Diabetes Control Tips: శీతాకాలంలో షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..
చలికాలంలో మాత్రం బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతున్నాయని, దీంతో షుగర్ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని మధుమేహ వ్యాధిగ్రస్తులు బాధపడుతుంటారు. అయితే చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Diabetes Control Tips: ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ డయాబెటిస్ బారిన పడుతున్నారు. నిర్ధిష్ట నియమాలను పాటించడం ద్వారా షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేసుకుంటారు. కానీ, చలికాలంలో మాత్రం బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతున్నాయని, దీంతో షుగర్ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని మధుమేహ వ్యాధిగ్రస్తులు బాధపడుతుంటారు. అయితే చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మామూలుగా చలికాలంలో ఉదయాన్నే లేచి వ్యాయమం చేయడానికి చాలా మంది బద్ధకిస్తారు. కానీ ఆహార అలవాట్లలో మాత్రం ఎలాంటి మార్పులు చేసుకోరు..దీంతో శరిరానికి తగిన వ్యాయామం లేక షుగర్ లెవెల్స్ పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీని నుంచి బయటపడడానికి మధుమేహ వ్యాధిగ్రస్తులు తగిన ఫిట్‌నెస్ చార్ట్‌ను అనుసరించాలని సూచిస్తున్నారు.
నడకే దివ్య ఔషధం:
బ్లడ్ షుగర్‌ను కంట్రోల్లో ఉంచుకోవడానికి నడక దివ్య ఔషధంలా పని చేస్తుంది. శరీరాన్ని యాక్టివ్ చేయడానికి వాకింగ్ చేయడం ఎంతగానో మేలు చేస్తుంది. చలికాలంలో వాకింగ్ చేస్తే రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది. అలాగే గుండె తగిన మొత్తంలో రక్త ప్రసరణ చేయడానికి సాయం చేస్తుంది. అలాగే చలికాలంలో వచ్చే అంటువ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని ఉత్తేజం చేస్తుంది.
ఫిట్‌నెస్ మంత్ర:
శీతాకాలంలో చాలా మంది వేకువజామునే లేచి వ్యాయామం చేస్తుంటారు. కానీ అది మంచి పద్ధతి కాదని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామం చేయడం మంచిదే అయినా ఇంటిపట్టునే ఉండి చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని పేర్కొంటున్నారు. చలికాలంలో తక్కువ వెలుతురు మూడ్‌ను డిస్ట్రబ్ చేస్తుందని, ప్రకాశవంతమైన వెలుగు ఉన్నప్పుడే కార్యకలాపాలు చేస్తే మంచిది అని అంటున్నారు. అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఉల్లాసంగా గడపడం కూడా మేలు చేస్తుందని వివరిస్తున్నారు.




మితాహారమే మేలు:
చలికాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మేలు. మామూలుగా చలికాలంలో కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని అనిపిస్తుంది. కానీ సీజనల్‌గా లభించే కూరగాయాలతో వంట వండుకుని తింటే మేలు జరుగుతుంది.
తగిన జాగ్రత్తలు తీసుకున్నా చలికాలంలో శరీరం వివిధ వైరస్‌ల బారిన పడుతుంది. ఇలాంటి సమయంలో రక్తంలో చక్కెర శాతం పెరుగుంది. ఇలాంటి సమయాల్లో ఆరోగ్య పరిరక్షణకు తగిన వైద్యం తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు 8 గంటలు నిద్రపోవాలి. తరచూ చేతులు కడుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి




