Health Tips: ఈ బ్లడ్ గ్రూపుల వారికే గుండెపోటు వచ్చే అవకాశాలెక్కువ.. కారణం ఏంటో తెలుసా?

నేడు, గుండె సంబంధిత వ్యాధులు ప్రపంచంలో మరణాలకు అతిపెద్ద కారణంగా నిలిచాయి. ఇటువంటి పరిస్థితిలో, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్న కొన్ని రక్త సమూహాల గురించి పరిశోధకులు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: ఈ బ్లడ్ గ్రూపుల వారికే గుండెపోటు వచ్చే అవకాశాలెక్కువ.. కారణం ఏంటో తెలుసా?
Blood Groups
Follow us
Venkata Chari

|

Updated on: Apr 26, 2022 | 9:15 AM

ప్రపంచవ్యాప్తంగా గుండె(Heart) సంబంధిత వ్యాధుల ముప్పు బాగా పెరగడం మొదలైంది. గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. గుండె సంబంధిత వ్యాధులకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, ఆందోళన లాంటి ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. చాలా సార్లు ప్రజలు గుండె సంబంధిత వ్యాధుల గురించి ముందుగా ఎటువంటి సమాచారాన్ని పొందలేరు. దీని కారణంగా జీవించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే బ్లడ్ గ్రూపు(Blood Group)ల ఆధారంగా దీన్ని నిర్ధారించవచ్చని మీకు తెలుసా? మీ బ్లడ్ గ్రూప్, గుండె ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రతి ఒక్కరి బ్లడ్ గ్రూప్ భిన్నంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, ABO రక్త వ్యవస్థ నుంచి, ఏ బ్లడ్ గ్రూప్‌లోని వ్యక్తులు గుండె జబ్బులకు ఎక్కువగా గురవుతారో కనుగొనవచ్చని పరిశోధకులు అంటున్నారు.

ABO రక్త వ్యవస్థ అంటే ఏమిటి?

ABO వ్యవస్థలో రక్తం వివిధ భాగాలుగా విభజించారు. రక్తంలో A, B యాంటిజెన్‌ల ఉనికి లేదా లేకపోవడం ఆధారంగా రక్తాన్ని వివిధ భాగాలుగా విభజించడం ద్వారా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. దీని ఆధారంగా, వ్యక్తులకు A, B, AB లేదా O బ్లడ్ గ్రూప్ ఉంటుందని తెలిసిందే. A, B, O రక్త సమూహాలను మొదటిసారిగా 1901లో ఆస్ట్రియన్ ఇమ్యునాలజిస్ట్ కార్ల్ ల్యాండ్‌స్టైనర్ గుర్తించారు.

రక్త సమూహాలలో సానుకూల, ప్రతికూల కారకాలు ఎర్ర రక్త కణాలలో ప్రోటీన్ల ఉనికి లేదా లేకపోవడం నుంచి వస్తాయి. మీ రక్తంలో ప్రోటీన్ ఉంటే, మీరు Rh పాజిటివ్, లేకపోతే మీరు Rh నెగటివ్. O బ్లడ్ గ్రూప్ ఉన్న వారిని యూనివర్సల్ డోనర్స్ అంటారు. అదే సమయంలో AB బ్లడ్ గ్రూప్ ఉన్నవారు, వారు ప్రపంచంలోని ఏ వ్యక్తి నుంచి అయినా రక్తం తీసుకోవచ్చు.

2020 సంవత్సరంలో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, A, B బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి థ్రోంబోఎంబాలిక్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే O బ్లడ్ గ్రూప్ ఉన్నవారి కంటే రక్తపోటు ప్రమాదం తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.

O బ్లడ్ గ్రూప్ ఉన్నవారి కంటే A బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి హైపర్లిపిడెమియా, అథెరోస్క్లెరోసిస్, గుండె వైఫల్యం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. అయితే B బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి O ఉన్నవారి కంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.

ఇటువంటి పరిస్థితిలో, A బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో గుండె వైఫల్యం, స్లీప్ అప్నియా, అథెరోస్క్లెరోసిస్, హైపర్లిపిడెమియా, అటోపీ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. థ్రోంబోఎంబాలిక్ వ్యాధులు, హైపర్‌టెన్షన్ ప్రమాదాన్ని పెంచడంతో పాటు, O బ్లడ్ గ్రూప్ ఉన్నవారి కంటే B బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులకు గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ.

ఎందుకు ఇలా జరుగుతుంది?

నాన్-విల్‌బ్రాండ్ ఫ్యాక్టర్‌లో వ్యత్యాసం కారణంగా ఇది జరిగిందని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది రక్తం గడ్డకట్టే ప్రోటీన్, ఇది థ్రోంబోటిక్ సంఘటనలలో కీలక పాత్ర పోషిస్తుంది. నాన్-ఓ బ్లడ్ గ్రూపులు ఉన్న వ్యక్తులు నాన్-విల్‌బ్రాండ్ ఫ్యాక్టర్ అధిక సాంద్రత కారణంగా రక్తం గడ్డకట్టే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఇది O బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో ఉండదు.

నాన్-ఓ బ్లడ్ గ్రూపులు ఉన్న వ్యక్తులకు జీర్ణశయాంతర రక్తస్రావం, హైపర్‌టెన్షన్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. కానీ నాన్-ఓ బ్లడ్ గ్రూపులు ఉన్నవారిలో.. ఓ బ్లడ్ గ్రూపులు ఉన్నవారి కంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

Also Read: Vitamin C: ఈ ఫ్రూట్స్‌లో విటమిన్‌ సి పుష్కలం.. మహిళలు కచ్చితంగా తినాల్సిందే..!

Lemon Side Effects: నిమ్మరసం అతిగా తాగుతున్నారా? అయితే ఈ అనర్థాలు మీరు తెలుసుకోవాల్సిందే

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!