Immunodeficiency: ఈ సమస్యలతో తరచూ బాధపడుతున్నారా..? అయితే జాగ్రత్త.. వాటికి కారణం ఏమిటంటే..?

|

Mar 11, 2023 | 1:37 PM

ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో రోగనిరోధక వ్యవస్థ బలహీనత కారణంగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే రోగనిరోధక శక్తి..

Immunodeficiency: ఈ సమస్యలతో తరచూ బాధపడుతున్నారా..? అయితే జాగ్రత్త.. వాటికి కారణం ఏమిటంటే..?
Immunodeficiency
Follow us on

మన ఆరోగ్యాన్ని అన్ని రకాల సమస్యల నుంచి కాపాడడంలో రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా బలహీనత కారణంగా చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా దీని కారణంగా శరీరం బలహీనంగా మారుతుంది. అయితే రోగనిరోధక వ్యవస్థ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతకంగానూ మారే ఛాన్స్‌ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు తప్పకుండా పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు అతిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో రోగనిరోధక వ్యవస్థ బలహీనత కారణంగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే రోగనిరోధక శక్తి తగ్గడం లేదా తక్కువగా ఉండడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కంటి సమస్యలు: రోగనిరోధక వ్యవస్థ లోపం వల్ల పొడి కళ్ళ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. దీని కారణంగా కళ్లలోకి ఇసుక చేరినట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా కొందరిలో కంటి చూపులు మార్పులు సంభవించి కంటి నుంచి నీరు కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

డిప్రెషన్: రోగనిరోధక శక్తి లోపించడం వల్ల డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లోపం కారణంగా మెదడులో కణాలు సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదలలో తీవ్ర మార్పులు సంభవించి మానసిక సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

చర్మ సమస్యలు: చర్మంపై తరచుగా దద్దుర్ల సమస్యలు వస్తే రోగనిరోధక శక్తి లోపమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్య కారణంగా సోరియాసిస్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ లోపం నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.

జీర్ణ సమస్యలు: జీర్ణ సమస్యలు పోషక విలువలు లేని ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల కూడా వస్తాయి. అయితే రోగనిరోధక వ్యవస్థ లోపం వల్ల కూడా అజర్తీ, జీర్ణ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యల కారణంగా గ్యాస్, అపానవాయువు వంటి తీవ్ర సమస్యలు వస్తాయి.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..