High BP Tips: హైబీపీతో బాధపడుతున్నారా..? అయితే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి వెంటనే కంట్రోల్‌లోకి వస్తుంది..

High BP Tips: ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో హైబీపీ ఒకటి. 30 ఏళ్లు కూడా నిండని వారు కూడా రక్తపోటుతో బాధపడుతున్నారు. మారుతోన్న జీవనశైలి, ఆరోగ్య అలవాట్ల...

High BP Tips: హైబీపీతో బాధపడుతున్నారా..? అయితే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి వెంటనే కంట్రోల్‌లోకి వస్తుంది..
High Bp
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 15, 2021 | 1:09 PM

High BP Tips: ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో హైబీపీ ఒకటి. 30 ఏళ్లు కూడా నిండని వారు కూడా రక్తపోటుతో బాధపడుతున్నారు. మారుతోన్న జీవనశైలి, ఆరోగ్య అలవాట్ల కారణంగా రక్తపోటుతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒక్కసారి హైబీపీ అటాక్‌ అయ్యిందా ఇక జీవితాంతం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్బాల్లో ఇది హృదయ సంబంధిత రోగాలకు సైతం దారి తీస్తుంది. ఇక ప్రతి రోజూ మందులు తీసుకోవాల్సిందే. అయితే మనం తీసుకునే ఆహార పదార్థాలు బీపీని కంట్రోల్‌ చేయడంలో ఉపయోగపడతాయని మీకు తెలుసా.? రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో కీలక పాత్ర పోషించే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఉప్పు వీలైనంత వరకు తగ్గించాలి..

ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉంటే అధిక రక్తపోటుకు దారి తీస్తుందని ఇప్పటికే చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి ఆహారంలో ఉప్పును తగ్గిస్తే రక్తపోటు సమస్యను తగ్గించుకోవచ్చు. సాధారణంగా ఒక వ్యక్తి రోజులో 2.3 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును తీసుకోకూడదు. బీపీతో బాధపడేవారే కాకుండా భవిష్యత్తులో రక్తపోటు రాకూడదని భావించేవారు కూడా ఉప్పు తక్కువ తీసుకోవడం ఉత్తమం.

ఆహారంలో పొటాషియంను పెంచాలి..

రక్తపోటుతో బాధపడేవారు పొటాషియం ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పొటాషియం ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఉన్న సోడియం స్థాయిలను తగ్గిస్తుంది. సాధారణంగా మనం ఉప్పును నేరుగా తీసుకోకపోయినా ప్రాసెస్డ్, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సోడియంను సమతుల్యం చేయడానికి పొటాషియం ఉన్న వాటిని ఎక్కువగా తీసుకోవాలి.

ఆకుపచ్చ కూరగాయలు..

బీపీతో బాధపడేవారు ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఆకు కూరలు, టమోటాలు, బంగాళాదుంపల, చిలగడదుంప, అరటి, అవోకాడో, నారింజ, నట్స్, పాలు, పెరుగు, సాల్మన్, ట్యూనా వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

వ్యాయామం తప్పనిసరి..

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ కచ్చితంగా వ్యాయామాన్ని జీవితంలో ఓ భాగం చేసుకోవాలి. రోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటుతో బాధపడేవారు రోజులో కనీసం కొంత దూరమైన నడవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి.

మద్యం, సిగరెట్లకు గుడ్‌ బై చెప్పండి..

అధిక రక్త పోటుకు ధూమపానం, మద్యం సేవించడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. మద్యం సేవించడం వల్ల 16 శాతం హైబీపీ కేసులు పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. కాబట్టి రక్తపోటుతో బాధపడుతోన్న వారు వెంటనే ఈ రెండు అలవాట్లకు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: పార్లమెంటులో చర్చలేవీ..? సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ విచారం.. చట్టాలపై క్లారిటీ లేదని వ్యాఖ్య

ఆఫ్ఘన్ దేశస్థులకు ఆశ్రయం కల్పించే యోచనలో భారత్..? అదే బాటలో అమెరికా, కెనడా..?

భారత్ తో భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలన్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. సాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!