలలో కండరాలు సంకోచిడం జరుగుతుంది. కండరాల తిమ్మిరి ఏర్పడుతుంది. ఇది గర్భధారణ సమయంలో మరింత పెరుగుతుంది.
బ్యాలెన్స్ సమస్యలు: బరువు పెరగడం, హార్మోన్ల మార్పుల కారణంగా చీలమండలు బలహీనంగా మారతాయి . దీని కారణంగా సమతుల్యత దెబ్బతింటుంది. ఇది బ్యాలెన్స్ ప్రభావం చూపిస్తుంది. ఇది మీకు, పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరం.
ఉబ్బిన పాదాలు: గర్భధారణ సమయంలో పాదాలు, చీలమండలు, పాదాలలో వాపు సాధారణం. దీనికి ప్రధాన కారణం సౌకర్యవంతమైన బూట్లు ధరించకపోవడం. టైట్ షూస్, హై హీల్స్ లేదా ప్లాట్‌ఫారమ్ హీల్స్ ధరించడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
అబార్షన్: గర్భిణీ స్త్రీలు హీల్స్ ధరించడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.అటువంటి పరిస్థితిలో గర్భధారణ సమయంలో సౌకర్యవంతమైన చెప్పులు లేదా బూట్లు ధరించడం మంచిది.