AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చుంటున్నారా.. ఈ ఆరోగ్య సమస్య బారిన పడవచ్చు.. కొంచెం జాగ్రత్త..

గతంలో డయాబెటిస్ రావడానికి కొన్ని కారణాలుండేవి. పెద్ద వయసువారికే ఎక్కువగా మధుమేహం వ్యాధి వచ్చేది.  కాలం మారతున్న కొద్ది.. జీవనశైలి మారడం వంటి కారణాలతో వయసుతో సంబంధం లేకుండా యువకులు సైతం అనేక రోగాల..

ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చుంటున్నారా.. ఈ ఆరోగ్య సమస్య బారిన పడవచ్చు.. కొంచెం జాగ్రత్త..
Diabetes
Amarnadh Daneti
|

Updated on: Dec 09, 2022 | 6:44 PM

Share

గతంలో డయాబెటిస్ రావడానికి కొన్ని కారణాలుండేవి. పెద్ద వయసువారికే ఎక్కువగా మధుమేహం వ్యాధి వచ్చేది.  కాలం మారతున్న కొద్ది.. జీవనశైలి మారడం వంటి కారణాలతో వయసుతో సంబంధం లేకుండా యువకులు సైతం అనేక రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో 40సంవత్సరాల లోపు వ్యక్తులు కూడా మధుమేహం బారిన పడుతున్నారు. డయాబెటిస్‌ రావడానికి ప్రధాన కారణాలు చెడు ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, కదలకుండా ఒకే దగ్గర కూర్చోవడం, వారసత్వం వంటి కారణాల వల్ల డయాబెటీస్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒకసారి వచ్చాకా.. పూర్తిగా నయం అవడం అంటూ జరగదు. జీవితాంతం ఈ వ్యాధిని భరించాల్సి ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా  వ్యాధి తీవ్రత పెరగకుండా నియంత్రించుకునే అవకాశం ఉంటుంది.  మధుమేహం ఉన్న వారు మర్చిపోకుండా వైద్యులు సూచించిన మందులు వేసుకోవాలి. అంతేకాదు కొన్ని రకాల ఆహారలను తీసుకోవడం వల్ల వారి రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి.  ముఖ్యంగా ఈ వ్యాధిబారిన పడిన వారు బలహీనంగా ఉండటం, అధికంగా చెమట పట్టడం,  కళ్లు తిరగడం, తరచుగా అలసిపోవడం, మూత్రం ఎక్కువ సార్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ ను తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఈ డ్రింక్స్ ను తరచుగా తాగారో పక్కాగా డయాబెటీస్ బారిన పడతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్డ్ జ్యూసెస్, సోడా, సాఫ్ట్ డ్రింక్స్, తియ్యని లెమన్ వాటర్ వంటివి ఎక్కువగా తాగితే టైప్ 2 మధుమేహం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ డ్రింక్స్ లల్లో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

చెక్కెర, వైట్ రైస్, మైదా పిండి వంటి వాటివల్ల డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధుమేహ ప్రమాదం ప్రాసెస్ చేసిన ఆహారాల వల్లే ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. మనం తీసుకునే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్స్, పొట్టు వంటివి ఏవీ ఉండవని… ఇక వీటిని మితిమీరి తిన్నారో.. మీ రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయి షుగర్‌ వచ్చే ప్రమాదం ఉందట. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే డ్రింక్స్‌ను తాగడం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఈ డ్రింక్స్ ను తరచుగా తాగారో పక్కాగా డయాబెటీస్ బారిన పడతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేయించిన ఆహార పదార్థాలను గానీ, ప్యాకెట్ ఫుడ్స్ ను గానీ ఎక్కువగా తిన్నారో మీరు ఖచ్చితంగా షుగర్ వ్యాధి బారిన పడతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..