AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bitter Gourd Juice: చలికాలంలో కాకరకాయ రసంతో అద్భుత ప్రయోజనాలు.. ఆ సమస్యలకు ఇక చెక్‌ పెట్టొచ్చు

కాకరకాయ కున్న చేదు రుచి కారణంగా చాలా మంది దీని పేరు చెబితనే ముఖం చిట్లిస్తారు. అసలు తినరు. అయితే ఈ చేదే జలుబు, ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.

Bitter Gourd Juice: చలికాలంలో కాకరకాయ రసంతో అద్భుత ప్రయోజనాలు.. ఆ సమస్యలకు ఇక చెక్‌ పెట్టొచ్చు
Bitter Gourd Juice
Basha Shek
|

Updated on: Dec 09, 2022 | 6:57 PM

Share

ఇతర సీజన్లతో పోల్చితే చలికాలంలో అనేక వ్యాధులు ఇబ్బంది పెడతాయి. జలుబు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ ..ఇలా ఎన్నో సమస్యలు బాగా ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడతాయి. అందుకే చలికాలంలో ఆహారం, పానీయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా ఈ సీజన్‌లో తినడానికి పోషకవిలువలున్న పండ్లు, కూరగాయలను డైట్‌లోకి తీసుకోవాలంటారు. కాగా చలికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్‌లను ఎదుర్కోవటానికి కాకర కాయ చాలామంచిదంటున్నారు నిపుణులు. అయితే కాకరకాయ కున్న చేదు రుచి కారణంగా చాలా మంది దీని పేరు చెబితనే ముఖం చిట్లిస్తారు. అసలు తినరు. అయితే ఈ చేదే జలుబు, ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే కచ్చితంగా దీన్ని మీ డైట్‌లో చేర్చుకోకుండా ఉండలేరు. మరి ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి.

కాకరకాయ రసం చలికాలంలో చాలా మేలు చేస్తుంది. దీన్ని తయారు చేయడానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో లభించే పదార్థాలతోనే సులభంగా ఈ జ్యూస్‌ను తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా కొన్ని కాకరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, ఎండుమిర్చి, పసుపు, నల్ల ఉప్పును తీసి బ్లెండర్‌లో మిక్స్‌ చేయండి. అంతే కాకర కాయ జ్యూస్‌ రెడీ. ఇలాగే కాకుండా ఇతర మార్గాల్లోనూ ఈ హెల్దీ జ్యూస్‌ను తయారు చేసుకోవచ్చు.

ముఖం మిలామిలా మెరిసేందుకు..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాకరకాయ రసాన్ని తాగితే, అది శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. పైగా ఉదయాన్నే తాగడం వల్ల పొట్ట పూర్తిగా శుభ్రపడుతుంది. దీన్ని రోజూ తాగడం ప్రారంభిస్తే, ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. తద్వారా చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మీ ముఖం కూడా మిలమిలా మెరిసిపోతుంది.

ఇవి కూడా చదవండి

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను అనుసరించే ముందు దయచేసి వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..