Weight Gain: బరువు పెరగాలంటే ఈ ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..!

|

May 27, 2022 | 8:37 AM

Weight Gain: బరువు ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా రెండూ ఆరోగ్య పరంగా మంచివి కావు. ఈ రోజుల్లో చాలామంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. అలాగే తక్కువ బరువు వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు.

Weight Gain: బరువు పెరగాలంటే ఈ ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..!
Weight Gain Foods
Follow us on

Weight Gain: బరువు ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా రెండూ ఆరోగ్య పరంగా మంచివి కావు. ఈ రోజుల్లో చాలామంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. అలాగే తక్కువ బరువు వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారిని తరచూ చాలామంది ఎగతాళి చేస్తుంటారు. అయితే మీ శరీరం సన్నగా, బరువు తక్కువగా ఉంటే శరీరానికి అవసరమైన పోషకాలు లభించడం లేదని అర్థం. అలాగే కొన్ని వ్యాధుల వల్ల కూడా కొంతమంది సరిగ్గా బరువు పెరగరు. సులువుగా బరువు పెరగాలంటే ఆహారంలో కొన్ని ఆహారపదార్థాలని చేర్చుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

బనానా షేక్, పీనట్ బటర్

మీరు బరువును పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీరు 150 మిల్లీలీటర్ల పాలలో రెండు చెంచాల శనగపిండి, రెండు అరటిపండ్లను కలిపి అరటిపండు షేక్ చేయాలి. ఉదయం అల్పాహారం సమయంలో తీసుకోవాలి. ఇది మీ శరీరానికి పుష్కలంగా కేలరీలు, శక్తిని అందిస్తుంది. కొన్ని రోజుల తర్వాత బరువు పెరగడం గమనించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఖర్జూరం, పాలు

ఖర్జూరాలను పాలలో సుమారు రెండు నుంచి 4 గంటల పాటు నానబెట్టాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఖర్జూరం తిని పాలు తాగాలి. ఈ రెమెడీ చేయడం వల్ల శరీరంలోని బలహీనతలు తొలగిపోయి బరువు పెరుగుతారు. మునుపటి కంటే మెరుగ్గా ఉంటారు.

గుడ్లు

బరువు పెరగడానికి గుడ్ల సహాయం కూడా తీసుకోవచ్చు. మీడియం సైజు గుడ్డులో 77 కేలరీలు, 6 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఆహారంలో ప్రతిరోజూ గుడ్లను చేర్చుకోండి. ఇది మీ శరీరానికి పుష్కలంగా కేలరీలను అందజేస్తుంది. శరీరం బలంగా తయారవుతుంది. మీరు బరువు పెరగడానికి బ్రౌన్ బ్రెడ్‌తో గుడ్లు తినవచ్చు.

చీజ్, బ్రౌన్ బ్రెడ్

బరువు పెరిగే విషయంలో పనీర్ మంచిదని భావిస్తారు. ప్రతిరోజూ అల్పాహారంలో బ్రౌన్ బ్రెడ్‌లో కాటేజ్ చీజ్ కలిపి తింటే చాలా కేలరీలు పొందుతారు. దీనివల్ల బరువు వేగంగా పెరుగుతారు.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి